Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆరోగ్య హోటళ్ల కర్తవ్యం

    (1902) 7T 55 CDTel 287.2

    416. బ్రూక్లిన్లో మనకో శాఖాహార హోటలు ఉన్నదని తృప్తిచెంది విశ్రమించకూడదని ఆ నగరంలోని ఇతర స్థలాల్లో కూడా హోటళ్లు స్థాపించాలని ప్రభువు నాకు తెలియజేశాడు. న్యూయార్కు మహానగరంలో ఓ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆ నగరంలో మరో ప్రాంతంలో ఏం జరుగుతుంతో ఎరుగరు. వివిధ ప్రాంతాల్లో స్థాపితమైన హోటళ్లలో భోజనం చేసే పురుషులు, స్త్రీలు తమ ఆరోగ్యంలో కొంత మెరుగుదలని గుర్తిస్తారు. ఓ సారి నమ్మకం ఏర్పడటంతో వారు దేవుని వర్తమానాన్ని అంగీకరిస్తారు.CDTel 287.3

    పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కడ వైద్యమిషనరీ సేవ జరుగుతుందో అక్కడ బలమైన వంట పాఠశాలల్ని జరిపించాలి. ఎక్కడ బలమైన విద్యామిషనెరి సేవ జరుగుతున్నదో అక్కడ ఓ ఆరోగ్య హోటలు స్థాపితమై అందులో ఆహార పదార్థాల సరియైన ఎంపికకు, ఆహారాన్ని ఆరోగ్యవంతంగా తయారు చెయ్యటానికి ఆచరణాత్మక ఉదాహరణ ఇవ్వటం జరగాలి.CDTel 287.4

    (1902) 7T 115 CDTel 287.5

    417. మన నగరాలకి దేవుని వర్తమానం ఒకటున్నది. ఈ వర్తమానాన్ని మన శిబిర సమావేశాల్లో, ఇతర బహిరంగ సువార్త సమావేశాల్లో మన ప్రచురణలద్వారా కూడా మనం ప్రకటించాలి. ఇది గాక నిరాల్లో ఆరోగ్య హోటళ్లు స్థాపించి వాటి ద్వారా మితానుభవ వర్తమానాన్ని ప్రకటించాలి. మన హోటళ్లకి అనుబంధంగా సమావేశాలు జరిపించటానికి ఏర్పాటు చెయ్యాలి. సాధ్యమైనప్పుడు పోషకులకి ఓ గదిని ఏర్పాటు చేసి ఆరోగ్య శాస్త్రం పైన క్రైస్తవ మితానుభవం పైన, ఆరోగ్యదాయక ఆహారం తయారుచెయ్యటం పైన, ఇంకా ఇతర అంశాల పైన ప్రసంగించటానికి వారిని ఆహ్వానించాలి. ఈ సమావేశాల్లో ప్రార్థన, పాటలు, ఆరోగ్యం , మితానుభవాన్ని గూర్చి మాత్రమే గాక ఉచితమైన బైబిలు అంశాలపై ప్రసంగాలు భాగమై ఉండాలి. శరీరారోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకీ బోధించే తరుణంలో దేవుని రాజ్య సువార్త విత్తనాల్ని నాటటానికి అనేక అవకాశాలు లభిస్తాయి.CDTel 287.6