Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

సంఘమునకు ఉపదేశములు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అధ్యాయము 48 - పారిశుధ్యము యొక్క ప్రాముక్యత

    మంచి ఆరోగ్యముండవలెనన్న మనకు మంచి రక్తముండవలెను. కారణమేమనగా జీవమునకు మూలము రక్తమే. అది భస్మీకరణ వలన శరీరమునకు కలిగిన నష్టమును పరిహరించి శరీరమును పోషించును. మంచి ఆహారపదార్థములు సరఫరా చేయబడినప్పుడు, పరిశుద్ధమైన గాలిచే శుద్ధిపర్చబడి బలపర్చబడినపుడు రక్తము ప్రతి అవయవమునకు జీవమును బలమును కలుగజేయును. రక్త సంచారము ఎంత నిర్దుష్టముగా నుండునో అంత బాగుగా ఈ పని సాగును. 1MH 271;CChTel 405.1

    రక్త సంచారమును అదుపు చేయుటకు అతి సులభమైన తృప్తికరమైన విధానములలో స్నానమొకటి. చన్నీటి స్నానము అమోఘమైన బలవర్ధకౌషధము. వేడి నీటి స్నానము చర్మరంధ్రములను తెరచి తద్వారా మలిన పదార్థ విసర్జనమునకు సహాయపడును. వేడి నీటి స్నానము చన్నీటి స్నానము రెండును నరములను శాంతిపరిచి సమాన రక్త సంచారము కలుగజేయును. CChTel 405.2

    వ్యాయామము రక్త సంచారమునకు చరుకుదనము పుట్టించి రక్త స్రావమును సమానము చేయును. కాని సోమరితనముగా నుండట వలన రక్తము బాగుగ ప్రసరించదు. జీవమునకును ఆరోగ్యమునకును అత్యవసరమగు మార్పులు జరుగవు. చర్మము కూడ మందమగును. వ్యాయామము ద్వారా రక్త ప్రసారమునకు లభించు అధికమైన స్వచ్ఛమయిన వాయువు. ఈ స్థితియందున్నప్పటివలె సోమరితనముగ నున్నప్పుడు శరీరమందలి మలిన పదార్థములు బహిష్కరింబడవు. 2MH 237,238; CChTel 405.3

    ఊపిరితిత్తులకు సాధ్యమైనంత స్వేచ్ఛయుండవలెను. నిరాటంక శ్వాసక్రియ వలన వాని శక్తి అధికరించును. అవి అణచబడినపుడు వారి శక్తి తగ్గును. ఈ హేతువు చేతనే బల్ల వెనుక కూర్చొని మెదడుతో చేయు పని యొక్క దుష్పలితములు హెచ్చుచున్నవి. ఈ స్థితియందు దీర్ఘముగా ఊపిరి తీసికొనుట దుర్లభము. గాలిని అల్పముగా పీల్చుట యలపడి శ్వాసకోసముటు తమ స్థితిస్థాపక శక్తిని కోల్పోవును. CChTel 405.4

    ఇట్లు వలసినంత ప్రాణవాయువు ఊపిరి తత్తులతో నుండదు. రక్తము మందముగా ప్రసరిచును. ఊపిరి విడుచుటద్వారా విసర్జించవలసిన మలిన పదార్థములు అచ్చటనే యుండును. ఆ కారణమున రక్తము చెడును. ఊపిరి తిత్తులకేకాక అన్నకోశము, కాలేయము, మెదడుకు కూడ నష్టము కలుగును. చర్యము పాలిపోవును. ఆజీర్తి సంప్రాప్తమగును. వాృదయ స్పందనము మందగిల్లును. తలంపులస్పష్టమై తికమక పరిస్థితులు పొటమరించును. ఉత్సాహము క్షీణించును. శరీరమంతయు మందకోడిగా నుండి రోగమునకు గురియగుటకు సిద్ధముగ నుండును. CChTel 406.1

    ఊపిరితిత్తులు నిత్యము విషవాయువును విసర్జించును. వానికి సర్వదా నిర్మలమైన వాయువు అవసరము. స్వచ్ఛముకాని గాలి ప్రాణవాయువు నీయజాలదు. రక్తయు నూత్నబలము నొందకయే మెదడు, తదితర అవయమునకు వెళ్లును. కనుక ధారాళమైన వాయు సంచారము అవసరము. సరియై న వాయుసంచారములేని గదులలో నివసించుటద్వారా శరీరమందయు బలహీనమగును. అట్టి శరీరము చలికి తాళలేదు. చలిలో స్వల్పకాలమున్నచో వ్యాది సంప్రాప్తమగును. పెక్కుమంది స్రీలు పాలిపోయి బలహీనులగుటకు ఎల్లప్పుడు ఇండ్లలో నుండుటయే కారణము. పీల్చిన గాలిచే వారు పదేపదే పీల్చెదరు. ఊపిరితిత్తుల ద్వారాను, చర్మరంధ్రములద్వారాను విడిచిన విషపదార్థములతో ఆగాలి నిండు వరకు వారు దానినే పీల్చెదరు. ఇట్లు మలినపదార్థములు తిరిగి రక్తమున ప్రవేశించుచున్నవి. 3MH 272-274;CChTel 406.2

    అనేకులు వ్యాది బాధితులగుటకు కారణమేమనగా రాత్రులందు వారు తమ గదుల లోనికి మంచి గాలిని చొరనీయరు. ఆకాశమందలి నిర్మలవాయువు మనకు గొప్ప ఆశీర్వా దకరము. 42T 528;CChTel 406.3

    భౌతిక మానసిక ఆరోగ్యమునకు పారిశుధ్యము ఆవశ్యకము, చర్మముద్వారా శరీర మలిన పదార్థములు నిత్యము బహిష్కరించబడును. చర్మము యొక్క వేవేల రంధ్రములు సత్వర శ్వాస క్రియ ద్వారా శుభ్రముగా నుంచబడకున్నచో త్వరలో మూయబడును. చర్మము ద్వారా విసర్జించబడ వలసిన మలిన పదార్ధాములు విసర్జకావయవములకు అదనపు భారము కలిగించును. CChTel 406.4

    అనుదినము ఉదయము లేక సాయంకాలము నులువెచ్చని నిళ్ల స్నానము ద్వారా అనేకులకు మేలు చేకూరును. సరిగా స్నానము చేసినచో ఆ స్నానము రొంప పట్టుటకు గల అవకాశమును హెచ్చించుటకు బదులు రొంప పట్టకుండ శరీరమునకు బలము చేకూర్చును. ఏలయనగా అట్టి స్నానము రక్త ప్రసరణమును వృద్ది చేయును. రక్తము పైకి తేబడును. సులభమైన ప్రసరణ సాధ్యమగును. మనస్సు, శరీరములు సమానముగా బలపడును. కండరములు మెత్తబడును. మెదడు చురుకుగా తలంచుటకు శక్తి నొందును. స్నానము నరములను శాంతి పరచును. స్నానము ప్రేవులకు అన్నకొశమునకు కాలేయమునకు సహాయముచేసి వానికి ఆరోగ్యము కలిగించి జీర్ణశక్తిని పెంపు చేయును. CChTel 407.1

    దుస్తులను శుభ్రముగా నుంచుకొనుట కూడ ప్రాముఖ్యము. కేశ రంధ్రముల ద్వారా బహిష్కరింపబడు మలిన పదార్థమును దుస్తులు పీల్చుకొనును. ఆ దుస్తులను తరచు మార్చి ఉదుకకున్నచో మలిన పదార్థమును దుస్తులు పీల్చుకొనును. ఆ దుస్తులను తరచు మార్చి ఉదకకున్నచో మలిన పదార్థము తిరిగి పీల్చబడును. CChTel 407.2

    ప్రతివిధమైన ఆశుభ్రతయు రోగమునకు దారితీయును. క్రుళ్లిన పదార్థములోని చీకటిగం అశుభ్రమైన మూలలలోను తేనుగనుండు ప్రదేశములలోను పెంటకుప్పలలోను మరణమును కలుగజేయు క్రిములు కొల్లలుగా నుండును. పనికిరాని కూరగాయలు, సడిపోయిన ఆకులు ఇంటికి సమీపమున ఉండి క్రుళ్లి గాలిని విషకలితము చేయనీయరాదు. ఇంటిలో అశ్రుభ్రమైన పదార్థముగాని క్రుళ్లిన పరాక్థమునుగిని ఉంచరాదు. CChTel 407.3

    సంపూర్ణ పారిశుధ్యము, అధిక సూర్యరశ్మి గృహమునందు ప్రతి విషయమందును శుభ్రత కలిగి యుండుట రోగ నిరోధమునకు గృహమునందుండు వారి ఆనందమునకు బలమునకు ప్రాముఖ్యములు. 5MH 276;CChTel 407.4

    తాము మలిన దేహములతోను, మాసి చినిగిన దుస్తులతోను ఉండుట చూచి దేవుడు సంతసించడని పిల్లలకు నేర్చించుడి, దుస్తులను పరిశుభ్రముగా నుంచుకొనుట తలంపులను శుద్ధముగా నుంచుకొనుటకొక సాధనము. ముఖ్యముగా చర్మము నంటియుండు దుస్తులను శుభ్రముగా నుంచవలెను. CChTel 407.5

    అశుభ్రమయిన లేక అపవిత్రమైన మార్గమున సత్యమెన్నడును తన మృదుల పాదమును మోపడు. ఇశ్రాయేలియులు శుభ్రతాభ్యాసములు కలిగి యుండవలెనని కోరిన ఆ ప్రభువే నేడు తన ప్రజల గృహములలో అశుభ్రతను సహించడు. CChTel 407.6

    గృహమందుండు అశుభ్రమైన ,అలక్ష్యము చేయబడిన మూలలు ఆత్మయందు ,అలక్ష్యము చేయబడిన మూలలకు దారితీయును. CChTel 408.1

    పరమ పరిశుభ్రము ,పరిసుద్ధమునైన స్థలము. పరిశుద్ధ పట్టణ ద్వారములను దాటు వారు ఇక్కడ అంతరంగికముగాను ,బాహ్యముగాను ,పరిశుద్ధతను ధరించు కొనవలెను. 6MLT 129. CChTel 408.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents