Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మన పాఠశాలలన్నింటిలో వంట తరగతులు

    (1913) C.T.312,313 CDTel 498.4

    817. మన పాఠశాలలన్నింటిలో వంట నేర్పే సామర్థ్యం గలవారు ఉండాలి. ఈ అంశం పై ఉపదేశమివ్వటానికి తరగతులు జరపాలి. వంటపని చెయ్యటానికి శిక్షణ పొందేవారు ఆరోగ్యకరం, రుచికరం అయిన ఆహారం తయారు చేసే జ్ఞానాన్ని ఆర్జించకపోతే తీవ్ర నష్టానికి గురి అవుతారు.CDTel 498.5

    వంట శాస్త్రం చిన్న విషయం కాదు. ఆహారాన్ని నిపుణతతో తయారు చెయ్యటమన్నది అత్యవసర కళల్లో ఒకటి. కళలన్నింటిలోను దాన్ని మిక్కిలి విలువైందిగా పరిగణించాలి. ఎందుకంటే దానికి జీవితంతో సన్నిహిత సంబంధం ఉన్నది. మన శారీరక శక్తి, మానసిక శక్తి రెండూ చాలా మట్టుకు మనం తినే ఆహారం పై ఆధారపడి ఉంటాయి. కనుక ఆహారం తయారు చేసే వ్యక్తికి ముఖ్యమైన సమున్నతమైన స్థానం ఉంది.CDTel 498.6

    యువతీ యువకులికి పొదుపుగా వంట చెయ్యటం, మాంసాహారానికి సంబంధించిన సమస్తానికి దూరంగా ఉండటం నేర్పించాలి. ఎలాంటి మాంసపు వంటకాలు చెయ్యటానికి వారికి ఏ రకమైన ప్రోత్సాహం ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ఆహార సంస్కరణ పవిత్రతను సూచిస్తుంది.CDTel 499.1

    ముఖ్యంగా స్త్రీలు వంట చెయ్యటం నేర్చుకోవాలి. ఓ బాలిక విద్యలోని ఏ భాగానికి దీనికున్నంత ప్రాముఖ్యత ఉన్నది? జీవితంలో ఆమె పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ, ఇక్కడ సంపాదించిన జ్ఞానం ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుంది. విద్యలో ఈ భాగం ఆరోగ్యం మీద సంతోషం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. కమ్మగా తయారు చేసిన ఓ రొట్టె ముక్కలో ఎంతో ఆచరణీయ మతం ఉన్నది.CDTel 499.2

    (1900) 6T 182 CDTel 499.3

    818. పరిశ్రమ శాఖల్లో శిక్షణ పొందాలన్న కోరికతో అనేకమంది యువజనులు పాఠశాలకు వస్తారు. పారిశ్రామిక ఉపదేశంలో పద్దులు వేయటం, వడ్రంగం, వ్యవసాయానికి సంబంధించిన సమస్తం ఇమిడి ఉండాలి. కమ్మరం, చిత్రలేఖనం, పాదరక్షల తయారీ, వంట, బ్యేకింగ్, లాండ్రీ, చినుగులు కుట్టి బాగుచెయ్యటం, టైపు చెయ్యటం, ముద్రణం - ఈ పనులకు శిక్షణ ఇవ్వాలి. వ్యావహారిక జీవిత విధుల నిర్వహణకు విద్యార్థులు సిద్ధపడి బయటికి వెళ్లేందుకు ఈ శిక్షణ పనిలో మన శక్తులన్నింటిని వినియోగించాలి.CDTel 499.4

    MS 95, 1901 CDTel 499.5

    819. మన సేనిటేరియాలు పాఠశాలలకు అనుబంధంగా వంట పాఠశాలలు నడపాలి. వీటిలో ఆహారాన్ని సరిగా ఎలా తయారు చెయ్యాలో ఉపదేశమివ్వాలి. మన పాఠశాలలన్నింటిలో వంట కళను స్త్రీలకు పురుషులకు నేర్పగల సమర్ధులైన శిక్షకులుండాలి. స్త్రీలు ముఖ్యంగా వంట చెయ్యటం నేర్చుకోవాలి.CDTel 499.6

    7T 113 CDTel 500.1

    820. మన పాఠశాలల్లోని విద్యార్ధులుకి వంటచెయ్యటం నేర్పించాలి. విద్యలోని ఈ శాఖలోకి నిపుణతను తీసుకురావాలి. యువత పాదాలను నాశనానికి నడిపే మార్గాల్లోకి తీసుకు వెళ్లటానికి సాతాను వంచనతో అనీతితో పనిచేస్తున్నాడు. తిండి విషయంలో తమకు అన్ని పక్కల నుంచి ఎదురవుతున్న శోధనలను ప్రతిఘటించటానికి మనం వారిని బలపర్చి వారికి సహాయం చెయ్యాలి. వారికి ఆరోగ్య జీవన శాస్త్రాన్ని బోధించటం ద్వారా మనం ప్రభువుకి మిషనరీ సేవ చెయ్యవచ్చు.CDTel 500.2

    (1903) Ed. 218 CDTel 500.3

    821. చేతి పనుల్లో శిక్షణ చాలా ప్రాముఖ్యం. దానిపై చూపాల్సినంత శ్రద్ధ చూపటం లేదు. ఉన్నతమైన మానసిక, నైతిక శిక్షణతో పాటు శారీరకాభివృద్ధికి పారిశ్రామిక శిక్షణ ఇవ్వటానికి వసతులతో పాఠశాలల్ని స్థాపించాలి. వ్యవసాయం, ప్రయోజనకరమైన వ్యాపార ఉత్పత్తులు, గృహ సంక్షేమానికి తోడ్పడే ఆరోగ్యదాయక వంట, ఆరోగ్యదాయక దుస్తుల తయారీ, రోగులకు చికిత్స వంటి సేవలు-వీటి నిర్వహణకు శిక్షణ ఇవ్వాలి. CDTel 500.4

    సామాన్య విధుల నిర్వహణలో నమ్మకంCDTel 500.5

    (1903) Ed. 216 CDTel 500.6

    822. విద్యార్థుల సమయాన్ని హరించే అనేక అధ్యయన శాఖలు ప్రయోజకత్వానికి ఆనందానికి ప్రధానం కావు. కానీ ప్రతీ యువకుడు ప్రతీ యువతి తన అనుదిన విధుల్ని చక్కగా గ్రహించటం ప్రధానం. అవసరమైతే ఓ యువతి ఫ్రెంచ్, బీజగణితం, పియానో సయితం నేర్చుకోటం మానవచ్చు. కాని ఆమె మంచి బ్రెడ్ తయారు చెయ్యటం, దుస్తులు చక్కగా సరిపోయేటట్లు సొంతంగా తయారు చేసుకోటం, గృహానికి సంబంధించిన అనేక విధుల్ని సమర్థంగా నిర్వహించటం ఆమె నేర్చుకోటం అత్యవసరం.CDTel 500.7

    కుటుంబ ఆరోగ్యానికి సంతోషానికి వండి వార్చే వ్యక్తి పరంగా నిపుణత, జ్ఞానం కన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనవి మరేవీ లేవు. సరిగా తయారు చెయ్యని, అనారోగ్యకరమైన ఆహారం ద్వారా పెద్దవారి ప్రయోజన కారిత్వాన్ని చిన్న పిల్లల పెరుగుదలను ఆమె అడ్డుకోవచ్చు, నాశనం చెయ్యవచ్చు కూడా. లేదా శరీరావసరాలకు సరిపడి, అదే సమయంలో ఆకర్షణ రుచిగల ఆహారం తయారు చెయ్యటం ద్వారా ఆమె తప్పు దిశలో ఎంత హానిచెయ్యగలదో సరియైన దిశలో అంత మేలు చెయ్యగలుగుతుంది. కనుక జీవితంలోని ఆనందం అనేక విధాలుగా సామాన్య విధుల్ని నమ్మకంగా నిర్వర్తించటంతో ముడివడి ఉంటుంది.CDTel 500.8

    కుటుంబ నిర్మాణంలో పురుషులు స్త్రీలు ఇరువురికీ పాత్ర ఉంది గనుక బాలురు బాలికలు గృహ విధుల గురించి జ్ఞానం సంపాదించటం మంచిది. పడక సరిచెయ్యటం, గదిలోని వస్తువులు సర్దటం, అంట్లు తోమటం, ఆహారం తయారుచెయ్యటం, సొంత బట్టలు ఉతుక్కోటం చినుగులు కుట్టటం వంటి పనుల్లో శిక్షణ ఓ బాలుణ్ని తక్కువ మగాణ్ని చెయ్యదు. అది అతడ్ని మరింత సంతోషంగా, ఉపయోగకారిగా ఉండేటట్లు చేస్తుంది.CDTel 501.1

    [ప్రతీ స్త్రీ పాక కళలో ప్రావిణ్యం సంపాదించాలి-385] CDTel 501.2

    [వంటకత్తె స్థానం ప్రాముఖ్యం, సమున్నతం-371] CDTel 501.3

    [శిబిర సమావేశాల్లో వంట ప్రదర్శనలు నిర్వహించాలి-763,764] CDTel 501.4

    [స్థానిక ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలకు నేర్పించటం-376,407]CDTel 501.5