Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అజీర్తి, బోర్డ్ సమావేశాలు

    (1902) 7T 257,258 CDTel 138.4

    226. పుష్కలంగా ఆహార పదార్థాల వడ్డన జరిగినప్పుడు తాము సులభంగా జీర్ణించుకోగల దానికన్నా మనుషులు ఎక్కువ ఆహారం తినటం తరచు జరుగుతుంటుంది. అధికభారం మోస్తున్న కడుపు దాని విధిని సరిగా నిర్వర్తించలేదు. ఫలితంగా మెదడులో ఒకవిధమైన మందకొడితనం పుడుతుంది. అందుచేత మనసు చురుకుగా పని చెయ్యదు. అనుచిత ఆహారపదార్థాల సంయోగం వలన గందరగోళం ఏర్పడుతుంది. రక్తం విషకలితమౌతుంది.CDTel 138.5

    అతి తిండి లేదా ఒకే భోజనంలో అనేక రకాల వంటకాలు తినటం అజీర్తి రోగానికి దారితీస్తుంది. ఈ రకంగా సున్నితమైన జీర్ణమండల అవయవాలకి తీవ్రహాని కలుగుతుంది. కడుపు ప్రతిఘటించటం కార్యనుంచి కారణాన్ని నిర్థరించటమంటూ మెదడుకి విజ్ఞప్తి చెయ్యటం వ్యర్థమౌతుంది. అదనంగా తిన్న ఆహారం లేదా అనుచిత ఆహారపదార్థాల సంయోగం దాని కీడు అది చేస్తుంది. అసమ్మతి సూచనలు హెచ్చరిక చేసినా అది వ్యర్థమౌతుంది. దాని పర్యవసానం బాధ. ఆరోగ్యం పోయి వ్యాధి దాపురిస్తుంది.CDTel 138.6

    దీనికి బోర్డు సమావేశాలతో సంబంధం ఏమిటి? అని కొందరు అడగవచ్చు. సంబంధం చాలావుంది. తప్పుడు తిండి పర్యవసానాన్ని కౌన్సిల్ సమావేశాల్లో కి, బోర్డు సమావేశాల్లోకి తీసుకెళ్లటం జరుగుతుంటుంది. కడుపు పరిస్థితి మెదడుని ప్రభావితం చేస్తుంది. అస్తవ్యస్తమైన కడుపు గందరగోళానికి అనిశ్చిత మానసిక స్థితికి హేతువవుతుంది. వ్యాధిగ్రస్తమమయిన కడుపు వ్యాధి గ్రస్తమయిన మానసిక స్థితిని సృష్టించి తప్పు అభిప్రాయాలను మూర్ఖంగా సమర్థించటానికి వ్యక్తిని నడిపిస్తుంది. అలాంటి వ్యక్తి వివేకంగా భావించేది దేవుని దృష్టికి బుద్ధిహీనత.CDTel 139.1

    జాగ్రత్తగా పరిశీలించాల్సిన సమస్యలకు ఎక్కడ పరిగణన ఇవ్వటం జరగటం లేదో, మిక్కిలి ప్రాధాన్యంగల తీర్మానాలు ఎక్కడ హడావుడిగా చేయటం జరుగుతున్నదో, అనేకమైన ఆ కౌన్సిల్ సమావేశాలు, బోర్డు సమావేశాల్లోని పరిస్థితికి ఒక కారణంగా దీన్ని నేను సమర్పిస్తున్నాను. తరచు సానుకూలంగా ఏకగ్రీవాభిప్రాయం ఉండాల్సినప్పుడు ప్రతికూల తీర్మానం జరిగి ఆ సమావేశాల వాతావరణాన్ని పూర్తిగా మార్చివేయటం జరుగుతుంటుంది. ఈ ఫలితాల్ని దర్శనంలో నాకు మళ్లీ మళ్లీ సమర్పించటం జరిగింది.CDTel 139.2

    ఇప్పుడు ఈ విషయాన్ని నేను సమర్పిస్తున్నాను. సువార్త సేవలో ఉన్న నా సహోదరులికి, మీరు నిగ్రహం లేని తిండివల్ల పరిశుద్ధాగ్నికి అన్యాగ్నికి తేడాను స్పష్టంగా చూడటానికి మిమ్మల్ని మీరు అయోగ్యుల్ని చేసుకుంటున్నారని చెప్పాల్సిందిగా ప్రభువు నన్ను ఆదేశిస్తున్నాడు. దేవుడిచ్చిన హెచ్చరికల్ని మీరు కూడా లెక్కచేయటం లేదని మితాహారాన్ని పాటించకపోటం ద్వారా బయలుపర్చుతున్నారు. ఆయన వాక్యం ఇలా చెప్తున్నది: “మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.” ...ఆయన మనల్ని అన్నపానాల విషయంలో అమితత్వనుంచి సకల అపవిత్రతనుంచి సమస్త శరీరవాంఛల నుంచి, సమస్త దుష్టత్వం నుంచి కాపాడేందుకు మనం ప్రభువుకి దగ్గరవ్వవద్దా? శరీరాత్మల్ని పాడుచేసే సమస్తాన్నీ విసర్జించి దేవునికి భయపడూ మన ప్రవర్తనను పరిపూర్ణం చేసుకునేందుకు ఆయన ముందు మనల్ని మనం తగ్గించుకుని దీనులం కావద్దా?CDTel 139.3