Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరిహారాత్మక ఆహారం

    (1864) Sp. Gifts Iv, 133,135 CDTel 315.7

    460. తరచుగా తినటం, ఎక్కువ పరిమాణం తినటం జీర్ణమండల అవయవాలకి ఎక్కువ శ్రమ కలిగించి, శరీర వ్యవస్థలో జ్వర పరిస్థితిని సృష్టిస్తుంది. రక్తం మలినమౌతుంది. అందువల్ల రకరకాల వ్యాధులు సంభవిస్తాయి. వైద్యుణ్ని పిలవటం, అతడు మందులివ్వటం, వ్యాధి తాత్కాలికంగా ఉపశమించటం జరుగుతుంటుంది గాని అది వ్యాధిని స్వస్తపర్చలేదు. అది వ్యాధి రూపాన్ని మార్చవచ్చు. కాని నిజమైన కీడు పదిరెట్లు పెరుగుతుంది. దేహంలో పోగుపడ్డ మలిన పదార్ధాల్ని తొలగించటానికి ప్రకృతి తన శక్తి కొద్దీ పనిచేస్తుంది. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీళ్లు వంటి సామాన్య దీవెనల సహాయంతో దాని పనిని అది చెయ్యటానికి ప్రకృతిని విడిచి పెడితే వేగవంతమైన, సురక్షితమైన స్వస్తత కలుగుతుంది.CDTel 315.8

    అలాంటి పరిస్థితిలో ఉండి బాధపడే వారు తమకు ఇతరులు చెయ్యలేని మేలుని తమకు తాము చేసుకోగలుగుతారు. వారు ప్రకృతి మీద మోపే భారాన్ని తగ్గించటం మొదలు పెట్టాలి. దానికి కారణాన్ని తొలగించాలి. కొద్దికాలం ఉపవాసం చేసి కడుపుకి కాస్త విశ్రాంతి ఇవ్వండి. నీటిని జాగ్రత్తగా అవగాహన పూర్వకంగా వినియోగించటం ద్వారా శరీర వ్యవస్థలోని జ్వరపరిస్థితిని తగ్గించండి. ఈ ప్రయత్నాలు వ్యవస్థలోని మలినాల్ని తొలగించటానికి ప్రకృతి చేసే కృషికి దోహదపడతాయి. కాని సాధారణంగా బాధ పడుతున్న వ్యక్తులు సహనాన్ని కోల్పోతారు. సంయమనం పాటించి కొద్దిపాటి ఆకలి భరించటానికి ఇష్టపడరు....CDTel 316.1

    రోగి తన ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించకపోతే, నీటి వాడకం వల్ల కలిగే మేలు ఏమంత ఉండదు.CDTel 316.2

    అనే కులు ఆరోగ్య చట్టాల్ని అతిక్రమిస్తూ నివసిస్తున్నారు. తమ అన్నపానాలకి పనిచేసే కాలానికి సంబంధించిన అలవాట్లుకి తమ ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి వారు అజ్ఞానులు. ప్రకృతి తాను గురి అవుతున్న దుర్వినియోగం గురించి వ్యవస్థలో నొప్పులు బాధలద్వారా తన నిరసనని తెలియజేసే వరకు వారు కళ్లు తెరిచి తమ వాస్తవిక పరిస్థితిని గుర్తించరు. అప్పుడైనా బాధితులు తమ పనిని సరిగా మొదలు పెట్టి, తాము నిర్లక్ష్యం చేసిన సామాన్య సాధనాల్ని అనగా నీరు, సరిఅయిన ఆహారం తీసుకోటం మొదలు పెడితే, ప్రకృతికి కావలసిన, దానికి ఎప్పుడో అందివుండాల్సిన సహాయం లభిస్తుంది. ఈ మార్గాన్ని అవలంబిస్తే రోగి సామాన్యంగా అశక్తుడు కాకుండా కోలుకుంటాడు.CDTel 316.3

    (1905) M.H.235 CDTel 316.4

    461. నిగ్రహం లేని తిండి తరచు వ్యాధికి కారణమౌతుంది. ప్రకృతి పై పడే అనవసర భారాన్ని నివారించటమే అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్య. పెక్కు అస్వస్థతల సందర్భాల్లో, అధిక శ్రమకు గురి అయిన జీం మండల అవయవాలకి విశ్రాంతికి అవకాశం లభించేందుకు రోగి ఒకటి రెండు పూటలు ఉపవాసం చెయ్యటం స్వస్తత చేకూర్చుతుంది. మెదడు పనివారికి పండ్ల ఆహారం తరచు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తుంది. స్వల్ప కాలం ఆహారం పూర్తిగా మాని, ఆ తర్వాత సామాన్యమైన ఆహారం మితంగా భుజించటం అనేకసార్లు ప్రకృతి సొంత పునరుద్ధరణ కృషి ద్వారా స్వస్తతకు దారి తీస్తుంది. ఒకటి రెండు మాసాల మితాహారం ఆత్మత్యాగమే ఆరోగ్యానికి మార్గమని అనేకమంది బాధితులుకి నమ్మకం పుట్టిస్తుంది.CDTel 316.5