Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తిండి విషయంలో స్వయం శిక్షణ చేసుకోండి

    మాంసం, ఎక్కువగా పోపు వేసిన గ్రేవీలు, ఐసింగ్ తో రకరకాల కేకులు, మాగవేసిన పండ్లు ఇష్టారాజ్యంగా తినటానికి అలవాటు పడ్డ వ్యక్తులు సామాన్యమైన, ఆరోగ్యవంతమైన, బలవర్థకమైన ఆహారాన్ని వెంటనే ఇష్టంగా తీసుకోరు. వారిది వక్రమైన అభిరుచి అయినందువల్ల ఆరోగ్యదాయకమైన పండ్లు, సామాన్యమైన రొట్టె, కాయగూరలతో కూడిన ఆరోగ్యదాయకమైన ఆహారం వారికి నచ్చదు. తాము అంతవరకూ తింటూఉన్న ఆహారం కన్నా ఎంతో వ్యత్యాసంగా ఉన్న ఆహారాన్ని వారు మొదట్లో ఇష్టపడకపోవచ్చు. సామాన్యమైన ఆహారాన్ని తిని ఆనందించటానికి మొదట ఇష్టం లేకపోతే అది నచ్చేవరకు వారు ఉపవాసముండటం మంచిది. ఆ ఉపవాపం వారి కడుపుకి ఎంతో కాలంగా అవసరమైన విశ్రాంతిని సమకూర్చుతుంది. సామాన్యమైన ఆహారం నిజమైన ఆకలిని తృప్తి పర్చుతుంది. అది గురి అవుతూ వచ్చిన దుర్వినియోగాలనుంచి రుచి కోలుకుని దాని స్వాభావిక స్థాయికి చేరటానికి దానికి కొంతకాలం పడుతుంది. అయితే ఆహార పానాల విషయంలో ఎడతెగకుండా ఆత్మోపేక్ష మార్గాన్ని అనుసరిస్తే, సామాన్యమైన, ఆరోగ్యవంతమైన ఆహారం త్వరలో ఇష్టమౌతుంది. దాన్ని మరింత తృప్తితో తినటానికి ఇష్టం పుడుతుంది. అది రాజభోజనం కన్నా ఎంతో కమ్మగా ఉంటుంది.CDTel 159.1

    మాంసంతో కడుపు వేడెక్కి అధిక శ్రమకు గురికాదు. అది మంచి ఆరోగ్య స్థితిలో ఉంటుంది గనుక దాని పని చెయ్యటానికి అది సంసిద్ధంగా ఉంటుంది. సంస్కరణ విషయంలో జాప్యం జరగగూడదు. మిక్కిలి భారమైన ప్రతీ భారాన్ని తొలగించటం ద్వారా జీవశక్తులకు మిగిలి ఉన్న బలాన్ని జాగ్రత్తగా కాపాడుకోటానికి కృషి జరగాలి. కడుపు దాని ఆరోగ్యాన్ని పూర్తిగా తిరిగి పొందకపోవచ్చు. కాని సరిఅయిన ఆహార క్రమం మరింత దుర్బలత ఏర్పడకుండా కాపాడుతుంది. తిండిబోతు అభ్యాసాల్లో ఎక్కువ దూరం వెళ్లిపోతే తప్ప అనేకులు దాదాపుగా కోలుకుంటారు.CDTel 159.2

    తిండిబోతుతనానికి బానిసలవ్వటానికి సమ్మతించేవారు తరచు ఇంకా ముందుకి వెళ్లి, తినటం తాగటం వల్ల ఉత్తేజితమైన భ్రష్ట శరీరవాంఛల్ని తృప్తి పర్చుకోటానికి మరింత దిగజారిపోతారు. తమ ఆరోగ్యం ప్రతిభ చాలా మట్టుకు నాశనమయ్యేవరకు వారు తమ తుచ్చవాంఛలు తీర్చుకోటంలో పేట్రేగిపోతారు. దురభ్యాసాలవల్ల ఆలోచనా శక్తులు చాలా మట్టుకు నాశనమవుతాయి.CDTel 160.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents