Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అంచెలంచెల సంస్కరణ యత్నం నిరర్ధకం

    MS 86, 1897 CDTel 169.1

    257. సారా, పొగాకు వినియోగం పై) తమను చైతన్య పర్చటానికి ప్రయత్నం జరిగినప్పుడు, అంచెలంచెలుగా విడిచి పెట్టేస్తాను అని కొందరంటారు. అలాంటి తీర్మానాన్ని చూసి సాతాను నవ్వుకుంటాడు. వారు నా వశంలో భద్రంగా ఉన్నారు. ఆ విషయమై ఎలాంటి భయం నాకక్కరలేదు అని సంబరపడ్డాడు. కాని పాపులు ఓ వ్యక్తిని శోధించినప్పుడు అతడు కరాఖండిగా నిర్ద్వంద్వంగా నిరాకరిస్తే ఆ వ్యక్తిపై తనకు ఎలాంటి శక్తి ఉండదని అతడికి బాగా తెలుసు. అట్టి వ్యక్తి అపవాది మైత్రిని విడిచి పెడ్తాడు. క్రీస్తుని హత్తుకున్నంతకాలం అతడికి ఢకాలేదు. తనతో దేవదూతలు అనుసంధామయ్యే స్థానంలో, జయించటానికి తనకు నైతిక శక్తినిచ్చే స్థానంలో అతడు నిలుస్తాడు.CDTel 169.2

    పేతురు విజ్ఞప్తిCDTel 169.3

    (1890) C.T.B.H.53,54 CDTel 169.4

    258. అపొస్తలుడైన పేతురు మనసుకి శరీరానికి మధ్యగల సంబంధాన్ని అవగాహన చేసుకుని తన గళమెత్తి సహోదరులకి ఈ హెచ్చరిక చేస్తున్నాడు: “ప్రియులారా మీరు పరదేశులును యాత్రికులునైయున్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను” విసర్జించండి. అనేకులు ఈ వాక్యాభాగాన్ని వ్యభిచారాన్ని గూర్చిన హెచ్చరికగా పరిగణిస్తారు గాని దీనికింకా విశాలభావం ఉంది. హానికరమైన తిండిని లేదా శరీరేచ్చల్ని ఇది నిషేధిస్తున్నది. వక్రమైన ప్రతి తిండి పోరాటం సల్పే శరీరాశ. ఆహారం సత్రయోజనం కోసం మనకు అనుగ్రహించబడింది గాని వక్రీకృత మవ్వటం ద్వారా మరణ సాధనమై, “ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ”గా దిగజారటానికి కాదు....CDTel 169.5

    అరణ్యంలో క్రీస్తు ఆచరించిన ఆ సుదీర్ఘ ఉపవాసం కలిగించిన తీవ్ర వ్యధ మాత్రమే వక్రతిండి తృప్తికి కలిగే శోధన శక్తిని కొలవ గలుగుతుంది. వక్రతిండి వాంఛ తృప్తి జ్ఞానేంద్రియాల్ని మొద్దుబార్చి పరిశుద్ధ సంగతుల అవగాహనను నాశనం చేస్తుందని ఆయనకు తెలుసు. తిండివాంఛ తృప్తి మూలంగా ఆదాము పతనమయ్యాడు. తిండి వాంఛను ఉపేక్షించి క్రీస్తు విజయుడయ్యాడు. కనుక ఆత్మనిగ్రహం ద్వారా మాత్రమే ఏదెనుని మనం తిరిగి సంపాదించగలుగుతాం. మానవ జాతి పై తిండి వాంఛపట్టు అంత పటిష్టంగా ఉండటంతో దాని శక్తిని భగ్నం చెయ్యటానికి మానవుడి పక్షంగా దేవుని కుమారుడు దాదాపు ఆరువారాలు ఉపవాసముండటం అవసరమైతే, క్రీస్తు జయించినట్లు జయించటానికి క్రైస్తవుడి ముందున్న కార్యం ఎంతసమున్నతమైంది! ఆయినా పోరాటం ఎంత తీవ్రమైందైనా క్రైస్తవుడు జయించవచ్చు. సాతాను రూపొందించ గలిగిన మిక్కిలి భయంకర శోధనల్ని తట్టుకోగలిగిన ఆ ప్రభువు చేయూతద్వారా అతడు కూడా దుష్టతతో తన పోరాటంలో పూర్తిగా విజయుడై దేవుని రాజ్యంలో విజయకిరీటం ధరించవచ్చు.CDTel 170.1