Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తిండివాంఛ నియంత్రణపై ఆధారపడే దైవ సేవకుల ప్రయోజనకారిత్వం

    ఉత్తరం 158, 1909 CDTel 162.5

    251. ఆహార శోధనను ప్రతిఘటించాల్సిన అవసరాన్ని ప్రజల ముందు పెట్టండి. అనేకులు వైఫల్యం చెందుతున్నది ఇక్కడే. మనసుకి శరీరానికి ఎంత దగ్గర సంబంధం ఉన్నదో వివరించి, ఆ రెండింటిని ఉత్తమ ఆరోగ్య స్థితిలో ఉంచుకోటం ప్రాముఖ్యమని సూచించండి.....CDTel 162.6

    ఆహార వాంఛను తృప్తిపర్చుకుంటూ తమ దేహశక్తినీ నైతిక బలాన్ని వృధా చేసుకుంటున్న వారందరూ భౌతిక చట్టాతిక్రమ పర్యవసానాల్ని అనుభవిస్తారు.CDTel 163.1

    పాపి విమోచనను కొనటానికి క్రీస్తు తన ప్రాణమిచ్చారు. ఆహార వాంఛ తృప్తి శరీరాన్ని బలహీనపర్చి యుక్తాయుక్త జ్ఞానశక్తుల్ని నిర్వీర్యం చేస్తున్నందువల్ల నిత్యజీవానికి సంబంధించిన పరిశుద్ధ విషయాల అవగాహన అసాధ్యమౌతుందని లోక విమోచకునికి తెలుసు. శరీరేచ్చల తృప్తి నైతిక శక్తుల్ని భ్రష్టు పట్టిస్తుందని, సుఖభోగేచ్ఛల జీవితం నుంచి హృదయంలోను, మనసులోను, ఆత్మలోను, ఆత్మోపేక్ష ఆత్మత్యాగ జీవితానికి మానవుడికి మార్పు అవసరమని ఆయనకు తెలుసు. బోధకులికి విజ్ఞప్తి చేయటానికి, నిద్రిస్తున్న సంఘాన్ని మేలుకొల్పటానికి తన సేవకుడుగా మీకు దేవుడు సహాయం చేయునుగాక. వైద్యుడిగాను వాక్యసేవకుడిగాను మీ కృషి సమన్వయత కలిగి సాగాలి. వాస్తవిక ఆశనిగ్రహం బోధించటానికే మన ఆసుపత్రులు స్థాపితమయ్యాయి......CDTel 163.2

    ఒక ప్రజగా, మనకు దిద్దుబాటు అవసరం. మరీ ముఖ్యంగా దైవవాక్య సేవకులు ఉపదేశకులకి దిద్దుబాటు అవసరం. వాక్యపరిచారకులకి, మన కాన్ఫరెన్స్ అధ్యక్షులకి ఈ వర్తమానం అందించాల్సిందిగా దేవుడు ఆదేశించాడు: నశిస్తున్న ఆత్మల పునరుద్ధరణ సేవలో మీ ప్రయోజన కారిత్వం మీరు మీ ఆహార వాంఛను తృప్తి పర్చుకోవాలన్న కోరికను అధిగమించటంలో సాధించే జయం మీద చాలా మట్టుకు ఆధారపడి ఉంటుంది. ఆహార వాంఛను తృప్తి పర్చుకోవాలన్న కోరికను అధిగమించండి. ఇది చేస్తే మీరు మీ ఆవేశాల్ని సునాయాసంగా నియంత్రించగలుగుతారు. అప్పుడు మీ మానసిక శక్తులు నైతిక శక్తులు మరింత బలో పేతమౌతాయి. “వారు గొఱ్ఱపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు.”CDTel 163.3