Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    పప్పులతో తయారుచేసే ఆహారపదార్థాల్ని జాగ్రత్తగాను చౌకగాను తయారు చెయ్యాలి

    (1905) M.H.297,298 CDTel 375.8

    619. దేవుడు మనకు అనేక రకాల ఆరోగ్యదాయక ఆహార పదార్థాల్నిచ్చాడు. ప్రతీవ్యక్తి తన అనుభవాన్ని వివేచనని బట్టి తన అవసరాలకి సరిపడే వాటిని ఎంపిక చేసుకోవాలి.CDTel 375.9

    ప్రకృతి పండ్లు, గింజలు, పప్పులు సమృద్ధిగా సరఫరా చేస్తుంది. రవాణా సదుపాయాల పెరుగుదల ద్వారా అన్ని దేశాల ఉత్పత్తులు ప్రతీ ఏడూ ఉదారంగా పంపిణీ అవుతున్నాయి......CDTel 376.1

    పప్పులు, పప్పులతో తయారయ్యే ఆహారపదార్థాలు మాంస పదార్థాలకి ప్రతిగా అధికంగా వాడుకలోకి వస్తున్నాయి. రుచికరమైన, బలవర్ధకమైన ఆహారపదార్థాల్ని తయారు చెయ్యటానికి పప్పులతో గింజల్ని. పండ్లని, కొన్ని దుంపల్ని మిశ్రమం చెయ్యవచ్చు. పప్పుల భాగం చాలా ఎక్కువగా ఉండటంలో జాగ్రత్త తీసుకోవాలి. పప్పు ఆహారపదార్థాలు ఉపయోగించటం వల్ల దుష్ఫలితాలు అనుభవించేవారు ఈ ముందు జాగ్రత్త పాటించటం ద్వారా ఆ సమస్యని నివారించుకోవచ్చు.CDTel 376.2

    [మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా గింజలు, పప్పులు, కూరగాయలు, పండ్లు — 492]CDTel 376.3

    ఉత్తరం 177, 1901 CDTel 376.4

    620. పప్పు ఆహారపదార్థాలు తయారు చెయ్యటం నేర్చుకోటంలో ఎక్కువ సమయం గడపాలి. కాని తక్కువ ఆహారపదార్ధాల్నే ఉపయోగించి పప్పు పదార్థాల్ని ఎక్కువగా ఉపయోగించకుండా జాగ్రత్త తీసుకోవాలి. మన ప్రజల్లో ఎక్కువ మందికి పప్పుల తయారీలు లభించవు. కొందరు వాటిని , నగలినప్పటికీ వాటిని సరిగా తయారు చేసుకోలేరు.CDTel 376.5

    ఉత్తరం 14, 1901 CDTel 376.6

    621. మనం ఉపయోగించే ఆహారపదార్ధాలు వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. ఓ దేశానికి తగిన ఆహారపదార్ధాలు మరో దేశానికి సరిపడవు. పప్పులతో చేసే ఆహారపదార్థాలు పేదలకి అందుబాటులో ఉండేందుకు సాధ్యమైనంత చౌకగా తయారుచేయ్యాలి.CDTel 376.7

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents