Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నైతిక ధైర్యానికి సంబంధించిన విషయం

    (1870) 2T 374 CDTel 171.6

    263. ఎంత తినాలో మీకు ఎవరైనా చెబితే బాగుంటుంది అన్నట్లు మీలో కొందరు భావిస్తున్నారు. ఇది మంచిది కాదు. మనం నైతికమైన ఆధ్యాత్మికమైన దృక్పథంతో వ్యవహరించాలి. మనం అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. ఎందుకంటే మనముందు అక్షయకిరీటం, పరలోక ఐశ్వర్యం ఉన్నవి. ఇప్పుడు నా సోదర సోదరీలకి నేను చెప్పేదేంటంటే నైతిక ధైర్యం కూడగట్టుకుని నన్ను నేను అదుపులో ఉంచుకుంటాను. ఆ బాధ్యతను ఇంకొకరిమీద పెట్టను. మీరు అతిగా తిని ఆ మీదట చింతిస్తారు. ఏమితినాలి ఏమి తాగాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఏది మంచిదో దాన్నే తింటూ, దేవుని దృష్టికీ సరిగా ఉంటూ విచారించకుండా నివసించండి. పిల్లలనుంచిగాని పెద్దవారినుంచిగాని శోధనను పూర్తిగా తొలగించాలని మేము భావించం. మన ముందు ఓ పోరాటముంది. సాతాను శోధనల్ని ప్రతిఘటించటానికి మనం ఓ స్థానంలో నిలబడాలి. ఇది చెయ్యటానికి మనకు శక్తి ఉన్నదని మనం తెలుసుకోవాలి!CDTel 171.7

    ఉత్తరం 324, 1905 CDTel 172.1

    264. మీ కందించటానికి దేవుడు నాకోవర్తమానం ఇచ్చాడు. క్రమంగా భోజనం చెయ్యటమన్నదే ఆ వర్తమానం. తిండి విషయంలో తప్పుడు అలవాట్ల వల్ల మీరు భవిష్యత్తులో బాధకు సిద్ధపడున్నారు. అనేక రకాల వంటకాలతో భోజనబల్ల నింపి భోజనానికి పిలిచే మిత్రులు సహోదరుల ఆహ్వానాల్ని అంగీకరించటం ఎల్లప్పుడూ క్షేమం కాదు. మీ జీర్ణమండల అవయవాలికి హాని కలగకుండా ఒక్క భోజనంలో రెండు లేక మూడు వంటకాలు తినవచ్చునని మీకు తెలుసు. భోజనానికి ఎవరైనా ఆహ్వానించినప్పుడు వారు మీ ముందు పెట్టే రకరకాల వంటకాల్ని విడిచి పెట్టండి. నమ్మకమైన కావలి వాడిగా ఇది మీరు చెయ్యాలి. జీర్ణక్రియ అవయవాలకి గంటల కొద్దీ పని కల్పించే వంటకాలతో కూడిన ఆహారం మనముందుంచినప్పుడు అది తిని దాని పర్యవసానానికి అతిధేయిని నిందించకూడదు. జీర్ణమండల అవయవాలకి బాధ కలిగించని ఆహారాన్ని మాత్రమే మనం తినాలని దేవుడు కోరుతున్నాడు.CDTel 172.2

    [శరీరం మనసుకి లోబడాలి-35] CDTel 172.3

    [ఆహారం విషయంలో చిన్ననాడే శిక్షణ-346,353] CDTel 172.4

    [తిండి పట్ల ఆసక్తి, ఉత్సాహం వద్దు-65]CDTel 172.5

    [అమితాహారిచే స్వస్తత కొరకు ప్రార్థన-29] CDTel 173.1

    [ప్రభావంపై, ఉపయోగకారిత్వం పై అతితిండి ఫలితాలు-72] CDTel 173.2