Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మన సేనిటేరియాల్లో

    ఉత్తరం 79, 1905 CDTel 462.4

    766. ఓ సేనిటేరియం స్థాపిత మవ్వాలని, దానిలో మందులు ఉపయోగించకూడదని, వ్యాధి నివారణకు సామాన్యమైన, జ్ఞానయుక్తమైన చికిత్సా పద్ధతుల్ని వినియోగించాలని నాకు వచ్చిన వెలుగు సూచించింది. ఈ సంస్థలో బట్టలు ధరించటం, గాలిపీల్చటం, సరిగా భుజించటం, సరియైన అలవాట్ల ద్వారా జబ్బుపడకుండా కాపాడుకోటం ప్రజలకి నేర్పించాలి. [458 కూడా చూడండి]CDTel 462.5

    767. చికిత్స కోసం మన సేనిటేరియాలకి వచ్చేవారికి అవి విజ్ఞానదాయక సాధనాలై ఉండాలి. గింజలు, పండ్లు పప్పులు ఇతర భూఫలాల ఆహారం తీసుకుని ఎలా ఆరోగ్యంగా నివసించగలరో రోగులకు చూపించాలి. మన సేనిటేరియాల్లో ఆరోగ్యాంశాల పై క్రమంగా ఉపన్యాసాలివ్వటం జరగాలని ప్రభువు నాకు తెలిపాడు. ఎవరి నిమిత్తం క్రీస్తు తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఆ ప్రజల ఆరోగ్యాన్ని, బలాన్ని హరించే ఆహారపదార్ధాల్ని విసర్జించాలి. జీర్ణక్రియ సంబంధిత అవయవాలకు హానిచేసే ఆహార పదార్థాల్ని విసర్జించటం రోగులకు నేర్పించాలి.... తమ ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకునేందుకు ఆరోగ్య సంస్కరణ నియమాల్ని పాటించాల్సిన అవసరాన్ని రోగులకు వివరించాలి. మితంగా తింటూ ఆరుబయట క్రమంగా వ్యాయామం చెయ్యటం ద్వారా ఎలా బాగుపడగలరో వ్యాధిగ్రస్తులకు చూపించాలి.... మన సేనిటేరియాల సేవ ద్వారా బాధనివారణ ఆరోగ్య పునరుద్ధరణ జరగాలి. ఆహారపానాల్లో జాగ్రత్తగా ఉండటం ద్వారా ఎలా ఆరోగ్యం కలిగి నివసించవచ్చో ప్రజలకు నేర్పించాలి.... మాంసాహారం ఎవరు నిరాకరిస్తారో వారికి గొప్ప మేలు కలుగుతుంది. ఆహార సమస్య ఆసక్తికరమైన అంశం.... తినటానికి నివసించకూడదు, నివసించటానికి తినాలని బోధించాలన్న ప్రత్యేక ఉద్దేశంతో మనం సేనిటేరియాల్ని స్థాపించటం జరిగింది.CDTel 463.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents