Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    అనుబంధం II ఆరోగ్య సంస్కరణ, బోధన సంబంధంగా జేమ్స్ వైట్ ప్రకటన

    కేన్సస్ లో 1870లో జరిగిన శిబిర సమావేశాన్ని గూర్చి నివేదించటంలో ఆరోగ్య సంస్కరణ పై వచ్చిన వెలుగు పురోగతిని గూర్చి, అంశాల బోధనలో అవివేక పద్ధతుల్లోని ప్రమాదాన్ని గూర్చి, అప్పుడు కొందరు ప్రబోధిస్తున్న తీవ్ర భావజాలాన్ని గూర్చి ఎల్డర్ జేమ్స్ వైట్ ఈ దిగువ ప్రకటన చేశాడు. చరిత్రాత్మక ప్రకటనగా ఆ కాలంలో దాఖలు చేసిన ఆమె బోధనల్లో కొన్నింటిని ఇది ఉదాహరిస్తుంది. - సంకలన కలు)CDTel 520.2

    R. & H., నవం . 8, 1870 CDTel 520.3

    ఆరోగ్యాంశం పై శ్రీమతి వైట్ పరిపూర్ణ తృప్తినిచ్చే రీతిగా మాట్లాడింది. ఆమె వ్యాఖ్యలు స్పష్టంగా, శక్తిమంతంగా, జ్ఞానయుక్తంగా ఉన్నాయి. ఆమె మాటలు సమావేశంలోని వారందరి మనసుల్ని మనోభావాల్ని ఆకట్టుకున్నాయి. ఈ అంశం పై ఆమె తీవ్ర భావాల్ని ప్రోత్సహించకుండా దురభిప్రాయాల్ని రెచ్చగొట్టని రీతిగా ఎప్పుడూ జాగ్రత్తగా మాట్లాడుతుండేది.CDTel 520.4

    ఆరోగ్య సంస్కరణ మద్దతుదారులు తరుణాన్ని ఎంపిక చేసుకోటంలో లేదా దాన్ని సమర్పించటానికి పద్దతిని రూపొందించుకోటంలో - ముఖ్యంగా తీవ్ర భావాలు గలవారి ముందు నిలబడినప్పుడు - తప్పటడుగువేస్తే, ప్రజలు ఉద్రేకపడి ఆ అంశం పై ద్వేషం పెంచుకుంటారు. “ఏకాంత పాపం” వంటి సున్నితమైన సమస్యల్ని చర్చించకూడదు. ఆ అంశాన్ని పత్రికల్లోనే ఉచిత సమయంలో చర్చించాలి. శాఖోప శాఖలుగా విస్తరించి ఉన్న ఆరోగ్య సమస్యను చర్చించటానికి జ్ఞాన వివేకాలుగల బోధకులు పదిమందిలో ఒక వ్యక్తి కూడా లేడు. ఆరోగ్య సంస్కరణాంశం పై చర్చను అనుచిత స్థలంలో అనుచిత సమయంలో అనుచిత మార్గంలో ప్రవేశపెట్టేవారు తమ అనుచిత కార్యాచరణ వల్ల ప్రస్తుత కాల సత్యానికి చేసే కీడు అంతా ఇంతా కాదు.CDTel 520.5

    “నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు” అని యేసన్నాడు. తన శిష్యుల మనసుల్ని ఎలా నడిపించాలో యేసు ఎరుగును. వేచి ఉన్న ప్రజలకు వారి అవగాహనశక్తి మేరకు ఆరోగ్య సంస్కరణను మెట్టు వెంట మెట్టులా మనసులు విసుగు చెందకుండేటట్లు ఎలా సమర్పించాలో ప్రభువుకి తెలుసు. ఈ వసంతం నుంచి ఇరవై రెండు వసంతాల కిందట పొగాకు, టీ, కాఫీల వాడకం వల్ల కలిగే హానిని గురించి శ్రీమతి వైట్ సాక్ష్యాల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడు. వీటిని విడిచి పెటట్టంలో మన కృషిని దేవుడు బహుగా దీవించాడు. తీరని కీడు చేసే ఈ చెడు వ్యసనాల్ని విసర్జించటంలో ఓ మత శాఖగా మనం సాధించిన విజయం నిమిత్తంగా మనం ఉత్సహించవచ్చు.CDTel 521.1

