Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
 • Results
 • Related
 • Featured
No results found for: "".
 • Weighted Relevancy
 • Content Sequence
 • Relevancy
 • Earliest First
 • Latest First
  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents

  భాగం III - చీజ్
  (ఇది - చీజ్ అన్న అవగాహనతో - తినతగింది కాదు - సంకలనకర్తలు)

  (1868) 2T 68 CDTel 382.1

  632. ఓజ్ ని ఎన్నడూ కడుపులోకి ప్రవేశపెట్టకండి.CDTel 382.2

  (1905) M.H.320 CDTel 382.3

  633. బటర్ని వంటలో వాడటం కన్నా చల్లని బ్రెడ్ మీద పాముకుని తినటం తక్కువ హానికరం. దాన్ని పూర్తిగా విడిచి పెట్టటం మంచిది. చీజ్ దీనికన్నా అభ్యంతరకరం. అది ఆహారానికి అస్సలు పనికిరాదు.CDTel 382.4

  [C.T.B.H.46,47] (1890) C.H.114 CDTel 382.5

  634. అనేకమంది తల్లులు తమ కుటుంబాలికి ఉరిలాంటి ఆహార పదార్థాల్ని తమ భోజనబల్లల మీద పెడతారు. మాంస పదార్థాలు, బటర్, చీజ్, కొవ్వు పదార్థాలతో నిండిన పేస్ట్రీలు, మసాలతో వండిన ఆహార పదార్ధాలు, మసాలా కారాలు పెద్దవారు, చిన్నవారు ఇష్టారాజ్యంగా తింటారు. ఈ పదార్థాలు కడుపుని అస్తవ్యస్తం చెయ్యటంలో వాటి పనిని అవి చేస్తాయి. అవి నరాల్ని ఉత్తేజపర్చి మేధని బలహీనపర్చుతాయి. రక్తం ఉత్పత్తి చేసే అవయవాలు అలాంటి వాటిని మంచి రక్తంగా మార్చలేవు. ఆహారం తయారు చెయ్యటంలో ఉపయోగించే కొవ్వు నూనె జీర్ణక్రియని కష్టతరం చేస్తుంది. చీజ్ ఫలితం హానికరం.CDTel 382.6

  (1873) 3T 136 CDTel 382.7

  635. పిల్లల్ని మాంసపదార్ధాలు, మసాలాలు, బటర్, చీజ్ పంది మాంసం పే స్త్రీలు, మసాలా కారాలు తిననివ్వటం జరుగుతున్నది. క్రమం లేకుండా తినటానికి, భోజనాల మధ్య అనారోగ్యకరమైన తిండ్లు తినటానికి కూడా పిల్లల్ని అనుమతించటం జరుగుతున్నది. ఇవి కడుపుని గందరగోళ పర్చటం, అస్వాభావిక చర్యలకు నరాల్ని ఉద్రేకపర్చటం, మేధని బలహీన పర్చటం వంటి తమ పనుల్ని అవి చేస్తాయి. తాము వ్యాధిని మరణాన్ని తెచ్చే విత్తనాల్ని నాటుతున్నామని తల్లిదండ్రులు గుర్తించరు.CDTel 382.8

  R.& H., జూలై 19, 1870 CDTel 383.1

  636. ఇలినోయిస్ రాష్ట్రం , నోరాలో మేము శిబిర సమావేశాలు ప్రారంభించినప్పుడు వారి ఆహారం సందర్భంగా కొన్ని సూచనలు చెయ్యటం నా విధిగా నేను భావించాను. మేరియలో కలిగిన దురదృష్టకర అనుభవాన్ని వారికి చెప్పి, అది సమావేశం నిమిత్తం చేసిన అనవసర సిద్ధబాటు వల్ల సమావేశంలో ఉన్నకాలంలో అనవసర వంటలు తిన్నందువల్ల జరిగిందని చెప్పాను. కొందరు సమావేశాలకి చీజ్ తెచ్చుకుని తిన్నారు. అది తాజాదైనప్పటికీ కడుపు తాళలేనంత శక్తిమంతంగా ఉంది. దాన్ని తినకుండా ఉండాల్సింది.CDTel 383.2

  ఉత్తరం 40, 1893 CDTel 383.3

  637. ఓ శిబిర సమావేశ ఆవరణలో ఉన్నవారికి చీజ్ అమ్మకూడదన్న తీర్మానం తీసుకోటం జరిగింది. కాని ఆవరణలోకి వచ్చాక అక్కడ అమ్మటానికి ఓ కిరాణా కొట్టు పెద్దమొత్తంలో చీజ్ కొన్నట్లు డా. కెలాగ్ కి తెలిసింది. అతడూ ఇంకా కొందరు దానికి అభ్యంతరం తెలిపారు. కాని ఆ దుకాణ నిర్వాహకులు ఆ చీజ్ ని సోదరుడు — అనుమతితో కొన్నామని, దాని పై పెట్టిన డబ్బుని నష్టపోలేమని బదులు పలికారు. అప్పుడు ఆ చీజ్ ఖరీదెంత అని డా. కెలాగ్ అడిగి వారి వద్ద ఉన్న చీజ్ అంతా కొన్నాడు. కార్యకారణ నియమం ద్వారా ఆ విషయాన్ని పరిశీలించి సామాన్యంగా ఆరోగ్యదాయకంగా పరిగణించబడే కొన్ని ఆహార పదార్థాలు చాలా హానికరమని తెలుసుకున్నాడు. [శిబిర సమావేశ ఆవరణలో చీజ్ అమ్మకం-529]CDTel 383.4

  Larger font
  Smaller font
  Copy
  Print
  Contents