Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    తీర్పు గురించి ఆలోచించండి

    ఉత్తరం 135,1902 CDTel 31.7

    46. తన సైన్యంలో చేరవల్సిందిగా స్వచ్చంద సేవకులకు దేవుడు పిలుపునిస్తున్నాడు. అనారోగ్యంగా ఉన్న పురుషులు, స్త్రీలు ఆరోగ్య సంస్కర్తలవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆరోగ్యం కాపాడుకోటంలో తన బిడ్డలకు దేవుడు సహకరిస్తాడు. కానీ వారి తిండిలో జాగ్రత్త పాటిస్తూ అన్నకోశం పై అనవసర భారం మోపకుండా ఉండాలి. ప్రకృతి మార్గంలో నడిచే వారికి ఆయన ఆ మార్గాన్ని సురక్షితంగా విశాలంగా రూపొందించాడు. అది అందరూ నడవగలిగినంత విశాలమైంది. మన పోషణ నిమిత్తం ఆరోగ్యదాయకమైన భూఫలాన్ని ఉత్పత్తుల్ని ఆయన ఇస్తున్నాడు.CDTel 31.8

    తన వాక్యంద్వారా, తన కార్యాలద్వారా దేవుడిస్తున్న ఉపదేశాన్ని పాటించని వ్యక్తి, దైవాజ్ఞలకి విధేయుడు కాని వ్యక్తి అనుభవం లోపాలతో నిండివుంటుంది. అతడి క్రైస్తవం వ్యాధిగ్రస్తమవుతుంది. అతడి ఆధ్యాత్మిక జీవితం బలహీన పడుతుంది. అతడు జీవించి ఉంటాడుగాని తన జీవితం పరిమళాన్ని కోల్పోతుంది. అతడు విలువైన కృప ముడియల్ని వ్యర్థపుచ్చుతాడు.CDTel 32.1

    జీవిత చట్టాల్ని అలక్ష్యం చేసి అనేక మంది తమ దేహానికి గొప్ప హాని చేసుకుంటున్నారు. తమ నిర్లక్ష్యం పర్యవసానాలనుంచి వారు ఎన్నడూ కోలుకోకపోవచ్చు. అయితే ఇప్పుడు సైతం వారు పశ్చాత్తాపపడి మారు మనసు పొందవచ్చు. దేవుని జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం సంపాదించటానికి మానవుడు ప్రయత్నించాడు.. ప్రయత్నిస్తున్నాడు. తానే చట్టమన్న స్థితికి చేరాడు. తన ఆజ్ఞల పై గమనం ఉంచాలని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సామర్థ్యాల్ని పెరగనివ్వకుండా ఉంచటం ద్వారా తన్ను అగౌరవపర్చటం మానాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. లోకమార్గాలు సాంప్రదాయాల్ని అవలంబించటానికి దేవుని విడిచి పెట్టి దూరంగా వెళ్ళిపోతున్నందువల్ల ఆకాలక్షీణత అకాల మరణం సంభవిస్తున్నాయి. స్వారా సక్తులు ప్రయోజనాలలో మునిగి తేలే వ్యక్తి శిక్ష అనుభవింపక తప్పదు. ఆరోగ్య చట్టాల ఉల్లంఘన దేవుడెంత తీవ్రంగా పరిగణిస్తాడో తీర్పుదినాన మనం చూస్తాం. అప్పుడు మనం వెనుతిరిగి గతాన్ని నెమరు వేసుకున్నప్పుడు బైబిలును మన ఆలోచన కర్తగా మనం అంగీకరించి వుంటే దేవుణ్ణి గూర్చి మనకు ఎలాంటి జ్ఞానం ఉండేదో ఎంత ఉన్నత ప్రవర్తనను నిర్మించుకునే వారమో చూడగలుగుతాం.CDTel 32.2

    తన ప్రజలు అవగాహనను వృద్ధిపర్చుకుని వివేకవంతులవటానికి ప్రభువు ఎదురుచూస్తున్నాడు. శరీరాన్ని శ్రద్ధగా సంరక్షించుకునే విషయంలో ప్రబలుతున్న అజ్ఞానం కారణంగా లోకంలో వున్న దుఃఖం అంగవైకల్యం, వ్యాధిబాధలు మనం చూస్తున్నప్పుడు, హెచ్చరిక చేయకుండా మనం ఎలా వుండగలం? నోవహు దినాల్లో లోకం దౌర్జన్యంతోనూ నేరంతోనూ నిండి భ్రష్టమై మనుష్యకుమారుని రాకడ సమయంలోనూ అలాగే వుంటుందని క్రీస్తు వెల్లడించాడు. దేవుడు మనకు గొప్ప వెలుగునిచ్చాడు. మనం ఈ వెలుగులో నడిస్తే ఆయన రక్షణను చూస్తాం.CDTel 33.1

    నిర్ణయాత్మకమైన మార్పుల అవసరం ఎంతైనా వుంది. గర్వం, పెంకితనంతో నిండిన హృదయాలు వినయ హృదయాలుగా మార్పుచెంది ప్రభువు దొరికే సమయంలోనే ఆయన్ని వెదకటానికి ఇదే సమయం. ఒక జనాంగంగా మనం దేవుని ముందు దీనహృదయులవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే మన జీవితంలో భిన్నత్వపు మచ్చలు కనిపిస్తున్నాయి.CDTel 33.2

    తన మార్గాన్ని అనుసరించవలసిందిగా దేవుడు తన ప్రజలకు పిలుపునిస్తున్నాడు. దినంలో చాలా సమయం గడచిపోయింది. చీకటిపడే సమయం దగ్గరపడుతున్నది. నేల నింగినీటిమీద దేవుని తీర్పులు కనిపిస్తున్నాయి. మనకు రెండో కృపకాలం వుండదు. పొరపాటు కదలికలకు ఇది సమయం కాదు. ముందున్న నిత్య జీవితానికి ప్రవర్తనలు నిర్మించుకోటానికి మనకింకా అవకాశం ఉన్నందుకు ప్రతీ ఒక్కరు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి.CDTel 33.3

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents