Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    వ్యక్తిగత అభిప్రాయాలు పరులపై రుద్దటం

    సంస్కరణ సూత్రాల్ని పాక్షికంగా అవగాహన చేసుకున్నవారు తమ అభిప్రాయాల్ని సొంతంగా ఆచరించటంలోనే కాదు తమ కుటుంబాలు ఇరుగుపొరుగు వారి ఆచరణ విషయంలో కూడా కఠిన వైఖరి అనుసరిస్తారు. తమ సొంత ఆనారోగ్యంలో ప్రతిబింబిస్తున్న తమ తప్పుడు సంస్కరణల ఫలితం, తమ అభిప్రాయాల్ని ఇతరుల పై రుద్దటానికి వారు చేసే ప్రయత్నాలు ఈ మొత్తం ఆరోగ్య సంస్కరణ పట్ల అనేకమందికి తప్పు అభిప్రాయం కలిగించి దాన్ని పూర్తిగా తోసిపుచ్చటానికి దారి తీస్తాయి.CDTel 200.5

    ఆరోగ్య చట్టాల్ని అవగాహన చేసుకుని నియమానికి లోబడి నివసించే వారు తమ వాంఛలు ఆంక్షలు రెంటిలోను తీవ్ర భావాల్ని విడనాడతారు. వారు కేవలం ఆకలి తృప్తి నిమిత్తమే ఆహారాన్ని ఎంపికచెయ్యక శరీర నిర్మాణం నిమిత్తం ఎంపిక చేసుకుంటారు. దేవునికి మానవుడికి అత్యున్నత సేవ చేసేందుకోసం తమ ప్రతీ శక్తినీ ఉత్తమ స్థితిలో కాపాడుకోటానికి పాటుపడతారు. ఆహార వాంఛను స్వస్తబుద్ది మనస్సాక్షి నియంత్రణ కింద ఉంచుతారు. ఫలితంగా వారికి శరీరారోగ్యం మానసికారోగ్యం వరంగా లభిస్తాయి. వారు తమ అభిప్రాయాల్ని బలవంతంగా ఇతరులపై రుద్దరు. వారి ఆదర్శం సరిఅయిన నియమాల పక్షంగా బలంగా సాక్ష్యమిస్తుంది. మేలు చెయ్యటానికి ఈ వ్యక్తులు ప్రభావం పెద్ద ఎత్తున తోడ్పడుతుంది.CDTel 201.1

    ఆహార సంస్కరణతో వాస్తవిక లోకజ్ఞానం ఉంది. ఈ అంశాన్ని విస్తృతంగా నిశితంగా అధ్యయనం చెయ్యాల్సిన అవసరం ఉంది. ఇతరుల ఆచరణ అన్ని విషయాల్లోను తన ఆచరణకు అనుగుణంగా లేనందుకు ఏ వ్యక్తి ఇతరుల్ని విమర్శించకూడదు. ప్రతీ ఒక్కరి అలవాట్లను క్రమబద్దీకరించటానికి ఒకే రకమైన నిబంధనను రూపొందించటం అసాధ్యం. ఏ ఒక్కరూ అందరికీ ఆదర్శనీయుణ్నని భావించకూడదు. అందరూ ఒకేలాంటి ఆహారపదార్థాల్ని తినలేరు. ఒకరికి రుచిగాను పౌష్టికంగాను ఉన్న ఆహార పదార్థాలు ఇంకొకరికి ఏమీ రుచిలేనట్లు హానికరంగా ఉన్నట్లు తోచవచ్చు. కొందరికి పాలు ప్రాణమైతే కొందరికి పడకపోవచ్చు. కొందరికి బటానీలు బీన్సు జీర్ణం కావు. ఇతరులికి అవి బలవర్ధకాహారం. కొందరికి ముతక ధాన్యంతో తయారుచేసిన ఆహారం ఆరోగ్యదాకకమైతే ఇతరులికి అది ససేమిరా పడదు.CDTel 201.2