Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సారా ఇవ్వకూడదు

    (1902) 7T 95 CDTel 306.2

    439. మనం ఆసుపత్రుల్ని హోటళ్లగా కట్టటం లేదు. నీతి న్యాయ నియమాల్ని ఆచరించాలని ఆశించేవారికి, మనస్సాక్షితో తమ ముందు పెట్టే ఆహారాన్ని అంగీకరించే వారికి మాత్రమే మనం మన సంస్థల్లోకి ప్రవేశమివ్వాలి. తమ గదుల్లో రోగులకి మత్తు కలిగించే సారాని అనుమతిస్తే, లేక వారికి మాంసాహారం అందిస్తే, వారు మన ఆసుపత్రికి రావటంలో ఏ ఉపకారాన్ని ఆశిస్తున్నారో దాన్ని వారు పొందలేరు. అలాంటి పదార్థాల్ని మన ఆసుపత్రులనుంచి ఆరోగ్యహోటళ్ల నుంచి నియమబద్దంగా ‘తొలగిస్తున్నామని మనం వెల్లడి చెయ్యాలి. సాటి మనుషులు వ్యాధి విముక్తులవ్వాలని వారు ఆరోగ్యం బలం కలిగి ఆనందంగా నివసించాలని మనం కోరుకోమా? అందుచేత మనం దిక్సూచి ముల్లులా నియమబద్ధంగా నివసించాలి.CDTel 306.3