Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    మనమీదికి మనమే తెచ్చుకున్న బాధ

    198. మానవులు తమ చెడు అలవాట్ల వల్ల వివిధరకాల వ్యాధుల్ని తమ మీదికి తెచ్చుకున్నారు. ఆరోగ్యంగా నివసించటం నేర్చుకోలేదు. తమ దేహానికి సంబంధించిన చట్టాల ఉల్లంఘన విచారకరమైన పరిస్థితుల్ని సృష్టిస్తున్నది. తమ బాధకు అసలు కారణం తమ తప్పుడు అలవాట్లు పనులు అని ప్రజలు గుర్తించటం చాలా అరుదు. ప్రజలు మితం పాటించకుండా అతిగా తిండి తింటున్నారు. తిండే తమ దేవుడుగా ఎంచుకుంటున్నారు. ఆరోగ్యానికి జీవితానికి సంబంధించినంత వరకు తమ అలవాట్లన్నింటిలోను లెక్కలేనితనాన్ని ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారు. పర్యవసానంగా, తాము చేజేతుల చేసుకున్న దాని కారణంగా వ్యాధి వచ్చినప్పుడు, దానికి కారణం దేవుడేనని నమ్ముతారు.CDTel 118.3

    (1905) M.H.234,235 CDTel 119.1

    199. వ్యాధి కారణం లేకుండా రాదు. ఆరోగ్య చట్టాల అతిక్రమం వ్యాధికి మార్గం సుగమం చేసి ఆహ్వానిస్తుంది. తమ తల్లిదండ్రుల అతిక్రమ పర్యవసానంగా అనేకులు వ్యాధి బారినపడ్డారు. తల్లిదండ్రులు చేసిన దానికి తాము బాధ్యులు కాకపోయినప్పటికి, ఏది ఆరోగ్య చట్టాల ఉల్లంఘన ఔతుంది ఏది కాదు అన్న విషయాన్ని నిర్ధారించుకోటం వారి విధి. వారు సరిగా నివసించటం ద్వారా తమను తాము మెరుగైన స్థితిలో ఉంచుకుంటూ తమ తల్లిదండ్రుల తప్పుడు అలవాట్లను నివారించుకోవాలి.CDTel 119.2

    తమ తప్పుడు కార్యాలవల్ల ఇంకా ఎక్కువ మంది బాధకు గురి అవుతున్నారు. తమ ఆహార పానాలు, వస్త్రధారణ, పని సందర్భంగా తమ అతిక్రమం దాని ఫలితాల్ని అది చూపిస్తుంది. వ్యాధి వచ్చినపుడు, అనేకులు తమ బాధకు అసలు కారణాన్ని గుర్తించకుండా తమ శ్రమలు దేవుని వల్ల కలిగాయని ఆయన మీద సణుగు కుంటారు. కాని ప్రకృతి చట్టఉల్లంఘన ఫలితంగా వచ్చే బాధకు దేవుడు బాధ్యుడు కాడు.CDTel 119.3

    మితం లేని తిండి వ్యాధికి కారణం. ప్రకృతికి ఎక్కువ అవసర మయ్యింది ఏంటంటే తనమీద ఉన్న భారాన్ని నివారించటం.CDTel 119.4

    [తల్లిదండ్రులే వ్యాధి, మరణం విత్తుల్ని నాటుతారు-635] CDTel 119.5

    [తప్పనిసరి శిక్ష-11,29,30,221,227,228,250,251,291] CDTel 119.6