Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    పరిస్థితులు వేరుగా ఉండేవి

    ఆరోగ్య సంస్కరణ గురించి మీరు మీ నిర్ణయం తీసుకుని ఉంటే మీరు విశ్వాసమందు సద్గుణాన్ని. సద్గుణమందు జ్ఞానాన్ని, జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని అమర్చుకుని ఉంటే, పరిస్థితులు వేరుగా ఉండేవి. కాని మీ గృహాల్లో ప్రబలుతున్న దుర్మార్థతను మీరు పాక్షికంగా మాత్రమే గుర్తిస్తున్నారు ....CDTel 252.3

    మీరు మీ పిల్లలకి ఉపదేవమివ్వాలి. ఈ యుగంలోని దుర్నీతిని దుర్మార్గాన్ని ఎలా విసర్జించాలో మీరు వారికి ఉపదేశించాలి. దీనికి బదులు అనేకులు తినటానికి ఏమంచి పదార్ధాల్ని సంపాదించాలా అని యోచనలు చేస్తున్నారు. మీరు మీ భోజన బల్లల మీద బటర్, గుడ్లు, మాంసం పెడుతున్నారు. మీ పిల్లలు వాటిని తింటున్నారు. వారిలో పాశవిక ఉద్రేకాల్ని రెచ్చగొట్టే ప్రతీదీ తినటానికి వారికిస్తున్నారు. అంతట సమావేశాలకి వచ్చి మీ పిల్లల్ని ఆశీర్వదించి, రక్షించమంటూ దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు. మీ ప్రార్థనలు ఎంతవరకూ వెళ్తాయి? ముందు మీరు చేయాల్సిన పని ఉంది. దేవుడు మీకప్పగించిన పనిని మీరు చేసినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన ప్రత్యేక సహాయాన్నిమ్మని అప్పుడు మీరు ఆయన్ని వేడుకోవచ్చు.CDTel 253.1

    మీరు అన్ని విషయాల్లోనూ మితం పాటించాలి. ఆహారపానాల్లో మితం పాటించాలి. అయినా మీరంటారు “ఏమి తినాలో ఏమి తాగాలో నా భోజనబల్ల మీద ఏ పదార్ధాలుంచాలో ఎవరూ నాకు చెప్పాల్సిన పని లేదు.” నా పిల్లల్ని బంధించి ఉంచితే తప్ప, లేక ఎవరికీ భారం కాకుండేందుకు అవిధేయులు, దుష్టులైన పిల్లలు తాము నివసిస్తున్న సమాజాన్ని ఎక్కడ భ్రష్టు పట్టించలేరో ఆ అడవిలోకి వెళ్లిపోతే తప్ప, అది ప్రతీ వ్యక్తికి సంబంధించిన పని అవుతుంది.CDTel 253.2