Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సత్యాభినందన ఫలితం

    (1868) 2T 66 CDTel 40.1

    58. సత్యం తాలూకు ఉన్నత ప్రమాణాన్ని అభినందించటానికి, ప్రాయశ్చిత్తం విలువ గ్రహించటానికి నిత్య విషయాల గురించి సరియైన అంచనా వెయ్యటానికి మీకు స్పష్టమైన పటిష్టమైన మనసు అవసరం. తప్పుదారి పట్టి తిండి విషయంలో దురలవాట్లు ఏర్పర్చుకుని, ఆ రకంగా మీరు మీ మానసిక శక్తుల్ని బలహీనపర్చుకుంటే క్రీస్తు జీవితం వంటి జీవితానికి స్ఫూర్తినిచ్చే రక్షణ, నిత్యజీవం సమున్నత విలువను గుర్తించరు. దేవుని చిత్తానికి పూర్తి అనుగుణంగా నివసించేందుకు యథార్ల, ఆత్మత్యాగపూరిత కృషిని మీరు చెయ్యరు. దైవవాక్యం ఆ కృషిని కోరుతున్నది. అమర్త్యతకు తుది మెరుగులు దిద్దే పనికి నైతిక అర్హత నిచ్చేందుకు అది మీకు అవసరం.CDTel 40.2

    (1870) 2T.364 CDTel 40.3

    59. ఆహారం నాణ్యత విషయంలో మీరు ఖచ్చితంగా ఉన్నా అలాంటి ఆహారం తినటం ద్వారా, ఆయనకు చెందే మీ శరీరాత్మలతో మీరు దేవున్ని మహిమపర్చుతున్నారా? అంత ఆహారం తిని కడుపు పై భారం మోపి తద్వారా ప్రకృతిని లెక్కచెయ్యనివారు సత్యాన్ని వినటం జరిగినప్పుడు దాన్ని అభినందిచలేకపోయారు. పాపంవల్ల పతనమైన మానవుడి నిమిత్తం క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తం విలువను గ్రహించటానికి మద్దుబారిన తమ మానసిక శక్తుల్ని మేల్కొల్పలేక పోయారు. నమ్మకంగా నిలిచే విజేతలకు ఉంచిన ప్రశస్తమైన, ఎంతో విలువైన బహుమానాన్ని అలాంటి వారు అభినందించటం అసాధ్యం. మన నైతిక, మానసిక శక్తుల్ని మన స్వభావంలోని పాశవిక ప్రవృత్తి అధికారానికి విడిచి పెట్టకూడదు. -CDTel 40.4

    (1867) 1T.548,549 CDTel 40.5

    60. కొందరు ఆహారా పేక్షకు బానిసలౌతున్నారు. అది వారి ఆత్మకు కీడుచేసి వారి ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుకట్ట వేస్తుంది. నిందించే మనస్సాక్షితో వారు నివసిస్తారు. సరళమైన సత్యబోధ జరిగినప్పుడు వారు అభ్యంతర పడతారు. ఆత్మఖండనకు గురియై, తమను కించపర్చటానికే ఆ అంశాలను ప్రస్తావించటం జరిగిందని భావిస్తారు. తమకు అన్యాయం జరిగిందని బాధపడూ సంఘసమావేశాలకు హాజరుకావటం విరమించుకుంటారు. వారు సమావేశమవ్వటం మానుకుంటారు. ఎందుకంటే అప్పుడు మనస్సాక్షి వారిని నిందించదు. కొద్దికాలంలోనే సమావేశాల పట్ల వారి ఆసక్తి, సత్యంపట్ల వారి ప్రేమ నశిస్తాయి. తమలో సంపూర్ణ దిద్దుబాటు చోటుచేసుకుంటే తప్ప వారు తమ వెనకటి జీవితానికి తిరిగి వెళ్ళి సాతాను నల్లండాకింద నిలిచే తిరుగుబాటుదారుల మధ్యస్థానం పొందుతారు. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశల్ని వీరు సిలువ వేస్తే, వారు పక్కకు తొలగుతారు. అక్కడ సత్యబాణాలు వారికి గాయం చెయ్యకుండా వారి పక్కనుంచి వెళ్ళిపోతాయి. అయితే వారు శరీరాశలు తృప్తి పర్చుకోటానికి ఆకలిగా ఉండటం ద్వారా తమ విగ్రహాల్ని ప్రేమిస్తే సత్యబాణాల వేటుకి గురి అవుతారు. సత్యం ప్రకటితమైతే వారు గాయపడాలి......CDTel 40.6

    అస్వాభావిక ఉత్తేజాల వినియోగం ఆరోగ్యానికి విఘాతం కలిగించి, మెదడును మొద్దుబార్చుతుంది. అది నిత్యజీవానికి సంబంధించిన విషయాల్ని అభినందించటం అసాధ్యమౌతుంది. ఆత్మనిరసనతో కూడిన జీవితం ద్వారా నిత్యం శ్రమలు అవమానం భరించిన జీవితం ద్వారా, అంతిమంగా మానవుణ్ణి నిత్యమరణం నుంచి రక్షించేందుకు సొంత ప్రాణం త్యాగం చెయ్యటం ద్వారా క్రీస్తు సాధ్యపర్చిన రక్షణ విలువ ఈ విగ్రహాల్ని ప్రేమించేవారు సరిగా గ్రహించలేరు.CDTel 41.1

    (1870) 2T486 CDTel 41.2

    61. బటర్, మాంసం ఉద్రేకం పుట్టిస్తాయి. ఇవి అన్నకోశానికి హాని కలిగించి రుచిని వక్రీకరిస్తాయి. మెదడులోని సున్నితమైన నరాలు మొద్దుబారాయి. పాశవిక శరీరాశ బలీయమౌతుంది. నైతిక, మానసిక శక్తులు బలహీన పడతాయి. అదుపుచేయాల్సిన ఈ ఉన్నత శక్తులు బలహీనమవ్వడంతో నిత్యజీవసంబంధిత విషయాలు గ్రాహ్యం కావు. పక్షవాతం ఆధ్యాత్మికతను భక్తిభావాన్ని మొద్దుబార్చుతుంది. గొప్ప పనిచెయ్యటానికి దేవుడు ఉద్దేశించిన ప్రతిభావంతులైన పురుషులల్ని, స్త్రీలని అదుపు చెయ్యటంలో వాంఛద్వారా సాతాను ఎంత సులభంగా లోపలికి రాగలిగి విజయం సాధిస్తున్నాడు!CDTel 41.3

    [ఆశానిగ్రహం లేనివారు ప్రాయశ్చిత విలువను గ్రహించటం అసాధ్యం-119]CDTel 41.4

    [ఆశానిగ్రహం లేనివారు సత్యం తాలూకు పరిశుద్దీకరణ ప్రభావానికి లొంగని తత్వం కలిగి ఉంటారు-780]CDTel 41.5