Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    కొన్నిటిని మనకి మనమే చేసుకోవచ్చు

    ఉత్తరం 35, 1890 CDTel 313.4

    454. నేను నన్ను గూర్చి తెలుసుకోవాలి. దేవుడు నాకిచ్చిన శరీరమనే ఈ ఆలయాన్ని అత్యుత్తమ ఆరోగ్యస్థితిలో కాపాడుకునేందుకు దాన్ని ఎలా పోషించుకోవాలో నేను ఎల్లప్పుడూ నేర్చుకోవాలి. శారీరకంగా నాకు మేలు చేసే ఆహారాన్ని ఆహార పదార్థాల్నే నేను తినాలి. ఆరోగ్యవంతమైన రక్త ప్రసరణకు దోహదపడే బట్టలు ధరించటానికి నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాయామం వల్ల మంచి గాలివల్ల లభించే మేలుని నేను పోగొట్టుకో కూడదు. నా దేహానికి రక్షక భటుడిగా నమ్మకంగా వ్యవహరించటానికి నాకు వివేకం ఉండాలి.CDTel 313.5

    చెమట పట్టినప్పుడు చల్లని గదిలోకి వెళ్లటం బుద్దిహీనమైన పని అని గుర్తిస్తాను. చలిగాలిలో కూర్చుని రొంప పట్టేంతగా దానికి లోను చేసుకుంటే నేను అవివేకి అయిన గృహనిర్వాహకుణ్నవుతాను. చల్లని కాళ్లు చేతులతో కూర్చుని ఆ రీతిగా నా దేహం చివరి భాగాలనుంచి రక్తాన్ని మెదడుకో లేక లోపలి అవయవాలకో పంపటంలో అవివేకంగా ప్రవర్తిస్తాను. తేమగా ఉండే వాతావరణంలో నేను నా కాళ్లని ఎప్పుడూ వెచ్చగా ఉంచుకోవాలి. మంచి రక్తం ఉత్పత్తి అయ్యేందుకు నేను మిక్కిలి ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని క్రమంగా భుజించాలి. సాధ్యమైనంతవరకు నేను మితిమీరి పనిచెయ్యకూడదు. నాదేహంలో దేవుడు పెట్టిన చట్టాల్ని నేను అతిక్రమించినప్పుడు పశ్చాత్తాపపడి, తప్పు దిద్దుకుని, దేవుడు ఏర్పాటు చేసిన వైద్యుల కింద స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వస్తత కూర్చే అమూల్యమైన సూర్యరశ్మి వినియోగించుకుంటూ నివసిస్తాను.CDTel 314.1

    బాధ నివారణకి నీటిని అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. భోజనానికి ముందు స్వచ్చమైన వేడి నీరు (ఇంచుమించు సగం క్వార్ట్) తీసుకుంటే హాని కలగదు, మేలే కలుగుతుంది.CDTel 314.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents