Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    శారీరక, మానసిక అశక్తతకు కారణం

    (1890) C.T.B.H.154 CDTel 132.6

    219. దైవ ప్రజలుగా, ఆరోగ్య సంస్కరణను ఆచరిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న మనం అతిగా తింటున్నాం. ఆహారవాంఛ తృప్తి శారీరక, మానసిక దుర్బలతకు పెద్ద హేతువు. సర్వత్రా కనిపించే శక్తిహీనతకు అది పునాదిగా కనిపిస్తున్నది.CDTel 132.7

    (1870) 2T 362, 365 CDTel 132.8

    220. ఆరోగ్యసంస్కరణను అవలంబించే వారందరూ హానికరమైన సమస్తాన్నీ విడిచి పెడ్తారు. అలాగని వారు తమ ఇష్టానుసారంగా తినవచ్చా? దాని అర్థం ఇదా? భోజనానికి కూర్చుని, ఎంత తినాలి అన్నది పరిగణించకుండా, తిండి మొదలు పెట్టి పరిమితిలేకుండా తింటారు. మిగిలిన దినమంతా అది నిభాయించగలిగింది లేదా నిభాయించవలసింది, దానిమీద బలవంతంగా పెట్టబడ్డే భారం అంతా కడుపులో ఉంటుంది. కడుపులోకి వెళ్లే శరీర వ్యవస్థ ఉపయోగించుకోలేని, ఆహారమంతా ప్రకృతికి తన పనిలో భారంగా మిగులుతుంది. జీవయంత్రానికి అది ఆటంకంగా ఉంటుంది. అది శరీర వ్యవస్థకు ఆటంకం కలిగించటంతో వ్యవస్థ దాని పనిని చెయ్యలేకపోతుంది. ఇలా ముఖ్యఅవయవాలపై అనవసర భారం పడుతుంది. శరీర వ్యవస్థ కు ఎలాంటి మేలూ చెయ్యని ఆహారాన్ని పరిష్కరించటంలో జీర్ణమండల అవయవాలికి సహాయం చెయ్యటానికి మెదడులోని నాడీ శక్తి అన్నకోశానికి వెళ్లటం అవసరమౌతుంది....CDTel 132.9

    అతి తిండి అన్నకోశం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? అన్నకోశం బలహీనమౌతుంది. జీర్ణక్రియ అవయవాలు బలహీనమౌతాయి. ఫలితంగా వ్యాధి దాని దుష్పరిణామాలు వస్తాయి. వ్యక్తులు ముందే వ్యాధిగ్రస్తులైతే, వారి కష్టాలు శ్రమలు ఎక్కువవుతాయి. తాము జీవించే దినాలన్నీ వారి శక్తి క్షీణిస్తూ వస్తుంది. తాము అన్నకోశంలోకి తీసుకున్న ఆహారాన్ని పరిష్కరించటానికి వారు తమజీవశక్తిని అనవసరంగా వ్యయం చేస్తారు. ఇది ఎంత భయంకర పరిస్థితి!CDTel 133.1

    అనుభవపూర్వకంగా అజీర్తి వ్యాధిని గూర్చి మనకు కొంత తెలుసు అది మన కుటుంబంలో ఉంది. అదెంతో భయపడాల్సిన వ్యాధి అని గుర్తిస్తాం. ఓ వ్యక్తి పూర్తిగా అజీర్తి, వ్యాధి బారిన పడితే అతడికి మానసికంగాను శారీరకంగాను తీవ్రశ్రమ కలుగుతుంది. మిత్రులు భావోద్వేగాలు లేనివారైతే తప్ప వారుకూడా అతడితో బాధపడ్డారు.CDTel 133.2

    అయినా, “నేను ఏమి తింటానో లేదా ఏ మార్గాన్ని అవలంబిస్తానో మీ కనవసరం” అని మీరంటారా? అజీర్తి రోగుల దగ్గరున్న వారు బాధకు గురి అవుతారా? వారికి కోపం వచ్చే చిన్న పని చెయ్యండి. రాద్ధాంతం చెయ్యటం వారికి ఎంత స్వాభావికమౌతుంది! వారు మానసికంగా బాధపడ్డారు. వారి దృష్టికి తమ పిల్లలు చెడ్డవారిగా కనిపిస్తారు. ప్రత్యేక దైవకృప ఉంటే తప్ప, వారు తమ కుటుంబాల్లో, నెమ్మదిగా ప్రేమగా మాట్లాడలేరు, వ్యవహరించలేరు. వారి చుట్టూ ఉన్నవారందరిపై ఆ వ్యాధి ప్రభావం పడుతుంది. వారి వ్యాధి పర్యవసానాల్ని అందరూ పంచుకోవలసిందే. వారి శ్రమల నీడ అందరిమీద పడుతుంది. అలాగైనప్పుడు మీ భోజన పానాల అలవాట్లు ఇతరుల్ని ప్రభావితం చెయ్యవా? తప్పక చేస్తాయి. కనుక దేవునికి సంపూర్ణ సేవ చెయ్యటానికి సమాజం పట్ల మీ కుటుంబం పట్ల మీ విధిని నెరవేర్చటానికి మీరు మీ ఆరోగ్యాన్ని ఉత్తమ స్థితిలో కాపాడుకోటానికి శ్రద్ధ వహించాలి.CDTel 133.3

    తీసుకోవలసిన ఆహారం పరిమాణం విషయంలో ఆరోగ్యసంస్కర్తలు సయితం పొరపాటు చెయ్యవచ్చు. వారు ఆరోగ్యవంతమైన నాణ్యత గల ఆహారాన్ని మితిమీరి తినవచ్చు.CDTel 134.1

    MS 93, 1901 CDTel 134.2

    221. మనం సాధారణంగా ఎక్కువ ఆహారంతో కడుపుని నింపుతున్నామని ప్రభువు నాకు ఉపదేశిస్తున్నాడు. అనేకులు అతిగా తినటం వల్ల అసౌకర్యంతో బాధపడ్డారు. దాని ఫలితం వ్యాధి. ఆ వ్యాధి దేవుడు వేసిన శిక్షకాదు. తామే స్వయంగా తమ మీదికి తెచ్చుకున్నది. బాధ అతిక్రమ ఫలితమని వారు గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు.CDTel 134.3

    అనేకులు వడివడిగా తింటారు. ఇతరులు ఒకే భోజనంలో పడని పలు ఆహార పదార్థాలు తింటారు. కడుపుని శ్రమ పెట్టినప్పుడు ఆత్మనూ శ్రమ పెడ్తామని, కడుపుని దుర్వినియోగం చేసినప్పుడు క్రీస్తుని అగౌరవపర్చుతామని పురుషులు స్త్రీలు గుర్తుంచుకుంటే, వారు ధైర్యం వహించి, ఆత్మో పేక్షపాటిస్తూ కడుపు కోలు కుని ఆరోగ్యవంతంగా పనిచెయ్యటానికి దానికి అవకాశం ఇస్తారు. భోజనానికి కూర్చున్నప్పుడు, దేవుని మహిమ కొరకు ఆహారపానాలు తీసుకోటం ద్వారా వైద్యమిషనరీ సేవ చెయ్యవచ్చు.CDTel 134.4