Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    బడాయి తిండివల్ల బలి అవుతున్న ఆత్మలు చాలా ఉన్నాయి.

    (1890) C.T.B.H.73 CDTel 266.1

    387. అనేకులకి జీవిత ఏకైక లక్ష్యం - ఎంత వ్యయప్రయాసలనైనా సమర్థించేది - అత్యాధునిక శైలిలో కనిపించటం. ఫ్యాషను దేవాలయంలో విద్య, ఆరోగ్యం, సుఖం బలి అవుతున్నాయి. బల్లల ఏర్పాటు విషయంలో సయితం ఫ్యాషను, ప్రదర్శన వాటి దుష్ప్రభావాల్ని చూపిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన ఆహారం తయారు చెయ్యటం అతి ప్రాముఖ్యమైన విషయం అవుతుంది. అనేక రకాల వంటకాలు వడ్డించటానికి సమయం, ద్రవ్యం, శ్రమ వ్యయం అవుతున్నాయి. సాధించే మేలు మాత్రం శూన్యం. ఒక్క భోజనానికి అరడజను వంటకాల్ని వడ్డించటం ఫ్యాషన్. కాని ఆ ఆచారం ఆరోగ్యానికి ఎంతో హానికరం. అది జ్ఞానం గల పురుషులు, స్త్రీలు ఉచ్ఛరణ ఆచరణల ద్వారా ఖండించాల్సిన ఆచారం. మీ వంటమనిషి పట్ల కాస్త కనికరం చూపించండి. “జీవితం ఆహారం కన్నా శరీరం వస్త్రం కన్నా విలువైనవి కావా?”CDTel 266.2

    ఈ రోజుల్లో గృహ విధులు పనిమనిషి సమయమంతా తీసుకుంటున్నాయి. భోజనబల్ల మీద పెట్టటానికి భోజన పదార్థాల తయారీ మరింత సామాన్యంగా ఉండటం ఎంత మేలు! ప్రతీ సంవత్సరం ఈ బలిపీఠం పై వేలాది జీవితాలు బలి అవుతున్నాయి. సృష్టించుకున్న, అంతులేని ఈ విధులు లేకపోతే, ఎక్కువ కాలం జీవించే జీవితాలు అవి. తమ అలవాట్లు సామాన్యంగా ఉండి ఉంటే, తమ గృహంలో ఎక్కువ కాలం దీవెనగా నివసించి ఉండే అనేకమంది తల్లులు అకాలంగా తమ సమాధుల్లోకి వెళ్తున్నారు.CDTel 266.3

    [వంటక పరంపర ప్రణాళిక కీడులు-218] CDTel 267.1