Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    దుష్ట ప్రవృత్తుల్ని ప్రతిఫుటించటం

    (1875) 3T 567,568) CDTel 243.1

    357. ఈ తరంలోని తల్లులు తమని తాము సింగారించుకుని ప్రదర్శించుకోటంలో ధనవంతులైన తమ పొరుగు స్త్రీలతో పోటీ పడకుండా, తమ బిడ్డలకి మెరుగైన జీవితాన్ని గూర్చిన ఉపదేశమివ్వటమన్న తమ విధిని నిర్వహించటంలో వారిని అధిగ మిస్తారా? చిన్న పిల్లలు యువతకి ఆత్మత్యాగం, ఆత్మ సంయమనం అలవాట్లు నేర్పితే, తాము నివసించటానికి తినాలి గాని తినటానికి నివసించకూడదని వారికి నేర్పిస్తే, వ్యాధి తక్కువగా ఉంటుంది. నైతిక భ్రష్టత తక్కువగా ఉంటుంది. సమాజాన్ని ఏర్పర్చి దాన్ని తీర్చిదిద్దే యువతలో మితానుభవాన్ని గూర్చి సరియైన. నియమాల్ని నెలకొల్పితే, ఏమంత విజయవంతం కాని మితానుభవ ఉద్యమాల అవసరం ఉండదు. అప్పుడు వారు ఈ చివరి దినాల్లో ప్రబల మౌతున్న కల్మషాల్ని యేసు శక్తితో ప్రతిఘటించటానికి నైతిక విలువ నైతిక విశ్వసనీయతను కలిగి ఉంటారు.... ఆహారవాంఛ, ఆవేశం ప్రవృత్తుల్ని తల్లిదండ్రులు తమ బిడ్డలకి సంక్రమింపజెయ్యవచ్చు. ఈ పిల్లల్ని ఖచ్చితమైన మితానుభవ జీవనానికి, శుద్ధమైన, పవిత్రమైన అలవాట్ల కు తర్బీతు చేసే పనిని ఇవి కష్టతరం చెయ్యవచ్చు. అనారోగ్యకరమైన ఆహారానికి, ఉత్తేజకాలకి, నిద్రపుచ్చే మత్తు పదార్థాలకి ఆకలి తల్లిదండ్రుల నుంచి పిల్లలకి పారంపర్య ఆస్తిగా సంక్రమిస్తే, తాము తమ బిడ్డలకి అందజేస్తున్న దుష్ట ప్రవృత్తుల్ని ప్రతిఘటించటానికి తల్లి దండ్రుల పై ఎంత భయంకర, గంభీర బాధ్యత ఉన్నది! తల్లిదండ్రులు అభాగ్యులైన తమ బిడ్డల పట్ల తమ విధిని ఎంత శ్రద్ధగా ఎంత తత్పరతతో, నమ్మకంతో, నిరీక్షణతో నిర్వహించాలి!CDTel 243.2

    తమ బిడ్డల్లో చెడు ప్రవృత్తులు పెంచకుండేందుకు, ఆహారం తయారు చెయ్యటంలోగాని లేక ఇతర అలవాట్లలోగాని తాము హానికరమైనదేమీ చెయ్యకుండేందుకు జీవితానికి ఆరోగ్యానికి సంబంధించిన చట్టాల్ని తల్లిదండ్రులు అవగాహన చేసుకోటం తమ ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవాలి. జీర్ణమండల అవయవాలు బలహీనమై, నాడీ మండల శక్తులు అసంతులనమై తాము తమ బిడ్డలకివ్వాల్సిన ఉపదేశం నీరుకారకుండేటట్లు, అతి సామాన్యమైన ఆరోగ్యదాయకమైన ఆహారం తమ భోజన బల్లల పై పెట్టటానికి తల్లులు ఆహారం తయారు చెయ్యటాన్ని ఎంత జాగ్రత్తగా అధ్యయనం చెయ్యాలి! ఈ ఆహారం కడుపుకి సంబంధించిన అవయవాల్ని బలహీనపర్చటంగాని బలపర్చటం గాని చేస్తుంది. దేవుని రక్తంతో కొన్న దేవుని సొత్తయిన ఈ బిడ్డల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించటంలో దీని పాత్ర చాలా ఉంది. నాడీ వ్యవస్థ సమతౌల్యంగా ఉండటానికి, ఆత్మకు ప్రమాదం కలగకుండా ఉండటానికి గాను తమ బిడ్డల శారీరక, నైతిక తత్వాల్ని కాపాడేందుకు తల్లిదండ్రులుకి ఎంత పవిత్రమైన బాధ్యత అప్పగించబడింది! కోరిందల్లా పిల్లల్ని తిననిచ్చి వారి ఉద్రేకాల్ని నియంత్రించని తల్లిదండ్రులు తాము చేసిన పొరపాటుని మొద్దుబారిన జ్ఞానేంద్రియాలు, అబద్దాలు బూతులు పలికే పెదవులు కలిగిన పొగాకు సారా బానిసల్లో చూస్తారు.CDTel 244.1