Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    నరాల ఉద్రేకాన్ని సృష్టిస్తాయి, శక్తిని కాదు

    (1879) 4T 365 CDTel 441.3

    737. నీవు భయానికి ఉద్రేకానికి ఎక్కువ గురి అవుతున్నావు. టీ కి నరాల్ని ఉత్తేజపర్చే ప్రభావం ఉంది. కాఫీ మెదడుని మొద్దుబార్చుతుంది. టీ, కాఫీ రెండూ హానికలిగిస్తాయి. ఆహారం విషయంలో నీవు జాగ్రత్త వహించాలి. నీవు మిక్కిలి ఆరోగ్యదాయకమైన, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మానసిక ప్రశాంతతని కాపాడుకుని ఉద్రేకపడి, తీవ్రంగా ఆగ్రహావేశాలకి లోను కాకుండా చూసుకోవాలి.CDTel 441.4

    (1905) M.H.326,327 CDTel 442.1

    738. టీ ప్రేరకంగా పనిచేస్తుంది. కొంత మేరకు మత్తు కలిగిస్తుంది కూడా. కాఫీ ప్రభావం అనేక ఇతర జనప్రియ పానీయాల ప్రభావం ఒకటే. అవి ముందు ఉత్సాహ పర్చుతాయి. కడుపుకి సంబంధించిన నరాలు ఉద్రేకానికి గురి అవుతాయి. ఇవి మెదడుకి మంటను పంపుతాయి. గుండెకి ఎక్కువ పని ఇవ్వటానికి, వ్యవస్థ అంతటికి స్వల్ప వ్యవధి శక్తి ఇవ్వటానికి మెదడు తిరిగి ఉత్తేజితమౌతుంది. అలసట తెలియదు. శక్తి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. మేధ మేల్కొంటుంది. ఊహ మరింత స్పష్టంగా ఉంటుంది.CDTel 442.2

    ఈ ఫలితాల కారణంగా అనేకులు తమ టీ, లేక కాఫీ తమకు ఎంతో మేలు చేస్తున్నదని భావిస్తారు. కాని ఇది పొరపాటు. టీ, కాఫీలు వ్యవస్తకి పోషణనివ్వవు. జీర్ణక్రియ చోటుచేసుకోటానికి సమయం లభించకముందే వాటి ప్రభావం ఉత్పత్తి అవుతుంది. శక్తిగా కనిపించేది నిజానికి నరాల ఉత్తేజం మాత్రమే. ప్రేరేపకం ప్రభావం పోయినప్పుడు ఆ అస్వాభావిక శక్తి మాయమవుతుంది. ఫలితంగా దానికి దీటైన స్థాయిలో మందకొడితనం, అశక్తత ఏర్పడతాయి.CDTel 442.3

    నరాల్ని కమల జేసే ఈ పదార్థాలని ఎడతెగకుండా వాడటం వల్ల తలనొప్పి, అనిద్ర, గుండెదడ, అజీర్తి, వణకు ఇంకా అనేక కీడులు సంభవిస్తాయి. ఎందుకంటే అవి జీవశక్తుల్ని క్షీణింపజేస్తాయి. అలసిన నరాలకు కావలసింది ఉత్తేజం, అధిక శ్రమ కాదు. విశ్రాంతి, ప్రశాంతత. పూర్తిగా ఖర్చయిన తన శక్తుల్ని భర్తీ చేసుకోటానికి ప్రకృతికి సమయం అవసరమౌతుంది. దాని శక్తుల్ని ఉత్తేజకాల అంకుశంతో పొడిచినప్పుడు, కొంత కాలం ఎక్కువ సాధించటం జరుగుతుంది. కాని వ్యవస్థ వాటిని తెంపు లేకుండా వినియోగించటం ద్వారా బలహీనమయ్యేకొద్దీ ఆశించిన మేరకు శక్తుల్ని మేలుకొల్పటం క్రమేపి కష్టమౌతుంది. పేరేపకాలకి డిమాండును నియంత్రించటం మరింత కష్టమౌతుంది. చివరికి చిత్తం లొంగిపోటం, అస్వాభావిక వాంఛల్ని కాదనలేని శక్తి నశించటం జరుగుతుంది. బలమైన, మరింత శక్తిమంతమైన ప్రేరేపకాల్ని కోరుతూ పోవటం, చివరికి అలసిపోయిన ప్రకృతి ఇక స్పందించలేక పోవటం జరుగుతుంది.CDTel 442.4

    [టీ, కాఫీ కడుపుని నాశనం చేస్తాయి-722]CDTel 442.5

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents