Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అమితాన్ని ప్రోది చెయ్యటం

    (1875) 3T 563 CDTel 239.3

    351. అన్నిచోట్లా ప్రబలుతున్న మితరాహిత్యాన్ని గర్షించే అనేకమంది తల్లులు దానికి కారణాన్ని ఇంకా లోతుగా వెళ్లి చూడరు. ఆకలిని రేపి అతిగా తినటాన్ని ప్రోత్సహించే రకరకాల వంటకాల్ని, పోపు పెట్టిన ఆహారాన్ని వారు అనుదినం తయారుచేస్తారు. మన అమెరికా ప్రజల భోజనబల్లలు తాగుబోతుల్ని తయారుచేసే పదార్థాల్తో నిండి ఉంటాయి. ఓ పెద్ద తరగతి ప్రజల ప్రధాన నియమం తిండి తినటం. ఏ వ్యక్తి ఎక్కువ తరచుగా తినటం ఆరోగ్యానికి హానిచేసే ఆహారం తరచుగా తినటం చేస్తాడో, అతడు తిండి కోసం జరిగే గందరగోళాన్ని, ఇతర విషయాల్లో ఉద్రేకాన్ని, తాను నేర్చుకుని బలపర్చుకున్న వక్రతిండి అలవాట్లను దీటైన పరిమాణంలో ప్రటిఘటించటానికి తనకున్న శక్తిని కోల్పోతాడు. చక్కగా వృద్ధి చెందిన ప్రవర్తనలుగల పిల్లల్ని సమాజానికి సమర్పించాల్సిన బాధ్యత దేవుని పట్ల లోకం పట్ల తమకున్నవని తల్లులు గుర్తించాలి. ఈ భ్రష్టయుగంలోని నైతిక కాలుష్యం నడుమ వ విత్రంగా నిలబడటానికి వారు యోగ్యులవుతారు....CDTel 239.4

    కడుపులో మంటరేపి, శరీర వ్యవస్థలో జ్వరపరిస్థితులు సృష్టించే వివిధరకాల వంటకాలతో కూడిన భోజనంతో అనేకమంది క్రైస్తవ స్త్రీల భోజనబల్లలు నిండి ఉంటాయి. కొందరి భోజనబల్లల మీద క్యాన్సరుకి, క్షయకి సంబంధించిన ద్రవాలతో తమ రక్తం నిండేవరకు మాంసమే ముఖ్యాహార పదార్ధంగా ఉంటుంది. తాము తినే ఆహారమే వారి దేహాన్ని నిర్మిస్తుంది. కాని బాధ, వ్యాధి వచ్చినప్పుడు అది దేవుడు పంపిన శ్రమగా వారు భావిస్తారు.CDTel 239.5

    మేం మళ్ళీ చెబుతున్నాం: మితరాహిత్యం మన భోజనబల్లల వద్ద ప్రారంభమవుతుంది. రెండో స్వభావమయ్యే వరకు ఆహారవాంఛను అది కొనసాగుతుంది. టీ, కాఫీలు తాగటం వల్ల పొగాకు పట్ల రుచి ఏర్పడుతుంది. ఇది సారాపట్ల కోరిక పుట్టిస్తుంది.CDTel 239.6

    (1905) M.H.334 CDTel 240.1

    352. తమ పిల్లలు అవలంబించటానికి వారి పసితనం నుంచే నేర్పే నియమాల్లో మిత రాహిత్యానికి వ్యతిరేకంగా తమ చలిమంటవద్ద తల్లిదండ్రులు ఓ ఉద్యమాన్ని ప్రారంభించనివ్వండి. అప్పుడు వారికి విజయ నిరీక్షణ ఉండవచ్చు.CDTel 240.2

    [C.T.B.H.46] (1860) C.H.113 CDTel 240.3

    353. తల్లిదండ్రులు తమ బిడ్డలకు స్వస్త శరీరంలో స్వస్త బుద్ధిని దిద్దేందుకు తమ బిడ్డలతో సముచితంగా వ్యవహరించటం తమ ప్రథమ ధ్యేయం చేసుకోవాలి. కుటుంబ జీవితంలో ప్రతీ విషయంలోను మితానుభవ నియమాల్ని ఆచరించాలి. పిల్లలకి ఆత్మో పేక్ష నేర్పించాలి. సాధ్యమైనంతవరకు వారు దాన్ని తమ చిన్ననాటి నుంచే ఆచరించాలి. (మంట పుట్టించే ఆహార పదార్థాలు నీళ్లు చల్లార్చలేని దాహాన్ని పుట్టిస్తాయి -538)CDTel 240.4

    354. అనేకమంది తల్లిదండ్రులు తమ బిడ్డల రుచులు అభిరుచుల్ని ఆహారేచ్చల్ని తర్బీతు చేస్తారు. వారికి మాంసాహారం టీ, కాఫీలు అలవాటు చేస్తారు. కొందరు తల్లులు తమ బిడ్డలకి అలవాటు చేసే మాంసం వేపుళ్లు టీ, కాఫీలు, పొగాకు వంటి మరింత బలమైన ప్రేరకాల్ని కోరేందుకు వారిని ప్రోత్సహిస్తాయి. పొగాకు వాడకం సారాకి తృష్ణ పుట్టిస్తుంది. పొగాకు సారా వాడకం నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది.CDTel 240.5

    అన్ని విషయాల్లోను మితం పాటించటానికి క్రైస్తవుల్లో నైతిక స్పృహకు మేల్కొలుపు కలిగితే, వారు తమ ఆదర్శాన్ని భోజనం బల్లవద్ద ప్రారంభించి, ఆత్మనిగ్రహ పరంగా బలహీనులకు, తిండి వాంఛ విషయంలో దాదాపు శక్తిహీనులకు సహాయం చెయ్యగలుగుతారు. ఈ జీవితంలో మనం నేర్చుకునే అలవాట్లు మన భావి సత్యాసకుల్ని ప్రభావితం చేస్తాయని, మన నిత్యజీవం మితానుభవ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందని గ్రహించగలిగితే తినటంలోను తాగటంలోను మనం ఖచ్చితమైన ఆశానిగ్రహాన్ని పాటిస్తాం.CDTel 240.6

    మన ఆదర్శం వల్ల వ్యక్తిగత కృషివల్ల అనేక ఆత్మల్ని అమితత్వపు భ్రష్టత నుంచి, నేరం నుంచి మరణం నుంచి రక్షించ గలుగుతాం. తమ భోజనబల్లలపై ఆరోగ్యదాయకమైన, పౌష్టికమైన ఆహారాన్ని ఉంచటం ద్వారా మన సహోదరీలు ఇతరుల ఆత్మల్ని రక్షించే అద్భుత సేవలో గొప్ప పాత్ర నిర్వహించగలరు. తమ బిడ్డల రుచుల్ని ఆహారవాంఛల్ని తర్బీతుచేసి, అన్ని విషయాల్లోను వారికి మితానుభవ అలవాట్లను నేర్పించి, ఇతరులకి మేలు చేసేందుకు ఆత్మత్యాగ స్ఫూర్తిని ఔదార్యాన్ని వారిలో నింపవచ్చు. CDTel 241.1

    శోధనారణ్యంలో ఆహారవాంఛను ఉపేక్షించి దాని శక్తిని జయింటం ద్వారా క్రీస్తు చూపించిన ఆదర్శం మనకున్నప్పటికీ తమ ఆదర్శం ద్వారాను తామిచ్చే శిక్షణ ద్వారాను అనేకమంది క్రైస్తవ తల్లులు తమ బిడ్డల్ని తిండిబోతులుగాను, తాగుబోతులుగాను తయారు చేస్తున్నారు. ఆరోగ్య పరిగణన లేకుండా తామనుకున్నప్పుడు తాము కోరినవి తినటానికి పిల్లల్ని అనుమతించటం తరచు జరుగుతున్నది. కొందరు పిల్లలు తమ శైశవం నుంచి తిండిబోతులుగా తర్బీతు పొందుతున్నారు. వక్రతిండి వల్ల వారు చిన్న వయసులోనే అజీర్తి రోగులవుతున్నారు. స్వార్థాశలు కోర్కెల సంతృప్తి అమితానుభవం వారి వయసుతో పాటు, వారి బలంతో పాటు పెరుగుతాయి. తల్లిదండ్రుల గారాబంవల్ల వారి మానసిక, శారీరక శక్తులు బలి అవుతున్నాయి. ఎలాంటి ఉపకారం చెయ్యక హాని మాత్రమే చేసే ఆహార పదార్థాల పట్ల రుచి పెరుగుతుంది. శరీర వ్యవస్థపై అధిక శ్రమ పడే కొద్దీ శరీర తత్వం బలహీనపడుతుంది. అమితానుభవం పునాది-203) CDTel 241.2