Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అగత్యమైన ప్రవర్తన తీర్మానం

    ఉత్తరం 166, 1903 CDTel 167.4

    255. ఆహార వాంఛను ఉపేక్షించటానికి ప్రవర్తన తీర్మానం అగత్యమౌతుంది. ఈ తీర్మానం జరగనందువల్ల వేలాది ప్రజల జీవితాలు నాశనమౌతున్నాయి. బలహీనులు, మెత్తని మనసుగలవారు, అన్నిటికీ తల ఊపే స్వభావం గల పురుషులు స్త్రీలు దేవుడు తాము ఏమి సాధించాలని కోరుతున్నాడో అది సాధించలేరు. ప్రవర్తన తీర్మానం చేసుకోలేనివారు జయించటమన్న తమ రోజు వారీ కర్తవ్యాన్ని విజయవంతం చెయ్యవలేరు. బుద్దిహీనులు, అజితేంద్రియులు, మానసిక దుర్బలులు అయిన స్త్రీలు పురుషులతో లోకం నిండివుంది. వారు యధార్థ క్రైస్తవులవ్యటం ఎంత కష్టం !CDTel 167.5

    ఆ గొప్ప వైద్య మిషనరీ ఏమంటున్నాడు? - “ఎవడైనను నన్ను వెండింపగోరిన యెడల, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను.” తోటి మనుషుల్ని శోధించటానికి మనుషుల్ని శోధించటం సాతాను పని. విధ్వంసం నాశనం కలిగించే తన పనిలో తనతో కలిసి పనిచెయ్యటానికి మనుషుల్ని ఆకట్టుకోటానికి అతడు శ్రమిస్తాడు. మానవ నైజం స్వాభావికంగా వాంఛించే తిండి, వినోదాలు. బుద్దిహీన కార్యాల్లోను దైవ వాక్యం నిషేధిస్తున్న కార్యాల్లోను పూర్తిగా నిమగ్నమవ్వటానికి మనుషుల్ని నడిపించటానికి అతడు శ్రమపడ్డాడుగనుక అతడి సహాయకులుగా, మానవుడిలో దేవుని స్వరూపాన్ని నాశనం చెయ్యటానికి అతడితో కలిసి పనిచేసే వారిగా వారిని పేర్కోవచ్చు.CDTel 168.1

    అనేకులు అధికారుల్ని లోకనాయకుల్ని బలమైన శోధనల ద్వారా వంచించటం జరుగుతుంది. తిండికి బానిసలైన వారు బుద్ధిజ్ఞానాలు కోల్పోయి దిగజారిపోతారు......CDTel 168.2

    “మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తుకారు. విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.”CDTel 168.3

    తాము దేవునితో ఈ సంబంధం కలిగి ఉన్నామని నిత్యం గుర్తుంచుకునేవారు తృప్తినిచ్చే ఆహారాన్ని జీర్ణక్రియ అవయవాలికి హాని కలిగించని ఆహారాన్ని కడుపులోకి తీసుకుంటారు. ఆహార పానాల విషయంలో వస్త్రాలు ధరించటం విషయాల్లో అనుచిత అలవాట్లు అభ్యాసాలవల్ల వారు దేవుని సొత్తును పాడుచెయ్యరు. మానవ యంత్రాంగం విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. భాగస్వామిగా దేవునితో కలిసి పనిచెయ్యటానికి ఇది తాము చెయ్యాలని గుర్తిస్తారు. వారు ఆరోగ్యంగా సంతోషంగా ప్రయోజకులుగా ఉండాలన్నది దేవుని సంకల్పం. ఇలా ఉండటానికి వారు తమ చిత్రాల్ని దేవుని చిత్తానికి లోపరచాలి.CDTel 168.4

    హెల్త్ రిఫార్మర్, మే, 1875 CDTel 168.5

    256. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఆకర్షణల్లో పడిపోటానికి అన్ని పక్కలా శోధనలు ఎదురవుతాయి. విజయుడైన యేసు నామంలో నియమబద్దత, ఆహార వాంఛలు శరీరేచ్చల నియంత్రణ - ఇవే జీవితంలో మనకు క్షేమ మార్గం.CDTel 168.6