Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విభాగం VI—అనుచితమైన తిండి వ్యాధికి ఒక కారణం క్షీణ వారసత్వం

    క్షీణ వారసత్వం

    [ C.T.B.H.7-11] (1890) C.H. 19-23CDTel 113.1

    194. మానవుడు సృష్టికర్త చేతిలోనుంచి వ్యవస్థీకరణ పరంగా సంపూర్ణుడుగాను ఆకృతి విషయంలో సుందరుడుగాను వచ్చాడు. నిత్యం పెరుగుతున్న వ్యాధి, నేరం భారాన్ని మానవుడు ఆరువేల సంవత్సరాలు తట్టుకోగలిగాడన్న నిజం ఆదిలో అతడికి అనుగ్రహించబడ్డ సహన శక్తికి ప్రబల నిదర్శనం. జల ప్రళయ పూర్వ (ప్రజలు అడ్డూ ఆపూ లేని పాపానికి పాల్పడినప్పటికీ రెండు వేల సంవత్సరాల పైచిలుకు తర్వాతి కాలం వరకూ మనుషులు ప్రకృతి చట్టాల్ని అతిక్రమించటం ప్రారంభం కాలేదు. ఆదిలో ఆదాము ఇప్పటి మనుషులకన్నా అధిక బలం పొంది ఉండకపోతే, నరజాతి ఎప్పుడో అంతరించి ఉండేది.CDTel 113.2

    మానవుడు పడిపోయిన నాటినుంచి వచ్చిన తరాలలో మన:ప్రవృత్తి నిత్యం దిగజారుతూ వచ్చింది. తరం తర్వాత తరంలో వ్యాధి తల్లిదండ్రుల నుంచి పిల్లలికి సంక్రమిస్తూ వచ్చింది. తల్లిదండ్రుల పాపాల పర్యవసానంగా ఉయ్యాలలో ఉన్న పసిపాప సయితం వ్యాధి బాధను అనుభవిస్తుంది. CDTel 113.3

    మొదటి చరిత్రకారుడు మోషే లోకచరిత్ర తొలి నాళ్లలోని వ్యక్తిగత జీవిత చరిత్రను సాంఘిక చరిత్రను ఇస్తున్నాడు. కాని ఒక శిశువు గుడ్డిగా, చెవిటిగా అవిటిగా లేదా మనోదౌర్బల్యంతో పుట్టినట్లు ఎలాంటి దాఖలా లేదు. పసిబిడ్డలు, బాలలు, బాలురు, బాలికలు స్వాభావికంగా మరణించిన సందర్భం ఒకటి కూడా లేదు. ఆదికాండంలోని మరణ ప్రకటనలు ఇలా సాగాయి: “ఆదాము బ్రతికిన దినములన్నియు తొమ్మిది వందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతి చెందెను.” “షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిది వందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.” ఇతరుల విషయంలో దాఖలా ఇలా ఉంటున్నది, ” నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున మృతి బొందెను.” కుమారుడు తండ్రికన్నా ముందు మరణించటం చాలా అరుదైన ఘటన కావటంతో అలాంటిది ఇక్కడ దాఖలు చెయ్యటం జరిగింది. “హారాను... తన తండ్రియైన తెరహు కంటే ముందుగా మృతి బొందెను.” ఆదాము మొదలుకొని నావహు వరకు నివసించిన పితరులు, దాదాపు మినహాయింపులు లేకుండా వెయ్యి సంవత్సరాలు బతికారు. అప్పటినుంచి సగటు జీవితం తగ్గుతూ వస్తుంది.CDTel 113.4

    క్రీస్తు మొదటి రాక నాటికి మానవజాతి ఎంతగా క్షీణించిందంటే, తమ వ్యాధులనుంచి స్వస్తత పొందటానికి వృద్ధుల్నే కాక నడివయస్కుల్ని, యువజనుల్ని ప్రతీ పట్టణం నుంచి రక్షకుని వద్దకు తీసుకురాటం జరిగేది. అనేకమంది గొప్ప దుఃఖంలో మునిగి దుర్భర జీవితాలు గడిపేవారు.CDTel 114.1

    బాధ, అకాల మరణానికి దారి తీసే శారీరక చట్ట ఉల్లంఘన దీర్ఘకాలంగా ప్రబలటంతో, ఈ పర్యవసానాలు మానవ జాతికి రాసి పెట్టిన అనివార్యపరిస్థితి అని భావించటం జరిగేది. మానవ జాతిని దేవుడు అంత బలహీన స్థితిలో సృజించలేదు. ఈ దుర్బల పరిస్థితి దైవ సంకల్పితంకాదు. మానవుడి స్వయంకృతమే. అది దురలవాట్లు అభ్యాసాలవల్ల, మానవుడి ఉనికికి సంబంధించి దేవుడిచ్చిన చట్టాల అతిక్రమణవల్ల, ఏర్పడ్డ పరిస్థితి. ప్రకృతి చట్టాల నిరవధిక అతిక్రమం దైవధర్మశాస్త్ర నిరవధిక ఉల్లంఘన అవుతుంది. మనుషులు దేవుని పది ఆజ్ఞల ధర్మశాస్త్రానికి ఎల్లప్పుడూ విధేయులై, తమ జీవితాల్లో దాని నీతి సూత్రాల్ని ఆచరిస్తుంటే, ప్రస్తుత ప్రపంచాన్ని వరదలా ముంచుతున్న వ్యాధి ఉండేది కాదు.CDTel 114.2

    “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు; విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి.” మనుషులు తమ జీవశక్తిని హరించే లేదా బుద్ధిని మసకబార్చే పనులు చేసినప్పుడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారు. ఆయనకు చెందిన తమ శరీరంలోను ఆత్మలోను ఆయన్ని మహిమ పర్చరు.CDTel 114.3

    మానవుడు తనను అవమానిస్తున్నప్పటికీ, దేవుడు మానవాళి పట్ల తన ప్రేమను కనపర్చుతూనే ఉన్నాడు. పరిపూర్ణ జీవితం జీవించేందుకు అతడు తన శరీరానికి సంబంధించిన ప్రకృతి చట్టాల్ని అనుసరించటం అవసరమని గుర్తించటానికి వెలుగు ప్రకాశించటానికి దేవుడు అనుమతిస్తాడు. కనుక మనుషులు దేవున్ని మహిమ పర్చటానికి తమ శారీరక, మానసిక శక్తులన్నింటిని వినియోగించుకుంటూ వెలుగులో నడవటం ఎంత ప్రాముఖ్యం!CDTel 114.4

    మనం నివసిస్తున్న లోకం నీతికి, పవిత్ర ప్రవర్తనకి మరీ ముఖ్యంగా కృపలో పెరుగుదలకు వ్యతిరేకం. ఎక్కడ చూసినా అపవిత్రత, భ్రష్టత అంగవైకల్యం, పాపం మనకు దర్శనమిస్తాయి. నిత్య అమర్త్యజీవాన్ని అందుకోకముందు మనలో పూర్తి కావలసిన పనికి ఇదంతా ఎంత విరుద్ధం! ఈ చివరి దినాల్లో దేవుడు ఎన్నుకున్న ప్రజలు తమ చుటటూ పెచ్చరిల్లుతున్న భ్రష్టత కల్మషం అంటకుండా పరిశుద్ధంగా నివసించాలి. వారి శరీరాలు పరిశుద్ధమవ్వాలి. వారి ఆత్మలు పవిత్రమవ్వాలి. ఈ పని పూర్తి చెయ్యాల్సి ఉంటే దాన్ని చిత్తశుద్ధితో, అవగాహనతో వెంటనే చేపట్టాలి. ప్రతీ కార్యాన్ని ప్రభావితం చేస్తూ పరిశుద్ధాత్మ సంపూర్ణంగా అదుపుచెయ్యాలి.....CDTel 115.1

    మనుషులు ఆత్మాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. వారు మేల్కొని, దేవుడు తమకిచ్చిన పురుషత్వాన్ని తిరిగి సంపాదించేందుకు శాయశక్తుల కృషి చెయ్యాల్సిందిగా ఆయన పిలుపు నిస్తున్నాడు. దేవుని కృపమాత్రమే హృదయంలో విశ్వాసం పుట్టించి వ్యక్తిలో మార్పు తెస్తుంది. తమను బంధించిన సంకెళ్లను విడగొట్టటానికి ఆచారం బానిసలకు ఆయన వద్దనుంచి మాత్రమే శక్తి వస్తుంది. తన శారీరక, మానసిక, నైతిక శక్తుల్ని దోచుకుంటున్న అలవాట్లు, అభ్యాసాల్లో కొనసాగుతున్న వ్యక్తి, పరిశుద్ధం దేవునికి అనుకూలం అయిన సజీవ యాగంగా తన శరీరాన్ని ఆయనకు అర్పించటం అసాధ్యం. మళ్లీ అపొస్తలుడంటున్నాడు, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి.”CDTel 115.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents