Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విభాగం XV—ఆరోగ్యదాయక ఆహార పదార్థాలు, పరిశుభ్రమైన భోజన శాలలు

    పరలోక పోషకుడు

    (1902) 7T 114 CDTel 276.1

    396. వివాహ విందులో క్షారసం చెయ్యటం, జన సమూహాలకి ఆహారం పెట్టటం వంటి ప్రభువు అద్భుతాల నుంచి మిక్కిలి ప్రాముఖ్యమైన ఓ పాఠం నేర్చుకోవచ్చు. ఆరోగ్యదాయక ఆహార వ్యాపారం ఓ అవసరాన్ని తీర్చడానికి ప్రభువు ఏర్పాటు చేసుకున్న సాధనాల్లో ఒకటి. అన్ని రకాల ఆహారాన్ని సమకూర్చే దేవుడు అన్ని కాలాలకి, అన్ని సందర్భాలకి ఉత్తమమైన ఆహారాన్ని తయారుచేసుకునే విషయంలో తన ప్రజల్ని అజ్ఞానంలో ఉంచడు.CDTel 276.2

    మన్నాలాగాCDTel 276.3

    (1902) 7T 124,126 CDTel 276.4

    397. గడచిన రాత్రిలో అనేక విషయాలు నా దృక్పథంలోకి వచ్చాయి. ఆరోగ్య ఆహార పదార్థాల ఉత్పత్తి విక్రయాలు జాగ్రత్తగా ప్రార్థనపూర్వకంగా పరిగణించాల్సిన విషయాలు.CDTel 276.5

    ఈ జ్ఞానాన్ని తాము నీతివంతంగా వినియోగిస్తారని ప్రభువు చూసినట్లయితే, ఆరోగ్యకరంగాను, రుచిగాను ఉండే ఆహారపదార్థాల్ని తయారుచేసే జ్ఞానాన్ని ఆయన ఎవరికిస్తాడో ఆ మనుషులు అనేకమంది అనేక స్థలాల్లో ఉన్నారు. జంతువులు రానురాను వాధిగ్రస్తమౌతున్నాయి. జంతువుల మాంసం వాటి ఉత్పత్తుల్ని ఎడ్వంటిస్టులే గాక ఇతరులు అనేకులు విసర్జించే కాలం ఎక్కువ దూరంలో లేదు. మనుషులు మాంసం అసనవసరం లేకుండా ఆరోగ్యదాయకం, జీవనాధారం అయిన ఆహార పదార్థాల్ని తయారు చెయ్యవచ్చు.CDTel 276.6

    పండ్లు, గింజలు, కూరగాయల్ని కలిపి, జీవితాన్ని పోషించే, వ్యాధిని దూరంగా ఉంచే రకరకాల ఆహారం తయారుచెయ్యటానికి లోకంలో అనేక ప్రాంతాల్లోని అనేకులికి ప్రభువు నేర్పుతాడు. ఇప్పుడు బజారులో ఉన్న ఆరోగ్య ఆహార పదార్థాల్ని తయారుచెయ్యటానికి రెసిపీలని చూడనివారు, భూమి ఉత్పత్తులతో ప్రయోగాలు చేసి, జ్ఞాన యుక్తంగా పని చేస్తే, ఈ ఉత్పత్తుల వినియోగం గురించి ప్రభువు వారికి వెలుగునిస్తాడు. ఏమి చెయ్యాలో ఆయన వారికి తెలియచేస్తాడు. లోకం లోని ఒక ప్రాంతంలో ఉన్న తన ప్రజలకి నిపుణతను అవగాహనను ఇచ్చే ప్రభువు, లోకంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న తన ప్రజలకి నిపుణతని అవగాహనని ఇస్తాడు. ప్రతీ దేశంలో లభించే ఆహార పదార్థాల్ని వాటి అవసరమున్న దేశాల్లో వినియోగానికి తగినట్లు తయారు చెయ్యాలన్నది దేవుని సంకల్పం. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మన్నానిచ్చిన రీతిగా ఇప్పుడు వివిధ స్థలాల్లో ఉన్న తన ప్రజలకు ఈ దేశాల ఉత్పత్తుల్ని మాంసానికి ప్రతిగా తయారు చేసుకుని ఉపయోగించుకోటానికి నిపుణతని, వివేకాన్ని ఇస్తాడు.CDTel 277.1

    ఉత్తరం 25, 1902 CDTel 277.2

    398 ఇశ్రాయేలుకి పరలోకం నుంచి మన్నాని కురిపించిన ఆ ప్రభువే నివసిస్తున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. ఆరోగ్య ఆహార పదార్థాల్ని తయారు చెయ్యటానికి నైపుణ్యాన్ని, అవగాహనని ఆయన ఇస్తాడు. ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తయారు చెయ్యటానికి తన ప్రజలకి ఆయన మార్గనిర్దేశం చేస్తాడు. అలాంటి ఆహారాన్ని తమ కుటుంబాల కోసమే కాకుండా సహాయం అవసరమైన పేదల కోసం కూడా తయారు చెయ్యటంలో తాము ఏమి చెయ్యగలరో ఆలోచన చెయ్యవలసిందిగా వీరిని దేవుడు కోరుతున్నాడు. తాము దేవుని ప్రతినిధులమనీ, తమకున్నదంతా ఆయన ఇచ్చినదేనని గుర్తిస్తూ, వారు క్రీస్తుని పోలిన ఉదారతని చూపించాలి.CDTel 277.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents