Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తిండిబోతు తనం ప్రధాన నేరం

    (1880) 4T 454,455 CDTel 130.3

    217. కొందరు తమ తిండి పై నియంత్రణ పాటించరు. ఆరోగ్యాన్ని పాడు చేసుకుని రుచిని తృప్తి పర్చుకుంటారు. ఫలితంగా మనసు మసకబడుతుంది. తలంపులు మందకొడిగా సాగుతాయి. ఆత్మోపేక్ష మితం కలిగివుంటే ఏమి సాధించగలరో దాన్ని సాధించటానికి అసమర్థులవుతారు.CDTel 130.4

    పౌలు ఆరోగ్య సంస్కర్త. పౌలంటున్నాడు, “ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి, దానిని లోబరచుకొనుచున్నాను.” దేవుని మహిమ పర్చేందుకు ఉపయోగించటానికి తన శక్తులన్నింటిని బలంగా ఉంచుకోటానికి తనపై బాధ్యత ఉన్నదని అతడు భావించాడు. పౌలు మితం పాటించని ప్రమాదంలో ఉంటే మనం ఇంకా పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఎందుకంటే శరీరాత్మలతో దేవుణ్ని మహిమ పర్చాల్సిన అవసరాన్ని పౌలు గుర్తించనట్లు మనం గుర్తించటం లేదు. మితిమీరి తినటం ఈ యుగంలో ప్రబలుతున్న పాపం.CDTel 130.5

    దైవవాక్యం తిండిబోతుతనాన్ని తాగుబోతుతనాన్ని ఒకే గాటన కట్టుతున్నది. దేవుని దృష్టిలో ఈ పాపం ఎంత హేయమయ్యిందంటే, ఆహారం విషయంలో నియంత్రణకు లొంగకుండా తనకు రుచిగా ఉన్న ప్రతీ పదార్ధాన్ని కబళించే బిడ్డను రాళ్లతో కొట్టి చంపేందుకు ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇశ్రాయేలు అధిపతుల ముందుకి తీసుకురావాలని దేవుడు మోషేని ఆదేశించాడు. తిండిబోతు పరిస్థితి బాగుపడటానికి ఆస్కారం లేనిదిగా పరిగణించటం జరిగేది. అతడు ఇతరులికి ఉపయోగపడనివాడు. అతడు తనకే ఓ శాపంగా మారేవాడు. ఏ విషయంలోను అతడిమీద ఆధారపడటం నిరుపయోగమయ్యేది. అతడి ప్రభావం అంటువ్యాధిలా ఇతరులికి పాకేది. అతడి లోపాలు ఇతరుల్లో పునరావృతమై కొనసాగుతాయి గనుక అతడు లేకపోతే లోకం బాగుపడుతుందన్న అభిప్రాయం ఉండేది. తాము దేవునికి జబాబుదారులమన్న స్పృహగలవారెవరూ పాశవిక ప్రవృత్తులు తమ మనసును నియంత్రించటానికి సమ్మతించరు. ఇది చేసేవారు ఎవరైనా, ఎంతటివారైనా, తాము క్రీస్తు భక్తులమని ఎంత గొప్పగా చెప్పుకునే వారైనా వారు క్రైస్తవులు కారు. క్రీస్తు ఉపదేశం ఇది, “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి.” దేవుడు తన పరిధిలో ఎలా పరిపూర్ణుడో అలా మనం మన పరిధిలో పరిపూర్ణులం కావచ్చునని ఇక్కడ ఆయన సూచిస్తున్నాడు.CDTel 130.6