Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సంస్కరణ ఉద్యమాల్లో ఓర్పు, జాగరూకత,నిలకడ అవసరం

    మనం బోధించే సత్యాల విషయంలో ఎవరి మనస్సాక్షి, మేధస్సు నమ్ముతున్నామో వారిని తీసుకు వెళ్లగలిగే దానికన్నా ఎక్కువ దూరం మనం వెళ్లకూడదు. ప్రజలున్న చోటే వారిని మనం కలవాలి. ఆరోగ్యసంస్కరణ విషయంలో మన ప్రస్తుత స్థాయికి చేరటానికి అనేక సంవత్సరాలు పట్టింది. ఆహారంలో సంస్కరణ సాధన నెమ్మదిగా జరిగే పని. మనం శక్తిమంతమైన రుచులు అభిరుచులు వాంఛల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే లోకం తిండిబోతుతనంలో ఓలలాడుతుంది. సంస్కరణలో ప్రస్తుత ఉన్నత స్థానాన్ని చేరటానికి మనం తీసుకున్నంత సమయాన్ని మనం ప్రజలకు ఇస్తే వారిపట్ల ఓర్పు వహించి, మనలాగే వారూ ఆరోగ్యసంస్కరణ వేదికపై తమ పాదాలు ధృఢంగా నిలుపుకునే వరకు వారిని నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ పురోగమించనిస్తాం. అయితే మనం వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేకుండా మనం ఎక్కువ వేగంగా ముందుకి పోకుండా జాగ్రత్తగా సాగాలి. సంస్కరణ సందర్భంగా గురికి ఓ అడుగు తక్కువ వెయ్యటం మంచిది గాని ఓ అడుగు మించిపోటం కాదు. పొరపాటు అంటూ జరిగితే అది ప్రజల పక్క జరగనివ్వండి.CDTel 490.5

    అన్నింటికన్నా ముఖ్యంగా మన సొంత కుటుంబాల్లో మన భోజనబల్లల మీద మనం ఆచరణాత్మక పరీక్షకు పెట్టని అభిప్రాయాల్ని మన కలం ద్వారా ప్రబోధించకూడదు. ఇది నటన, ఓ రకమైన దొంగాట. పండ్ల కొరత ఉన్న దూర పశ్చిమంలో నివసించే అనేకుల కన్నా మిషిగలోని మనం ఉప్పు, పంచదార, పాలు లేకుండా మెరుగుగా ఉండగలం.... వీటి వినియోగం ఆరోగ్యానికి హానికరమని మనకు తెలుసు. అనే కుల సందర్భంలో వాటిని వాడకుండా ఉంటే ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉంటుందని మనం భావిస్తాం.CDTel 491.1

    అయితే ఇప్పుడు మన హృదయ భారం వీటి గురించి కాదు. ప్రజలు ఎంతగా వెనకబడి ఉన్నారంటే హానికరమైన రుచులు, వాంఛలు, ఉద్రేకపర్చే పానీయాల గురించి మనం నిషేధాలు విధించటం మాత్రమే భరించగలుగుతారు. పొగాకు, సారాయి, ముక్కుపొడి, టీ, కాఫీ, మాంస పదార్థాలు, వెన్న, మసాలాలు, కేకులు, కీమా పైలు, ఎక్కువ పరిమాణంలో ఉప్పు, భోజనం తయారీలో ఉపయోగించే, ఉద్రేకం పుట్టించే సరకుల వాడకం ఎరుగని వ్యక్తుల వద్దకు వెళ్లి మన బలమైన విషయాల్ని మొదట మనం సమర్ధిస్తే, తాము ఎంతటి త్యాగాలు చెయ్యాల్సి ఉంటుందో వారు చూసి సంస్కరణకు ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా నిరాశ చెందే ప్రమాదముంది. మనం ఏ గుంటలో నుంచి పైకి లేపబడ్డామో గుర్తుంచుకుంటూ, ఓర్పుతో క్రమక్రమంగా ప్రజల్ని నడిపించాలి.CDTel 491.2