Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    [సందర్భానికి 347 చూడండి]

    R.&.H. జూలై 29,1884 CDTel 185.4

    290. క్రమరహితంగా ఎప్పుడనుకుంటే అప్పుడు చిరుతిళ్లు తినటమే గాక రోజుకి మూడుపూటలు భోజనం చెయ్యటం అనేకమంది లోకస్తుల నడుమ సర్వసాధారణం. రాత్రి భోజనం సాధారణంగా చాలా పెద్దదిగా ఉంటుంది. తరచు పడుకోకముందు దాన్ని తీసుకోటం జరుగుతుంది. ఇది ప్రకృతి క్రమాన్ని తారుమారు చేస్తుంది. దినంలో అంత ఆలస్యంగా కడుపు నిండా భోంచెయ్యకూడదు. ఈ వ్యక్తులు తమ అలవాటు మార్చుకుని రోజుకి రెండుపూటలే భోంచేసి మధ్యమధ్య ఏపిల్ పండు, గింజలు లేక ఏరకమైన పండ్ల వంటి చిరుతిళ్లు తినకుండా ఉంటే దాని ఫలితంగా ఆరోగ్యదాయకమైన ఆకలి మంచి ఆరోగ్యం వారికి ఉంటాయి.CDTel 185.5

    R.&.H. జూలై 29,1884 CDTel 185.6

    291. కొందరు ప్రయాణం చేసేటప్పుడు తమకు అందుబాటులో ఉన్న తినుబండరాల్ని దాదాపు నిత్యం తింటూనే ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. బుద్దిలేని, మానసిక భారం అంటే ఏమిటో తెలియని, జంతువులు ఇలా తిని హానికి గురికాకుండా ఉండవచ్చు గాని దేవునికి మానవాళికీ ఉపయోగించాల్సిన మానసిక శక్తులు గల బుద్ధిజీవులైన మానవులికి అవి ఆదర్శం కావు.CDTel 185.7

    హెల్త్ రిఫార్మర్, జూన్, 1878 CDTel 186.1

    292. భోజన ప్రియత్వాన్ని ప్రోత్సహించే విందులు, ఆసమయాల్లో తీసుకున్న ఆహారం వాటి ప్రభావాన్ని శరీర వ్యవస్థలోని ప్రతీ తంతువుమీద విడిచి పెడతాయి.CDTel 186.2

    (1892) G.W. 174 (పాతముద్రణ) CDTel 186.3

    293. అనేకులు ఆరోగ్య చట్టాల్ని లెక్క చెయ్యకుండా ఎప్పుడూ ఏదో తింటూనే ఉంటారు. అప్పుడు వారి మనసు చీకటి కమ్ముతుంది. మనుషులు తమ అలవాట్లు అభ్యాసాల్లో అంత నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఈ విషయాల పై దేవుడనుగ్రహించిన వెలుగు విషయంలో అంత ఉదాసీనంగా ఉన్నప్పుడు దేవుడు వారిని తన జ్ఞానంతో నింపి ఎలా గౌరవిస్తాడు? సహోదరులారా, స్వార్ధాశల విషయంలో మీరు మనసు మార్చుకోటానికి ఇది సమయం కాదా?CDTel 186.4

    R.& H., మే 8, 1883 CDTel 186.5

    294. మధ్యమధ్య చిరుతిళ్లు- ఒక ఏపిల్ సయితం- లేకుండా రోజుకి మూడుపూటలు తినటం మాత్రమే హద్దుగా ఉండాలి. దీనికి మించి తిండి సాగించేవారు ప్రకృతి చట్టాల్ని అతిక్రమించి శిక్షను అనుభవిస్తారు.CDTel 186.6

    [ఈ నిబంధనను నిర్లక్ష్యం చేసే వాక్య సేవకులు-227] CDTel 186.7

    [శిబిర సమావేశాల్లో చిరుతిళ్లు తినటం-124]CDTel 186.8

    [పిల్లలు భోజనాలకి మధ్య క్యాండీలు, పండ్లు, గింజల పప్పు వంటివేమీ తినకూడదు-344]|CDTel 186.9

    [పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు తిననివ్వటం-348,355,361] CDTel 186.10

    [విద్యార్థులుకి ఫలితాలు-246]CDTel 186.11