    మేము వీటి పై విజయం సాధించినప్పుడు, మేము సహించగలమని ప్రభువు చూసినప్పుడు, ఆహారం విషయంలోను వస్త్రధారణ విషయంలోను వెలుగునిచ్చాడు. మన ప్రజల మధ్య ఆరోగ్య సంస్కరణ ఉద్యమం స్థిరంగా ముందుకి సాగింది. ప్రధానంగా పంది మాంసం ఉపయోగించటంలో ఓ దశ వచ్చి వ్యాధి ప్రబలటంతో ఆరోగ్య సంస్కరణను గురించి శ్రీమతి వైట్ మాట్లాడటం రాయటం ఆపుచేసినప్పుడు గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఓ జనాంగంగా ఈ అంశానికి సంబంధించి మన బాధలు తప్పిదాలు ఇక్కడ నుంచే ప్రారంభమయ్యాయి.CDTel 521.2

    మనం మళ్లీ క్రియాత్మకమయ్యాం గనుక, ఏ కారణం వల్లకన్నా ఎక్కువ విపరీత ధోరణుల ప్రాబల్యం వల్ల శ్రీమతి వైట్ ఆరోగ్య సంస్కరణాంశం పై మరెక్కువ మాట్లాడాల్సిందిగా పిలుపు పొందినట్లు పరిగణించింది.CDTel 521.3

    మన ప్రజల్లో ఆరోగ్య సంస్కరణ విషయంలో తీవ్ర భావజాలం కలవారందరూ లేదా దాదాపు అందరూ తామే శ్రీమతి వైట్ ఆమోదముద్ర పొందినవారమని భావించటమే ఈ అంశం పై తన వాస్తవ భావాల్ని వ్యక్తం చెయ్యటం తన విధి అని ఆమె భావించటానికి కారణం. కాల క్రమంలో ఈ అందిపై ఆమె వైఖరిని ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకుంటారు.CDTel 521.4

    పొగాకు, టీ, కాఫీ, మాంసం వాడకం విషయంలోను, వస్త్రధారణ విషయంలోను సాధారణ అగీకారం ఉంది. కాని ఉప్పు, పంచదార, పాలు వాడటం విషయంలో తీవ్ర వైఖరి అవలంబించటానికి ప్రస్తుత సమయంలో ఆమె సిద్ధంగా లేదు. సామాన్యవాడకంలో ఉన్న వీటి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోవటానికి ఏ యితర కారణం లేకపోతే, వీటికి సంబంధించిన వాస్తవాల్ని అంగీకరించటానికి అనేకులు సంసిద్ధంగా లేరన్న విషయంలో చాలినంత కారణముంది. వ్యక్తుల పూర్తి నిరాకరణ, మన సంఘాల్లో కొన్నింటి దాదాపు సర్వనాశనం ఇవి అప్పటినుంచి కొంత కాలంగా రివ్యూలో వెలువడ్డ తీవ్రభావాల ఫలితమే అనాలి. ఫలితాలు భయానకంగా ఉన్నాయి. వ్యవహార శైలి సరిగా లేనందుకు కొందరు ఆరోగ్య సంస్కరణాంశాన్ని నిరాకరించగా, మనస్సాక్షి ప్రేరితులైన ఇతరులు తీవ్ర భావాల్ని ప్రబోధించారు. ఇవి వారి ఆరోగ్యానికి ఆరోగ్య సంస్కరణ కృషికీ తీవ్ర హాని కలిగించాయి.CDTel 522.1

    ఎంత నిరాశాజనకంగా ఉన్నా, ఈ పరిస్థితుల్లో తన సేవను తిరిగి చేపట్టాలని శ్రీమతి వైట్ భావించింది. అలా చెయ్యటంలో తన అభిప్రాయాల పై అందరికీ మార్తి అవగాహన కలిగించాలని నిశ్చయించుకున్నది. ఇక్కడో విషయం చెప్పటం మంచిది. సాధారణంగా బ్రెడ్ని ఎక్కువ పాలతో తినటానికి అలవాటుపడి తింటుండగా పాలు మంచి ఆహార పదార్దంకాదని ఆమె భావించినా, ఏ ఆవు పాలని ఉపయోగిస్తామో అది మంచి ఆరోగ్యం గల ఆవు అయి ఉండాలన్న విషయం పై మాత్రమే ఆమె దృష్టి సారించింది. తనకు ప్రస్తుతమున్న వెలుగుతో పాల సమస్య విషయంలో అతివాదాన్ని బలపర్చుతున్న ప్రచురణలతో ఆమె గళం కలపజాలదు. అలాంటి ప్రచురణలు మంచి జ్ఞానం గల ఆరోగ్య సంస్కర్తలకు మేలు చెయ్యవచ్చు. బేటిల్ క్రీక్ లో ఉన్న మన ఆరోగ్య సంస్థ వంట శాఖ దాని భోజన బల్లలపై అలవాటు ప్రకారం ఉంచే పాలను తీసివేసిన తర్వాత, వండటంలో వారికి అవి మార్గదర్శకాలుగా ఉపయోగపడవచ్చు. మన వాక్యపరిచారకులు పట్టుదలగల ఆరోగ్య సంస్కర్తలై ఆవుపాల విశృంఖల వినియోగాన్ని ఆపినప్పుడు అలాంటి ప్రచురణలు మన ప్రజలపై పటతరమైన ప్రభావాన్ని చూపవచ్చు.CDTel 522.2

    ఈ అంశం పై మన బలహీనత ఇది. విద్యలేనివారికి, త్వరితంగా దురభిప్రాయాలు ద్వేషం ఏర్పర్చుకునే వారికి వెళ్లే మన ప్రచురణలు, వీటిలో కొన్నింటి పై - ఆరోగ్య సంస్కరణ ప్రతినిధులమైన మనలో కొందరి అభ్యాసాలపై - ఓ అడుగు ముందున్నాయి. ప్రచురణలు సంస్కరణోద్యమ నాయకులు అంగీకరించిన అభిప్రాయాల్ని గురించి మాత్రమే మాట్లాడాలని, ఆ మీదట దురభిమానం కలిగించని తీరుగా వ్యవహరించి, మంచి పురుషులు స్త్రీలని మన ప్రభావ పరిధి వెలపలికి నెట్టకుండా ఉండేలా ఈ పరిస్థితిని మార్చాలని శ్రీమతి వైట్ విజ్ఞప్తి చేస్తుంది. ఆరోగ్య సంస్కర్తల సంయుక్త అభ్యాసాలు ముందడుగు వెయ్యాలి. వాటి వెనక మన ప్రచురణలు వెళ్లి, విద్యలేనివారు గ్రహించగలగేటట్లు పరిణతిగల మాటలు మాట్లాడి అభిప్రాయాలు వెల్లడించాలి.CDTel 523.1

    అతి సామాన్య మాంస పదార్థాల వాడకం నుంచి పంచదార విస్తారంగా వాడకం వరకు వచ్చిన మార్పు నానాటికి “అధ్వానమౌతున్నదని” శ్రీమతి వైట్ భావిస్తున్నది. పంచదార ఉప్పు మితంగా వాడాలని ఆమె సిఫారసు చేస్తున్నది. ఈ రెండింటినీ మితంగా వాడటానికి రుచిని అభిరుచిని తర్పీదు చెయ్యాలి, చెయ్యవచ్చు అంటుంది. ఉప్పు విషయానికొచ్చినప్పుడు, ఎక్కువ ఉప్పు తినటానికి అలవాటుపడ్డ వ్యక్తికి ఉప్పు అంతగా తగ్గిన ఆహారం కొన్ని వారాలపాటు మితవాడకం ఉప్పగా బాధాకరంగా ఉన్నట్లనిపిస్తుంది. పొగాకు, టీ, కాఫీ, అలవాటుకి బానిసలైనవారు వాటిని వెంటనే ఒకదాని తర్వాత ఒకటిగా మానటం సాధ్యంకాగా ఆహారంలో ఒకదాని వెంట ఒకటి మార్పులు - చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. త్వరత్వరగా మార్పులు చేసే ప్రమాదంలో ఉన్నవారిని ఇలా హెచ్చరిస్తుండగా, జాప్యం చేసే వారిని కూడా మార్పు చెయ్యటం విస్మరించవద్దని ఆమె హెచ్చరిస్తున్నది. అతి సామాన్య విషయాలు సామాన్య జీవిత అభ్యాసాల్లో మార్పును డిమాండు చేస్తున్నాయి. అయితే ఆరోగ్యానికి దేహతత్వానికి హాని చేసేంత వేగంగా మార్పులు చెయ్యకూడదు.CDTel 523.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents