Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    శిశువు

    (1905) M.H.383 CDTel 231.3

    340. పసిబిడ్డకి ఉత్తమాహారం తల్లిపాలు. దీన్ని అనవసరంగా బిడ్డకు దూరం చెయ్యకూడదు. అనుకూలత కోసమో లేక సాంఘిక వినోదం కోసమో తల్లి తన చంటి బిడ్డకు స్తన్యమిచ్చే సున్నితమైన బాధ్యతను తప్పించుకోటానికి ప్రయత్నించటం దారుణం.CDTel 231.4

    ఇంకొకరు తన బిడ్డకు స్తన్యమివ్వటాన్ని అనుమతించే తల్లి దాని ఫలితం ఏమి కావచ్చునో పరిగణించాలి. పాలిచ్చే స్త్రీ తాను స్తన్యమిచ్చే బిడ్డకు తన స్వభావాన్ని మానసిక ప్రవృత్తిని కొద్దీ గొప్పో అందజేస్తుంది.CDTel 231.5

    హెల్త్ రిఫార్మర్, సెప్టెంబర్, 1871 CDTel 231.6

    341. ఫ్యాషన్ తో అడుగులు వేస్తూ నివసించటానికి ప్రకృతిని సంప్రదించే బదులు దుర్వినియోగపర్చటం జరుగుతున్నది. కొన్నిసార్లు తల్లులు జీతానికి పనిచేసే స్త్రీల మీద లేక పాలసీసా మీద ఆహారపడతారు. తన మీద ఆధారపడే బిడ్డపట్ల తల్లి నిర్వహించగల అతి మృదువైన, తృప్తికరమైన విధుల్లో ఒకదాన్ని, తన జీవితాన్ని బిడ్డ జీవితంతో మమేకం చేసుకునే దాన్ని, స్త్రీల హృదయంలో మిక్కిలి పరిశుద్ధ మనోభావాలు మేల్కొల్పే దాన్ని ఆమె మూఢ ఫ్యాషన్ కి బలి చేస్తుంది.CDTel 231.7

    తమ సొంత శరీరఫలమైన బిడ్డలకి పరిమితమై ఉండటం శ్రమతో కూడిన పని అని భావించి, తమ బిడ్డలకి స్తన్యమివ్వటమన్న మాతృవిధిని త్యాగం చేసే తల్లులున్నారు. బాల్ రూమ్ డ్యాన్సులు, ఉత్కంఠభరితమైన వినోద దృశ్యాలు ఆత్మతాలూకు సున్నిత భావోద్వేగాల్ని మొద్దుబార్చు తున్నాయి. ఫ్యాషన్ ప్రేమికురాలైన తల్లికి తన బిడ్డల పట్ల మాతృత్వ విధులకన్నా ఇవి ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటాయి. ఆమె తన బిడ్డల్ని జీతం పని వారికి అప్పగించి, ప్రత్యేకించి తాను చెయ్యాల్సిన ఈ విధుల్ని వారితో చెయ్యించవచ్చు. ఆమె తప్పుడు అలవాట్లు తనకు ఆనందం కలిగించాల్సిన విధుల పట్ల ఆమెకు అయిష్టం పుట్టిస్తాయి. ఎందుకంటే పిల్లల సంరక్షణ ఆమె ఫ్యాషను జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. ఓ ఇతర వ్యక్తి తల్లి బాధ్యతల్ని నిర్వర్తించి, బిడ్డని పోషించటానికి తన స్తన్యం ఇస్తుంది.CDTel 232.1

    అంతేకాదు. తాను పాలిచ్చే బిడ్డకు ఆమె తన స్వభావాన్ని, మనః ప్రవృత్తిని అందిస్తుంది. బిడ్డ జీవితం ఆమె జీవితంతో ముడిపడి ఉంటుంది. ఆ జీతగత్తె ముతక రకమైన, ఆవేశ పడే, సబబు కాని స్త్రీ అయితే; తన నైతిక ప్రవర్తనలో జాగ్రత్తగా లేకపోతే, ఆ బిడ్డ అలాగే తయారవుతుంది. జీతగత్తె రక్తనాళాల్లో ప్రవహించే ఆ ముతక రక్తమే బిడ్డలోనూ ప్రవహిస్తుంది. తమ బిడ్డల్ని ఇలా తమ చేతుల్లో నుంచి తొలగించుకుని, తమ జీవితాల్ని ఫ్యాషన్ కి అంకితం చేసుకుంటున్నప్పుడు, మాతృత్వ విధులు తమకు అడ్డువస్తాయి గనుక వాటిని తప్పించుకునే తల్లులు తల్లి అన్న పేరుకి అనర్హులు. వారు స్త్రీల ఉదాత్తమైన సహజ ప్రవృత్తిని, పరిశుద్ధ లక్షణాల్ని భ్రష్టపర్చి, తమ సంతతి పట్ల మూగజంతువులకున్న బాధ్యత కన్నా తక్కువ బాధ్యత కలిగి, విలాసవంతమైన వినోదాలకి సీతాకోకచిలుకల్లా ఎగురుతారు. అనేకమంది తల్లులు పిల్లలకి స్తన్యమిచ్చే బదులు పోతపాలిస్తారు. దీనికి కారణం వారికి పౌష్టికత లేకపోటమే. అయితే పదింట తొమ్మిది మంది తమ నౌవనంలో, వస్త్రధారణలోను, తిండి విషయంలోను తప్పుడు అలవాట్ల వల్ల ప్రకృతి తమకు నిర్దేశించిన విధుల్ని నిర్వరితంచలేని పరిస్థితుల్ని సృష్టించుకుంటున్నారు......CDTel 232.2

    తమ బిడ్డలకి స్తన్యమివ్వగల తల్లులు పాలివ్వటం మాని పిల్లల్ని పోతపాల పై పెట్టటం నాకు నిర్దయగా అమానుష్యంగా కనిపిస్తుంది. ఆ సందర్భంలో పాలు ఆరోగ్యవంతమైన ఆవుపాలై ఉండాలి. పాలు, పాలసీసా రెండూ తియ్యగా ఉండాలి. తరచు దీన్ని నిర్లక్ష్యం చెయ్యటం జరుగుతుంటుంది. ఫలితంగా బిడ్డ అనవసరంగా బాధకు గురి అవుతుంది. కడుపు సరిగా లేకపోటం, విరేచనం సరిగా కాకపోటం వంటి సమస్యలు ఏర్పడతాయి. పాపం ఆ పసికందు ఒకవేళ పుట్టినప్పుడు ఆరోగ్యంగా ఉన్నా వ్యాధులకు గురి అవ్వటం జరుగుతుంది.CDTel 233.1

    (1865) H.TO L., అధ్యా.2, పుట.39,40 CDTel 233.2

    342. బిడ్డ తల్లి పాలుతాగే కాలం ప్రాముఖ్యమైన కాలం. తమ శిశువులకి స్తన్యమిచ్చే కాలంలో అనేకమంది తల్లులు ఎక్కువ పనిచెయ్యటం వంటచెయ్యటంలో తమ రక్తానికి వేడి తగలనివ్వటం చేస్తున్నందువల్ల చంటిపాలు వేడెక్కటం మాత్రమే గాక, తల్లి శరీర వ్యవస్థ వేడి వల్ల ఆమె ఆహారం అనారోగ్యదాయకమైనందుచేత రక్తం విషకలికితమై, తల్లి శరీర వ్యవస్థ మొత్తం వేడెక్కి, బిడ్డ ఆహారానికి విఘాతం కలుగుతుంది. తల్లి మనఃప్రవృత్తి బిడ్డను ప్రభావితం చేస్తుంది. ఆమె అసంతోషంగా ఉండి త్వరగా రెచ్చిపోయి, కోపపడి, ఉద్రేకపడి వ్యవహరించే వ్యక్తి అయితే ఆ తల్లి నుంచి బిడ్డ పొందే పోషకాహారం వేడెక్కి తరచు కడుపులో నొప్పి, కండర సంకోచం సంభవించి, కొన్ని సందర్భాల్లో మూర్ఛకు విక్షోభానికి దారి తీస్తుంది.CDTel 233.3

    తల్లి అందించే పోషకాహారం వలన బిడ్డ ప్రవర్తన కూడా ప్రభావితమౌతుంది. కనుక బిడ్డకు స్తన్యమిచ్చేటప్పుడు తల్లి సంతోషకరమైన మానసిక స్థితి ఆత్మ సంయమనం కలిగి ఉండటం ఎంత ప్రాముఖ్యం! ఇలా చేస్తే బిడ్డ పోషణకు హాని సంభవించదు. తన బిడ్డ పోషణ పెంపకం విషయంలో తల్లి అనుసరించే ప్రశాంత, ఆత్మనిగ్రహంగల విధానం పసిబిడ్డ మనసుని తీర్చిదిద్దటంలో ఎంతో దోహదపడుతుంది. బిడ్డ భయపడుతూ, ఇట్టే ఆందోళన పడుతుంటే, తల్లి జాగరూకత, ప్రశాంత వైఖరి బిడ్డను శాంత పర్చి సరిచేసే ప్రభావం చూపుతుంది. బిడ్డ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడవచ్చు.CDTel 233.4

    అనుచిత ఆదరణ కారణంగా పసిబిడ్డలకు గొప్ప హాని కలుగుతుంది. అసౌకర్యం ఏర్పడి బిడ్డ ఏడుస్తుంటే అసలు సమస్య పాలు ఎక్కువవటం తల్లి తప్పుడు అలవాట్ల వల్ల జరిగిన హాని కాగా దాన్ని నెమ్మది పర్చటానికి సాధారణంగా పాలివ్వటం జరుగుతుంటుంది. ఎక్కువ ఆహారమే విషయాన్ని విషమింపజేసింది. ఎందుకంటే కడుపులో అప్పటికే ఎక్కువ ఆహారం ఉంది.CDTel 234.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents