Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఐహిక ఆహారం గురించి ఎక్కువ ఆలోచించకండి

    ఉత్తరం 73, 1896 CDTel 84.13

    131. మనం నిత్యం దైవ వాక్యాన్ని ధ్యానించాలి. దాన్ని తిని జీర్ణింకుని ఆచరణ ద్వారా ఆత్మీయీకరణం చేసుకుని జీవన స్రవంతిలో భాగం చేసుకోవాలి. అనుదినం క్రీస్తుని భుజించే వ్యక్తి తన ఆదర్శం ద్వారా ఇతరులకి తాము తినే దాన్ని గురించి తక్కువ తమ ఆత్మకు ఆహారం గురించి ఎక్కువ ఆందోళన చెందాలని ఉపదేశిస్తాడు.CDTel 84.14

    అందరికీ సిఫారసు చేయాల్సిన వాస్తవిక ఉపవాసం ఏదంటే, ఉద్రేకం పుట్టించే ప్రతీ రకమైన ఆహారాన్ని పూర్తిగా విసర్జించి, దేవుడు సమృద్ధిగా సమ కూర్చిన ఆరోగ్యదాయక, సామాన్య ఆహారాన్ని సవ్యంగా వినియోగించుకోటం.CDTel 85.1

    ఏమి తినాలి? ఏమి తాగాలి? అన్న ఐహిక ఆహార విషయాల గురించి తక్కువ గానూ, ఆధ్యాత్మికానుభవమంతటికి ఆరోగ్యాన్ని శక్తిని ఇచ్చే పరలోక ఆహారం గురించి ఎక్కువ గానూ మనుషులు ఆలోచించాల్సిన అవసరం ఎంతో వుంది. CDTel 85.2

    సామాన్య జీవితపు దిద్దుబాటు ప్రభావంCDTel 85.3

    (1832) 5T 206 CDTel 85.4

    132. ఫ్యాషన్ తో నిమిత్త లేకుండా మనం ధరించే వస్త్రాలు సామాన్యంగా మర్యాదగా వుంటే, మన ఆహారం అన్ని సమయాల్లోనూ సామాన్యంగా, ఆరోగ్యదాయకంగా, నాజూకు పదార్థాలు లేకుండా, దుబారా ఖర్చులేకుండా ఉంటే మన గృహాన్ని ఆడంబరం లేకుండా సామాన్యంగా నిర్మించుకుని, అంటే సామాన్య వస్తువులు సామగ్రితో అలంకరించుకుంటే అది సత్యం తాలూకు పరిశుద్దీకరణ శక్తిని ప్రదర్శించి అవిస్వాసుల పై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విషయాల్లో మనం లోకం తీరునే అనుసరిస్తే, కొన్ని సందర్భాల్లో లోకస్తుల్ని మించి పోటానికి ప్రయత్నిస్తుంటే, మనం బోధించే సత్యం ప్రభావాన్ని కోల్పోతుంది. సత్యాన్ని నమ్ముతున్నామని చెప్పుకునేవారు తమ పనుల వల్ల తమ విశ్వాసాన్ని ఖండిస్తున్నప్పుడు ప్రస్తుత కాలానికి దేవుడు ఉద్దేశించిన గంభీర సత్యాల్ని ఎవరు విశ్వసిస్తారు? మనకు ఆకాశపు వాకిండ్లను మూసివేస్తున్నది దేవుడు కాదు. లోకాచారాలకు సాంప్రదాయాలకు మనం హత్తుకుపోటమే ఆ పని చేస్తున్నది.CDTel 85.5

    (1905) M.H.47 CDTel 85.6

    133. క్రీస్తు తన దివ్యశక్తి వలన అద్భుతకార్యం చేసి జన సమూహానికి ఆహారం పెట్టాడు. అయినా ఆ ఆహారం ఎంత సామాన్యమైనది! గలిలయ తీరప్రాంతంలోని జాలరులు ప్రతిదినం తినే చేపలు బార్లీ రొట్టెల సామాన్య ఆహారం అది.CDTel 85.7

    క్రీస్తు ప్రజలకు గొప్ప విందును ఏర్పాటుచేయగలిగేవాడే, కాని కేవలం వాంఛను తృప్తిపర్చే భోజనం వారికి మేలు చేసే పాఠం నేర్పించేది కాదు. ఈ అద్భుత క్రియ ద్వారా సామాన్యత ప్రాముఖ్యమన్న పాఠం క్రీస్తు వారికి నేర్పించాడు. మనుషులు నేడు సామాన్య అలవాట్లు కలిగి, ఆదిలో ఆదామవ్వల్లా ప్రకృతి చట్టాలకు విధేయంగా నివసిస్తే మానవ కుటుంబం అవసరాలకు సమృద్ధిగా వనరులుండేవి. అయితే ఓపక్క సమృద్ధి ఓపక్క లేమి నుంచి స్వార్థం, ఆహార వాంఛ లోకంలోకి పాపాన్ని దుఃఖాన్ని తెచ్చాయి.CDTel 86.1

    (1875) 3T 401 CDTel 86.2

    134. క్రైస్తవులమని చెప్పుకునే వారు తమ శరీరాల్ని గృహాల్ని అలంకరించుకోటానికి తక్కువ డబ్బు వ్యయం చేస్తే, ఆరోగ్యాన్ని నాశనం చేసే ఆహారపానాలు తక్కువ ఉపయోగిస్తే, వారు దైవమందిరపు ఖజానాలోకి ఎక్కువ ద్రవ్యాన్ని చెల్లించగలుగుతారు. పరలోకాన్ని, తన భాగ్యాన్ని, తన మహిమను విడిచి పెట్టి మనకు నిత్యజీవ భాగ్యం కలుగజేసేందుకు దరిద్రుడైన విమోచకుణ్ని వారు అనుకరిస్తారు.CDTel 86.3