Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విభాగం XI—ఆహారం విషయంలో అతివాదం

    స్టెరగమనం విలవు

    [C.T.B.H. 55] (1890) C.H.153, 155 CDTel 197.1

    315. సెవెంతుడె ఎడ్వంటిస్టుల అభిప్రాయాల్లో చాలామట్టుకు , సామాన్య లోక ప్రజల అభిప్రాయాలకు చాలా భిన్నంగా ఉంటాయి. జనాదరణ లేని సత్యాన్ని ప్రబోధించేవారు తమ సొంత జీవితంలో నిలకడ కలిగి ఉండాలి. పరుల కన్నా తాము ఎంత వ్యత్యాసంగా ఉండగలమన్న దానికన్నా తాము ప్రభావితం చెయ్యాలని ఆశించేవారు తాము ఎంతో విలువగలవిగా భావిస్తున్న స్థానాలకు ఎంత దగ్గరగా రాగలరో అంత దగ్గరగా వచ్చేటట్లు తోడ్పడటం ప్రధానం. అలాంటి మార్గం వారు నమ్మే సత్యాల్ని ఇతరులకి సిఫారసు చేస్తుంది.CDTel 197.2

    ఆహార సంస్కరణ ప్రబోధించేవారు తమ సొంత ఆహారానికి చేసుకునే ఏర్పాట్ల ద్వారా ఆరోగ్య జీవన ఉపకారాలను తమ జీవితంలో ఆచరించటం ద్వారా యథా హృదయులకు దాన్ని సిఫారసు చెయ్యాలి.CDTel 197.3

    ఆహారం విషయంలో కట్టుబాట్లు విధిస్తే ఎంత హేతుబద్ధ సంస్కరణనైనా తోసిపుచ్చే ప్రజలు చాలామంది ఉన్నారు. హేతుబద్దతను ఆరోగ్య చట్టాల్ని పరిగణలోకి తీసుకునే బదులు వారు రుచిని సంప్రదిస్తారు. ఆచారమనే నలిగిన బాటను విడిచి పెట్టి సంస్కరణను ప్రబోధించే వారందరినీ ఈ తరగతి ప్రజలు వ్యతిరేకించి, — ఎంత స్థిరమార్గాన్నిCDTel 197.4

    అనుసరించినా — వారిని అతివాదులుగా ముద్రవేస్తారు. అయితే వ్యతిరేకత గానీ లేక ఎగతాళి గానీ ఎవరినీ నిరుత్సాహపర్చి సంస్కరణ కృషినుంచి మళ్లించటానికి లేక సంస్కరణను తేలికగా తీసుకోటానికి నడిపించ కూడదు. దానియేలుని చైతన్యపర్చిన స్ఫూర్తి ఉన్న వ్యక్తి సంకుచితంగా గర్వంగా వ్యవహరించడు. న్యాయానికి గట్టిగా స్థిరంగా నిలబడ్డాడు. సహోదరులతోనే గాని ఇతరులతోనే గానీ తన సహవాసాలన్నింటిలో అతడు నియమానికి కట్టుబడి ఉంటాడు. అదే సమయంలో అతడు క్రీస్తు సహనాన్ని కనపర్చుతాడు. ఆరోగ్య సంస్కరణను ప్రబోధించేవారు ఆ అంశాన్ని అతివాదం స్థాయికి తీసుకువెళ్లినప్పుడు ప్రజలు విసుగుచెందితే వారిని నిందించ కూడదు. తరచు మన మతవిశ్వాసం ఈ రకంగా అభాసు పాలవుతుంది. అస్థిరతకు అలాంటి నిదర్శనాలకోసం చూసేవారికి ఆనక అనేక సందర్భాల్లో సంస్కరణవలన ఏదైనా మేలు కలగగలదా అని సంశయించటానికి అవకాశం కలుగుతుంది. తమ జీవితకాలమంతా ప్రయత్నించినా సరిచెయ్యలేని కీడును ఈ అతివాదులు కొన్ని మాసాల్లోనే చేస్తారు. సాతాను చూడటానికి ముచ్చటపడే పనిలో వారు తలమునకలై ఉంటారు.CDTel 197.5

    రెండు తరగతుల ప్రజల్ని నాముందు పెట్టటం జరిగింది. మొదటి తరగతి దేవుడు తమకిచ్చిన వెలుగు ప్రకారం నివసించటం లేదు. రెండో తరగతి వారు ఆరోగ్య సంస్కరణ విషయంలో తమ ఏకపక్ష అభిప్రాయాల్ని ఆచరించటంలోను, వాటిని ఆచరించటానికి ఇతరుల్ని ఒత్తిడి చెయ్యటంలోను కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారు ఒక తీర్మానానికి వచ్చినప్పుడు దాని పై మొండిగా నిలబడి అందులోని ప్రతీ విషయాన్ని ఛాందసంగా అమలు పర్చుతారు.CDTel 198.1

    మొదటి తరగతి ప్రజలు ఇంకొకరు అంగీకరించారు గనుక సంస్కరణను అంగీకరించారు. సంస్కరణ నియమాల స్పష్టమైన అవగాహన వారికి లేదు. సత్యాన్ని నమ్ముతున్నట్లు చెప్పుకునే అనేకమంది ఇతరులు అంగీకరించారు గనుక సత్యాన్ని అంగీకరిస్తారు. తమ విశ్వాసానికి హేతవు చెప్పమంటే చెప్పలేరు. వారు స్థిరత లేకుండా ఉండటానికి కారణం ఇదే. నిత్యజీవం వెలుగులో తమ ఉద్దేశాన్ని పర్యాలోచించుకునే బదులు, తమ కార్యాలన్నింటికి పునాది అయిన నియమాల ఆచరణీయ జ్ఞానాన్ని సంపాదించే బదులు, లోతుగా తవ్వి, సరి అయిన పునాది మీద నిర్మించుకునే బదులు వారు వేరొకరి దివిటీ వెలుగులో నడుస్తున్నారు. వారు విఫలులవ్యటం ఖాయం.CDTel 198.2

    తక్కిన తరగతి ప్రజలు సంస్కరణ సంకుచిత భావాల్ని తీసుకుని చాలా తక్కువ ఆహారం తీసుకుంటారు. వారు శరీర పోషణలో సంబంధం లేని విధంగా తయారు చేసిన నాసిరకం ఆహారం తిని నివసిస్తారు. వక్రం కాని ఆకలిని తృప్తిపర్చేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా తయారు చెయ్యటం ప్రాముఖ్యం.CDTel 198.3

    కడుపులో మంట పుట్టించి ఆరోగ్యాన్ని నాశనం చేసే పదార్ధాల్ని నియమబద్ధంగా ఉపయోగించం గనుక మనం ఏమి తినాలి అన్న విషయం ఏమంత ప్రాముఖ్యమైంది కాదన్న అభిప్రాయం కలిగించకూదు. పోషక విలువలు లేని ఆహారాన్ని నేను సిఫారసు చెయ్యటం లేదు. ఆరోగ్య జీవన ప్రయోజనాలు ఎంతో అవసరమైన అనేకులు, ఆరోగ్యదాయకమని తాము భావించిన దాన్ని మనస్సాక్షితో అనుసరించేవారు సంకటి, తృణధాన్యాల గంజివంటి చౌకగా దొరికే ఆహారమే సంస్కరణ సూచించే ఆహారమని భావిస్తే మోసపోతారు. కొందరు సంకటిలో పాలు, పంచదార ధారాళంగా పోసుకుని తింటూ తామ సంస్కరణను పాటిస్తున్నామని భావిస్తారు. అయితే పాలు పంచదార సంయోగం కడుపును పులియబెట్టే అవకాశముంది. కనుక పాలు పంచదార వాడకం హానికరం. ఏరూపంలోనైనా పంచదార స్వేచ్చా వినియోగం వ్యవస్థలో ఆటంకం సృష్టించి తరచు వ్యాధికి కారణమౌతుంది. కొందరు అంత మాత్రమే ఆ నాణ్యత ఉన్నది మాత్రమే తినాలని తలంచటం రెండుపూటలు మాత్రమే భోంచెయ్యటం చేస్తుంటారు. వారికి చాలినంత పోషకాహారం లభించదు.....CDTel 199.1

    సంకుచిత భావాలు, చిన్నచిన్న విషయాల్లో అనవసర కాఠిన్యం ఆరోగ్య సంస్కరణకు గొప్ప హాని చేస్తున్నాయి. ఆహారం తయారు చేసుకోటంలో పొదుపు చెయ్యటానికి ప్రయత్నం జరగవచ్చు. అది ఆరోగ్యవంతమైన ఆహారమయ్యేబదులు పేదరికపు భోజనమౌతుంది. దాని పర్యవసానం? - బలహీన రక్తం. స్వస్త పర్చటం ఎంతో కష్టమైన వ్యాధులతో సతమతమౌతున్న అనేకుల్ని చూశాను. అవి నిస్సారమైన ఆహారం వలన సంభవించే వ్యాధులు. వ్యక్తులు పౌష్టికతలేని ఆహారాన్ని ఎంపిక చేసుకోటం పేదరికం ఒత్తిడి వల్ల కాదు. ఆరోగ్యసంస్కరణను గూర్చి తమ తప్పుడు అభిప్రాయాలవల్ల. ప్రతిరోజు ప్రతీ భోజనం ఎలాంటి మార్పూ లేకుండా ఒకే రకమైన ఆహారం తినటం మూలాన చివరికి అజీర్తి వ్యాధి, దుర్బలత సంభవించాయి.CDTel 199.2