Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భాగం IV - ఏపిల్ రసం

    (1885) 5T 354-361 CDTel 451.7

    755. మనం మతరాహిత్యం రాజ్యమేలుతున్న యుగంలో నివసిస్తున్నాం. తాగుబోతు తృష్ణని తీర్చటం దేవునికి వ్యతిరేకంగా చేసే అపరాధం. ఇతరులతో కలిసి మీరు కూడా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే మీకు వచ్చిన వెలుగును మీరు అనుసరించటం లేదు. వెలుగులో నిలిచివుంటే ఈ పని చేసేవారు కాదు. ఈ పనిలో పాత్ర వున్న మీలో ప్రతీ ఒక్కరు మీ వ్యాపార పద్ధతుల్ని మార్చుకుంటే తప్ప దేవుని ఖండనకు గురి కావటం ఖాయం. మీరు చిత్త శుద్ధితో పనిచేయాలి. మీ ఆత్మలని నాశనం నుంచి కాపాడే పనిని మీరు వెంటనే ప్రారంభించాలి....CDTel 451.8

    మితానుభవ సేవలో పాల్గోకుండా దానికి వ్యతిరేకంగా వున్న తర్వాత కూడా మీరు మీ పరిశుద్ధ విశ్వాసంలో నమ్మకంగా నిలిచివుంటే ఇతరుల పై మంచి ప్రభావం చూపే సామర్థ్యం మీకింకా మిగిలి ఉండేది గాని, మత్తు పానీయాల్ని తయారుచేయటం ద్వారా మీరు సత్యానికి చెడ్డ పేరు తెస్తున్నారు. మీ ఆత్మలకు హాని కలిగించుకుంటున్నారు కూడా. మితానుభవ సేవకూ మీకూ మధ్య మీరు అడ్డుగోడలు నిర్మించుకుంటున్నారు. అవిశ్వాసులు మీ నియమాల్ని ప్రశ్నించేటట్లుగా ఉన్నాయి మీ పనులు. మీరు మీ పాదాలకు తిన్నని మార్గాల్ని ఎంచుకోటం లేదు. కుంటి వారు మీ వలన పడిపోయి నాశనమవుతున్నారు.CDTel 452.1

    దైవ ధర్మశాస్త్రం దృష్ట్యా క్రైస్తవులు మద్యాన్ని విక్రయించేందుకు తయారు చేయటంలో ఎలా మనస్సాక్షితో నిమగ్నం కాగలరో నాకు అర్ధం కావటం లేదు. వీటన్నింటినీ గొప్ప మేలు చేయటానికి ఉపయోగించవచ్చు లేదా దుర్వినియోగం చేయటం వల్ల శోధనగాను శాపంగానూ మార్చవచ్చు. తాజా ఏపిల్ పళ్లను, ద్రాక్షపళ్లను క్యాన్ చెయ్యటం ద్వారా వాటిని చాలా కాలం మధురంగా ఉంచవచ్చు. పులియకుండా ఉన్న స్థితిలో వాటిని ఉపయోగించుకుంటే స్వస్తబుద్ధి కోల్పోయే ప్రమాదముండదు......CDTel 452.2