Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    దానియేలు ఆదర్శం

    (1890)C.T.B.H.25-28 CDTel 18.2

    33. మిత భోజన పానాల అంశాన్ని సరిగా అవగతం చేసుకోటానికి బైబిలుని దృష్టిలో ఉంచుకుని పరిగణించాల్సి ఉంటుంది. బబులోనురాజు ఆస్థానంలో దానియేలు అతడి హెబ్రీ సహచరుల చరిత్రలో మితాహార పాన నియమ ఫలితం ఉదాహరణకన్నా సమగ్రమైన, శక్తిమంతమైన ఉదాహరణ మనకు మరెక్కడా కనిపించదు..CDTel 18.3

    దేవుడు ఎల్లప్పుడు న్యాయాన్ని ధర్మాన్ని ప్రేమిస్తాడు. ఆ మహావిజేత జయించిన దేశాలన్నింటి నుంచి మిక్కిలి ప్రతిభావంతులైన యువకులు బబులోనులో సమావేశమయ్యారు. వారందరిలోనూ ఈ హెబ్రీ బందీలకు సాటి ఎవరూలేరు. నిటారుగా నిలబడే శరీరాకృతి, బలంగా పడే అడుగులు, అందమైన ముఖం, చురకైన బుద్ధి, స్వచ్ఛమైన శ్వాస - ఇవన్నీ మంచి అలవాట్లకు అనేక యోగ్యతా పత్రాలు. తన చట్టాలకు విధేయులైనవారిని ఉత్తములని నిర్దేశిస్తూ ప్రకృతి కురిపించే ప్రశంసలు.CDTel 18.4

    అనంతరయుగాల్లోని యువతకు చరిత్రను పరిశుధ్ధలేఖన పుటల్లో లిఖించటం జరిగింది. మనుషులు ఏమి చేశారో మనుషులు అదే చెయ్యవచ్చు. ఆ హెబ్రీ యువకులు గొప్ప శోధనల మధ్య స్థిరంగా నిలిచి మితానుభవ పక్షంగా ఉత్తమ సాక్ష్యం ఇచ్చారా? నేటి యువత కూడా అలాంటి సాక్ష్యం ఇవ్వవచ్చు.CDTel 18.5

    ఇక్కడ మనకు వస్తున్న పాఠం గురించి ఆలోచించటం మనకు మంచిది. మనకు కలిగే ప్రమాదం కొరతనుంచి కాదు సమృద్ధినుంచి. దైవ సేవ నిమిత్తం తమ శక్తుల్ని నిర్మలంగా కాపాడుకోవాలని ఆశించేవారు, దేవుడు సమృద్ధిగా అనుగ్రహించిన వనరుల వినియోగంలోను హానికరం తుచ్చం అయిన వాటి వాడకం పూర్తిగా విసర్జించటంలోను ఖండితమైన మితాన్ని పాటించాలి.CDTel 19.1

    ఉత్థానమౌతున్న తరం చుట్టూ ఎన్నో ఆకర్షణలున్నాయి. అవి ఆహారం విషయంలో శోధించేందుకు ఉద్దేశించినవి. ప్రధానంగా మన నగరాల్లో ప్రతి విధమైన వినోదం ఇంపుగానూ సులభంగా అందుబాటులోనూ ఉంటుంది. దానియేలులా తమను తాము అపవిత్రపర్చుకోటానికి నిరాకరించేవారు తమ మితానుభవ అలవాట్ల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు. తమకున్న అధిక బలం, అధిక సహనశక్తితో వారికి గొప్ప బ్యాంకు నిక్షేపం ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో ఆ నిక్షేపంనుంచి తీసుకోవచ్చు.CDTel 19.2

    సరియైన భౌతిక అలవాట్లు మానసిక ఔన్నత్యాన్ని వృద్ధిపర్చుతాయి. మానసిక శక్తి, శారీరకబలం, దీర్ఘాయుర్ధాయం మార్పులేని చట్టాల పై ఆధారపడి ఉంటాయి. ఇది ప్రమాదవశాత్తూ సంభవించేది కాదు. ప్రకృతి చట్టాల్ని ఉల్లంఘించే మనుషుల్ని ఉల్లంఘన పర్యవసానాలనుంచి కాపాడటానికి ప్రకృతి ప్రభువు కలుగజేసుకోడు. “ప్రతీ మనిషి భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉంటుంది” అన్న నానుడిలో వాస్తవం చాలా వుంది. తమ కుమారులు కుమార్తెల ప్రవర్తనకు, విద్యకు శిక్షణకు తల్లిదండ్రులు బాధ్యులు కాగా లోకంలో మన స్థితిని ప్రయోజకత్వాన్ని చాలామట్టుకు మన కార్యాలే నిర్ణయిస్తాయి. దానియేలు అతడి సహచరులు తమ బాల్యంలో పొందిన సరియైన విద్య ఫలాన్ని ఆనందించారు. అయితే వారు అలా ఉండటానికి కేవలం ఈ ఉపకారాలే హేతువు కాదు. వారు తమంతట తాము నిర్ణయం తీసుకుని కార్యాచరణ చేపట్టాల్సిన సమయం వచ్చింది. వారి భవిష్యత్తు వారు చేపట్టే కార్యాచరణ మీద ఆధారపడి ఉంది. అప్పుడు వారు తమ బాల్యంలో నేర్చుకున్న పాఠాల్ని ఆచరణలో పెట్టాలని నిశ్చయించుకున్నారు. జ్ఞానానికి మూలమైన దైవభీతే వారి ఔన్నత్యానికి పునాది. ఆయన ఆత్మ ప్రతీ యధార్థ సంకల్పాన్నీ, ప్రతీ ఉన్నత తీర్మానాన్ని బలపర్చింది.CDTel 19.3

    R.&H., జనవరి 25,1881 CDTel 20.1

    34. ఈ శిక్షణ పాఠశాలలోని యువకులు దానియేలు, హనన్యా, మిషాయేలు అజర్యా రాజభవనంలో నివసించటమేకాదు రాజు భోజనబల్ల నుంచి వచ్చే భోజనాన్ని తినటానికి ద్రాక్షరసాన్ని తాగటానికి ఏర్పాటు జరిగింది. దీని అంతటిలోను రాజు వారి విషయంలో గొప్ప గౌరవాన్ని ప్రదర్షించటమేకాక వారికి ఉత్తమ శారీరక మానసిక అభివృద్ధి జరిగేటట్లు చూడాలని ఆలోచించాడు.CDTel 20.2

    రాజు ముందు పెట్టబడ్డ ఆహారంలో, పందిమాంసం, మో షేధర్యశాస్త్రం అపవిత్రంగా పేర్కొన్న, ప్రత్యేకించి హెబ్రీయులకి నిషిద్ధమైన, ఇంకా ఇతర మాంస పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ దానియేలు ముందు ఓ కఠిన పరీక్ష ఉంది. ఆహార పానాల విషయంలో అతడు తన తండ్రులు పితరుల బోధనలు ఆచరించి రాజును నొప్పించి తన హోదాను మాత్రమేకాక తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవాలా లేదా ప్రభువు ఆజ్ఞను పక్కన పెట్టి, రాజు అభిమానాన్ని నిలుపుకుని మానసికమైన గొప్ప ఉపకారాలు లోక ప్రతిష్ఠ పొందాలా?CDTel 20.3

    ఈ సందిగ్ధ స్థితిలో దానియేలు ఎక్కువసేపు లేడు. పర్యవసానం ఏమైనా తాను నమ్మినదానికి నిలబడాలని తీర్మానించుకున్నాడు. “రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని” దానియేలు నిర్ణయించుకున్నాడు.CDTel 20.4

    నేడు క్రైస్తవులుగా చెప్పుకునే వారిలో అనేకమంది దానియేలుకి చాలా పట్టింపు ఉందని అతడు సంకుచితబుద్దిగల మతదురభిమాని అని తీర్పు తీర్చుతారు. లౌకికమైన ప్రతీ ఉపకారాన్నీ మేలును త్యాగం చేయాల్సినంత కఠిన నిర్ణయం తీసుకోటానికి ఆహారపానాలు ఏమంత ప్రాముఖ్యంగల విషయం కాదని భావిస్తారు. అలా ఆలోచన చేసేవారు దేవుని ఖచ్చితమైన ఆదేశాన్ని తోసిరాజని తమ సొంత అభిప్రాయాలే తప్పొప్పుల ప్రమాణమని తలంచి దేవుని మార్గం నుంచి తొలగి నివసించామని తీర్పుదినాన గ్రహిస్తారు. తమకు ప్రాముఖ్యం కానిదిగా కనిపించినదాన్ని దేవుడలా పరిగణించలేదని ఆయన ఆదేశాల్ని మనం పవిత్రంగా ఆచరించాలని తెలుసుకుంటారు. ఆయన ఆజ్ఞల్లో ఒకటి ఆచరించటానికి సులువుగా ఉంది గనుక దాన్ని అంగీకరించి ఆచరించి, ఇంకొకటి ఆచరించటానికి త్యాగం చేయాల్సింది చాలావుంది కనుక దాన్ని పట్టించుకోనివారు న్యాయం ధర్మం తాలూకు ప్రమాణాన్ని దిగజార్చి తమ ఆదర్శం వల్ల దైవ ధర్మశాస్త్రాన్ని చులకనగా చూడటానికి ఇతరుల్ని తప్పుదారి పట్టిస్తారు. అన్ని విషయాల్లోను “యెహోవా ఈలాగు సెలవిచ్చుకున్నాడు” అన్నది మన నియమం కావాలి...CDTel 20.5

    పాపంవల్ల పడిపోయి భ్రష్టులైన మానవులకు దేవుని కృప ఏమిచెయ్యగలదో అన్నదానికి దానియేలు ప్రవర్తనను చక్కని ఉదాహరణగా సమర్పించటం జరిగింది. అతడి ఉత్తమ, స్వార్థరహిత జీవిత చరిత్ర మానవాళికి ప్రోత్సాహాన్నందిస్తుంది. శోధనను ప్రతిఘటించటానికి, కఠిన శ్రమలు పరీక్షల నడుమ నిజానికి ధృఢంగా, వినయంగా నిలబడటానికి దానినుంచి మనం స్ఫూర్తిని పొందగలం.CDTel 21.1

    తాను నిష్ఠగా ఆచరిస్తున్న మితానుభవ అలవాట్లను విడిచి పెట్టటానికి దానియేలుకి మంచి సాకులభించేది. అయితే లోకంలో మిక్కిలి శక్తిమంతుడైన రాజు ప్రసన్నతకంటే దేవుని మెప్పు అతడికి ఎక్కువ ప్రియమైనది. ఈ హెబ్రీ యువకులపై అధికారి మెలారు సహృదయతను సంపాదించిన దానియేలు రాజుతినే భోజనం రాజు తాగే ద్రాక్షరసం తీసుకోకుండా తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా అతడికి మనవి చేశాడు. ఆ మనవిని నెరవేర్చితే తాను రాజు ఆగ్రహానికి గురికావచ్చునని అది తనకు ప్రాణసంకటం కావచ్చునని మెల్లారు భయపడ్డాడు. ప్రస్తుత కాలంలో అనే కుల్లా, మితాహారం ఈ యువకుల్ని బలహీనపర్చి, ముఖాల పై కళలేనివారిగా, వ్యాధిగ్రస్తులుగా కనిపించేటట్లు చేస్తుందని, రాజు భోజన బల్ల పైనుంచి వచ్చిన విలాస భోజనం వారిని ఆరోగ్యంగా సుందరంగా ఉంచుతుందని అది ఉన్నతస్థాయి కార్యకలాపాలికి వారికి శరీర దారుఢ్యాన్ని ఇస్తుందని అతడి నమ్మకం.CDTel 21.2

    ఒక పదిరోజుల పరిశీలన జరిపి పరీక్షించటం ద్వారా ఆ విషయాన్ని తీర్మానించాలని దానియేలు మనవి చేశాడు. ఈ స్వల్పకాలావధిలో ఈ హెబ్రీయువకులు సామాన్యాహారం తినగా వారి మిత్రులు రాజు భోజనం తీసుకోటం ఆ పరీక్ష. ఆ మనవిని అతడు అంగీకరించాడు. తనకు విజయం లభిస్తుందన్న ధృఢ నమ్మకం దానియేలుకి కలిగింది. చిన్న వయసుగల యువకుడే అయినప్పటికీ మద్యపానం, విలాసజీవన సరళి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్రహాని కలిగించటం చూశాడు.CDTel 21.3

    పది దినాల అనంతరం వెల్లడైన ఫలితం మెలారు ఎదురు చూసినదానికి విరుద్దంగా ఉంది. తమ అలవాట్లలో మితాన్ని పాటించినవారు వ్యక్తిగత ఆకృతిలోనే గాక శారీరక చురుకుదనంలోను మానసిక శక్తిలోను మితం లేకుండా ఆహారం తిన్న తమ మిత్రుల కన్నా ఎంతో ఉన్నతంగా ఉన్నట్లు తేలింది. ఈ పరీక్ష ఫలితంగా దానియేలు అతడి సహచరులు ఆ రాజ్యంలో తాము నిర్వర్తించాల్సి ఉన్న విధులకు తమ శిక్షణ కాలం అంతటా తమ సామాన్య ఆహారం కొనసాగించటానికి అనుమతి పొందారు.CDTel 22.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents