Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    విభాగం VII—అతి తిండి

    ఉత్తరం 17,1895 CDTel 128.1

    210. అన్నకోశానికి అధిక శ్రమ కలిగించటం సామాన్యంగా జరుగుతున్న పాపం. మితిమీరి తిన్నప్పుడు శరీర వ్యవస్థ అంతటి మీద భారం పడుతుంది. జీవం, జీవశక్తి వృద్ధిచెందే బదులు క్షీణిస్తాయి. ఇది సాతాను ఆశించినట్లే జరుగుతుంది. అదనపు ఆహారాన్ని జీర్ణించుకోటానికి మానవుడు తన ప్రధాన శక్తుల్ని అనవసరంగా వ్యయం చేస్తాడు.CDTel 128.2

    ప్రాకృతిక అవసరాల నిమిత్తం దేవుడను గ్రహించిన ఆశీర్వాదాన్ని పొదుపు చేసుకోకుండా వ్యర్ధపుచ్చటమే కాకుండా అతిగా తినటం ద్వారా శరీర వ్యవస్థకు హాని చేసుకుంటాం. దేవుని ఆలయమైన మన దేహాన్ని అపవిత్ర పర్చుతాం. దాన్ని బలహీనపర్చి, కుంటి దాన్ని చేసుకుంటాం. దేవుడు ఏర్పాటుచేసిన రీతిగా ప్రకృతి తన పనిని అది చక్కగా సక్రమంగా చెయ్యలేదు. ఆహారం విషయంలో స్వార్టేచ్చలు కోరికలవల్ల అది చెయ్యనవసరం లేని పనిని చెయ్యటానికి ఒత్తిడి చెయ్యటంద్వారా మానవుడు ప్రకృతి శక్తిని శ్రమ పెడున్నాడు.CDTel 128.3

    సజీవ మానవ యంత్రాంగాన్ని గూర్చిన అవగాహన అందరికీ ఉంటే, ఆత్మహత్యతో సమానమైన మార్గాన్ని అనుసరించి, అకాల మరణం మరణించటానికి లేదా తమకీ తమ మిత్రులికీ భారంగా ఏళ్ళు తరబడి నివసించటానికి సమ్మతంగా ఉండేంతగా శరీర వాంఛల్ని ప్రేమిస్తే తప్ప, వారు ఈ అపరాధానికి పాల్పడరు.CDTel 128.4