Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    వినిగర్ అలవాటుతో పోరాటం

    ఉత్తరం 70, 1911 CDTel 507.3

    6. నీ ఉత్తరం ఇప్పుడే చదివాను. రక్షణ పొందటానికి భయంతోను వణకుతోను కృషిచేస్తున్నట్లు కనిపిస్తున్నావు. ఈ కృషిలో కొనసాగాల్సిందిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెదకటంలో నీకు అడ్డుతగిలే సమస్తాన్నీ తోసిపుచ్చమని నీకు హితవు చెబుతున్నాను. జయించటంలో నీకు ప్రతిబంధకమయ్యే ప్రతీ వాంఛను విసర్జించు. నీకు సహాయం అవసరమన్న విషయాన్ని గ్రహించినవారిని ప్రార్థించమని కోరు.CDTel 507.4

    ఒకప్పుడు నేను నీవున్న పరిస్థితి వంటి పరిస్థితిలో ఉన్నాను. వినగర్ కి అలవాటు పడ్డాను. కాని ఈ అలవాటుని దేవుని సహాయంతో విడిచి పెట్టాలని నిశ్చయించుకున్నాను. ఈ అలవాటుకి బానిస కాకూడదన్న కృతనిశ్చయంతో పోరాడాను.CDTel 508.1

    కొన్ని వారాలు జబ్బు పడ్డాను. ప్రభువుకి అంతా తెలుసు అని నాలో నేను అనుకొని ధైర్యపడ్డాను. నేను బతకటం కష్టమని అందరూ తలంచారు. మేము పట్టుదలతో ప్రభువుకి ప్రార్థనలు చేశాం. నేను కోలుకోటానికి విశ్వాస ప్రార్థనలు ప్రభువు సన్నిధికి వెళ్లాయి. వినిగర్ వాంఛను ప్రతిఘటించటం కొనసాగించాను. తుదకు జయించాను. ఇప్పుడు నాకు దానిపట్ల ఎలాంటి కోరికాలేదు. అనేక విధాలుగా ఈ అనుభవం నాకు ఎంతో విలువైనది. నేను సంపూర్ణ విజయం సాధించాను.CDTel 508.2

    నీకు ఉద్రేకం కలగటానికి సహాయపడటానికి ఈ అనుభవాన్ని నీకు చెబుతున్నాను. సోదరీ, ఈ పరీక్షలో నీకు గెలుపు లభిస్తుందని ప్రతీ అవసర సమయంలో దేవుడే తన బిడ్డలకు సహాయకుడని నీవు వెల్లడి చేస్తావని నా నమ్మకం. ఈ అలవాటుని జయించాలన్న కృత నిశ్చయంతో ఎడతెగకుండా పోరాడితే నీకు కలిగే అనుభవం సమున్నతంగా ఉంటుంది. ఈ అలవాటును విడిచి పెట్టటానకి స్థిర మనసుతో కృషిచేసినప్పుడు దేవుని వద్దనుంచి నీకు సహాయం వస్తుంది. సోదరీ, ప్రయత్నించు.CDTel 508.3

    ఈ అలవాటును కొనసాగించటం ద్వారా నీవు దాన్ని గుర్తించనంత కాలం నీ చిత్రంపై సాతాను తన పట్టును బిగించి, దాన్ని తనకు అనుకూలంగా మలుచు కుంటాడు. కాని నీవు జయించటానికి నిశ్చయించుకున్నట్లయితే ప్రభువు నిన్ను స్వస్తపర్చి, ప్రతీ శోధనను ప్రతిఘటించటానికి శక్తినిస్తాడు. క్రీస్తు నీ రక్షకుడని నిన్ను కాపాడేవాడని నిత్యం గుర్తుంచుకో!CDTel 508.4

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents