Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    సొదొమ గొమొర్రాలు

    జల ప్రళయం తదనంతరం లోకంలో జనులు పెరగటంతో మనుషులు మళ్లీ దేవున్ని మర్చిపోయారు. వారు దేవుని ముందు దుర్మార్గంగా నడుచుకున్నారు. చివరికి లోకమంతా ఆ మార్గంలోనే నడవటం మొదలు పెట్టేదాక అమితత్వం అన్ని రూపాల్లోను పెరిగింది. దేవుని సుందర సృష్టికి ఓ మచ్చగా మారిన నికృష్ట నేరాలు దుర్మార్గాల్ని బట్టి పట్టణాలకి పట్టణాన్నే ఉనికిలో లేకుండా తుడిచి వెయ్యటం జరిగింది. అస్వాభావిక శరీరవాంఛల్ని తృప్తి పర్చుకోవాలన్న కోర్కె సొదొమ గొమొర్రాల నాశనానికి కారణమైన పాపాలికి దారి తీసింది. బబులోను పతనానికి తిండిబోతుతనం తాగుబోతుతనం హేతువని దేవుడంటున్నాడు. పాపాలన్నిటికీ పునాది తిండి వాంఛ, ఆవేశం.CDTel 146.1

    ఏశావును జయించిన ఆహారవాంఛCDTel 146.2

    (1868) 2T 38 CDTel 146.3

    232. ఏశావు ఓ ప్రత్యేక వంటకాన్ని వాంఛించాడు. ఆ వాంఛను తృప్తి పర్చుకోటానికి తన జ్యేష్ఠత్వాన్ని త్యాగం చేశాడు. ఆ వాంఛను తీర్చుకున్న తర్వాత తన అవివేకాన్ని గుర్తించాడు. పశ్చాత్తాపానికి తావులేకపోయినా దాన్ని కన్నీటితో అన్వేషించాడు. ఏశావు వంటివారు చాలామంది ఉన్నారు. ప్రత్యేకమైన, విలువైన ఆశీర్వాదాలు తమ అందుబాటులో ఉన్న ఓ తరగతి ప్రజల్ని అతడు సూచిస్తున్నాడు. వారు నిత్యజీవ వారసత్వం, విశ్వసృష్టికర్త అయిన దేవుని జీవితంలో నిత్యం సాగే జీవితం, అంతులేని ఆనందం, నిత్య మహిమ తమ అందుబాటులో ఉన్నా, తమ తిండి వాంఛను శరీర వాంఛల్ని ఉద్రేకాల్ని ఆకాంక్షల్ని ఎంతో కాలంగా తృప్తిపర్చుకోటం వల్ల నిత్య జీవ సంబంధిత విషయాల విలువను గ్రహించి అభినందించే శక్తిని బలహీన పర్చుకున్న ప్రజలు.CDTel 146.4

    ఓ ప్రత్యేక వంటకమంటే ఏశావుకి ప్రాణం. ఎంతోకాలంగా ఆ వాంఛను తృప్తి పర్చుకోటం వల్ల అతివాంఛనీయమైన ఆ వంటకం తినకుండా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించలేక పోయాడు. చివరికి ఆహారవాంఛ తన ఇతర ఆలోచనల్ని అణచివేసి, తనను అదుపుచేసి, ఆ వంటకం తినకపోతే తనకు తీవ్ర ఇబ్బంది వాటిల్లి మరణం సయితం సంభవిస్తుందని ఊహించుకునేంతవరకూ తిండిని గురించి ఆలోచించి, దాన్ని అదుపులో ఉంచుకోటానికి ప్రత్యేక కృషి చెయ్యకుండా చేసింది. అతడు దాన్ని గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తే తన వాంఛ అంత ఎక్కువ బలీయమయ్యింది. తుదకు పవిత్రమైన జ్యేష్ఠత్వం దాని విలువను పవిత్రతను కోల్పోయింది.CDTel 147.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents