Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఆదర్శం ద్వారా బోధించండి

    (1900) 6T 336 CDTel 487.1

    799. అవిశ్వాసులతో మీ సహవాసంలో సరియైన నియమాలనుంచి తొలగిపోటానికి సమ్మతించకండి. వారితో భోజనానికి కూర్చుంటే మితంగా . భుజించండి. మనసును తికమక పెట్టని ఆహారాన్నే తీసుకోండి. అమితానికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక విషయాల్ని గ్రహించలేనంతగా మీ మానసిక లేదా శారీరక శక్తుల్ని బలహీనపర్చుకోకండి. తన ప్రశస్త వాక్యంలోని సత్యాల్ని దేవుడు మీ మనసులో ముద్రించేందుకు మీ మనసును సరియైన స్థితిలో ఉంచుకోండి..... తప్పుపట్టటానికి ఇతరుల పై నిఘా వెయ్యకండి. మీ ఆదర్శం ద్వారా ఇతరులికి బోధించండి. మీ ఆత్మత్యాగం, భోజన ప్రీతి పై మీ విజయం, మీ నియమ నిబద్ధతకు సాదృశ్యం కానివ్వండి. పరిశుద్ధ పర్చటానికి, సమున్నతపర్చటానికి సత్యానికున్న ప్రభావానికి మీ జీవితం సాక్షి కానివ్వండి.CDTel 487.2