Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    మన తరపున క్రీస్తు విజయం

    (1876) 4T 44 CDTel 150.1

    237. మానవుడి పై దాడి చేసే ప్రధానమైన శోధనల్ని క్రీస్తు శోధనారణ్యంలో ఎదుర్కొన్నాడు. అక్కడ ఒంటరిగా ఆ మాయలమారి మోసకారి అయిన అపవాదిని ఆయన ఎదుర్కొని జయించాడు. మొదటి గొప్ప శోధన ఆహారానికి సంబంధించింది. రెండోది దురభిమానానికి, మూడోది లోకాశకు సంబంధించినవి. లక్షలాది ప్రజల్ని తిండి విషయంలో శోధించి సాతాను జయిస్తున్నాడు. రుచిని తృప్తి పర్చటం ద్వారా నాడీమండలం ఉద్రిక్తమై మెదడుశక్తి బలహీనమౌతుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా లేదా హేతుబద్ధంగా ఆలోచించటం అసాధ్యమౌతుంది. మనసు సమతుల్యతను కోల్పోతుంది. దాని ఉన్నతమైన, ఉదాత్తమైన సమర్థతలు వక్రమై పాశవిక కామాన్ని తీర్చటానికి వినియుక్తమౌతాయి. పరిశుద్ధమైన నిత్యజీవ సంబంధితమైన ఆసక్తులు మరుగున పడ్డాయి. ఈ లక్ష్యాన్ని సాధించినప్పుడు సాతాను తక్కిన రెండు శోధనలతో వచ్చి సులభ ప్రవేశాన్ని సంపాదించగలుగుతాడు. ఈ మూడు ప్రధానాంశాల నుంచే అతడి రకరకాల శోధనలు ఉత్పన్నమౌతాయి. CDTel 150.2

    238. మన రక్షకుడు ఎదుర్కొన్న మొదటి శోధననుంచి నేర్చుకోవలసిన పాఠాలన్నింటిలోను తిండి అదుపు గురించి ఉద్రేకాల అదుపుగురించి నేర్చుకోవలసిన పాఠాలకన్నా ప్రాముఖ్యమైనవి మరేవీ లేవు. భౌతిక స్వభావాన్ని ఆకట్టుకునే శోధనలు అన్ని యుగాల్లోనూ మనుషుల్ని భ్రష్టం చేసి అధోగతికి చేర్చటంలో శక్తిమంతంగా ఉన్నాయి. మానవుడికి విలువైన వరంగా దేవుడనుగ్రహించిన మానసిక, నైతిక శక్తుల్ని శోధనద్వారా నాశనం చెయ్యటానికి సాతాను కృషిచేస్తాడు. ఇలా నిత్యమైన విలువగల విషయాల్ని మనుషులు అభినందించటం అసాధ్యమౌతుంది. ఆత్మలోనుంచి దేవుని పోలికను తుడిచి వెయ్యటానికి సాతాను శరీరవాంఛల తృప్తి ద్వారా ప్రయత్నిస్తాడు.CDTel 150.3

    నియంత్రణ లేని తిండి పర్యవసానంగా సంభవించే వ్యాధి. క్రీస్తు మొదటి రాక సమయంలో ప్రబలిన భ్రష్టత, ఆయన రెండో రాకడకు ముందు మరింత తీవ్రరూపం ధరిస్తాయి. లోక పరిస్థితి జల ప్రళయం ముందులాగ, సొదొమ గొమొర్రాల్లోని పరిస్థితి లాగ ఉంటుందని క్రీస్తు చెప్పాడు. హృదయంలోని ప్రతీ ఆలోచన, ఊహ చెడ్డది. అలాంటి కాలం అంచున మనం నివసిస్తున్నాం. కనుక గతాన్ని గూర్చిన రక్షకుని పాఠం మనకు బోధపడాలి. అదుపులో లేని ఆహారేఛ్చలవల్ల చోటుచేసుకునే కీడుని క్రీస్తు భరించిన హృదయవేదనను బట్టి మాత్రమే మనం అంచనా వేసుకో గలుగుతాం. మన ఆహార వాంఛల్ని ఉద్రేకాల్ని దేవుని చిత్తానికి లోపరచటం ఒక్కటే మన నిత్యజీవ నిరీక్షణ అని క్రీస్తు ఆదర్శం చాటుతున్నది.CDTel 151.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents