Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    భాగం II - భోజనానికి భోజనానికి మధ్య చిరుతిండ్లు

    క్రమబద్దత ప్రాముఖ్యం

    MS 1, 1876 CDTel 182.3

    281. యథావిధి భోజనం అయిన తర్వాత విశ్రాంతికి కడుపుకి ఐదు గంటల వ్యవధి ఇవ్వాలి. తర్వాతి భోజనం వరకూ కడుపులోకి ఒక్క మెతుకు కూడా ప్రవేశ పెట్టకూడదు. ఈ విరామ సమయంలో కడుపు దాని పని అది నిర్వహిస్తుంది. అనంతరం అది ఎక్కువ ఆహారం స్వీకరించే పరిస్థితిలో ఉంటుంది.CDTel 182.4

    క్రమం లేకుండా భోంచెయ్యటం ఏ పరిస్థితిలోనూ మంచిదికాదు. సామాన్యంగా భోంచేసే సమయానికి ఒకటి రెండుగంటల ముందు రాత్రి భోజనం తీసుకుంటే ఆ నూతన భారానికి కడుపు సిద్ధంగా ఉండదు. ఎందుచేతనంటే ముందు తీసుకున్న ఆహారాన్ని అది పరిష్కరించలేదు. ఈ నూతన విధి నిర్వహణకు దానికి జీవశక్తి ఉండదు. ఈ రకంగా శరీర వ్యవస్థ అధిక శ్రమకు గురి అవుతుంది.CDTel 182.5

    పరిస్థితులు అనుకూలంగా లేనందుకో లేక ఏదోపని పూర్తిచేయాల్సి ఉన్నందుకో ఆహారాన్ని ఒకటి లేక రెండు గంటలు ఆలస్యంగా తీసుకోకూడదు. ఆహారం స్వీకరించటానికి అది అలవాటు పడ్డ సమయంలో కడుపు ఆహారాన్ని కోరుతుంది. ఆ సమయం గతిస్తే శరీర వ్యవస్థ శక్తి సన్నగిల్లి తుదకు ఆకలి పూర్తిగా మాయమయ్యేంతగా తగ్గిపోతుంది. ఆ స్థితిలో ఆహారం తీసుకుంటే దాన్ని కడుపు సరిగా పరిష్కరించలేదు. ఆహారం మంచి రక్తంగా పరివర్తన చెందదు.CDTel 182.6

    అందరూ నిర్దిష్ట కాలావధుల్లో భోజనం చేసి, మధ్యమధ్య చిరుతిండ్లు తినకుండా ఉంటే వారు భోజనానికి సిద్ధంగా ఉంటారు. ఆహారం వారికి తృప్తినిస్తుంది. తమ శ్రమకు ఫలితాన్నిస్తుంది.CDTel 182.7

    (1905) M.H.303,304 CDTel 183.1

    282. వేళకు తినటం చాలా ప్రాముఖ్యం . ప్రతీ భోజనానికి ఓ నిర్దిష్ట సమయం ఉండాలి. ఈ సమయంలో ప్రతీవారు తమ దేహవ్యవస్థకు అవసరమైన ఆహారం తిని, తర్వాతి భోజనం వరకు ఏమీ తినకూడదు. అనేకులు ఎలాంటి వ్యవధి పాటించకుండా, తమ దేహానికి ఆహారం అవసరం లేకపోయినా చిరుతిండ్లు తింటారు. వాంఛను ప్రతిఘటించటానికి వారికి చాలినంత మనశ్శక్తి ఉండదు. ప్రయాణం చేసేటప్పుడు కొందరు తినుబండారాలేమైనా తమ అందుబాటులో ఉంటే పడ్డాకా ఏదో తింటూనే ఉంటారు. ఇది చాలా హానికరం. ప్రయాణికులు సామాన్యమైన, బలవర్ధకమైన ఆహారం యథా సమయాల్లో తింటే, వారు అంత బడలికకు గురి కారు. అంతగా జబ్బు పడరు.CDTel 183.2

    (1905) M.H.384 CDTel 183.3

    283. ఆహారం తీసుకునే సమయాల్ని జాగ్రత్తగా అనుసరించాలి. భోజనానికి మధ్య తీపి పదార్థాలు, పండ్లు లేదా ఏరకమైన ఆహారాన్ని ముట్టకూడదు. భోజన సమయం విషయంలో క్రమరాహిత్యం జీర్ణమండల అవయవాల ఆరోగ్యవంతమైన ధోరణిని నాశనం చేస్తుంది. అది ఆరోగ్యాన్ని ఆనందాన్ని దెబ్బ తీస్తుంది. పిల్లలు భోజనబల్ల వద్దకు వచ్చేసరికి వారికి ఆరోగ్యదాయకమైన ఆహారం రుచించదు. హానికరమైన ఆహారం పట్ల వారికి అమితమైన ఆకలి కలుగుతుంది.CDTel 183.4

    (1870) 2T 485 CDTel 183.5

    284. ఆ కుటుంబానికి ఆహారం విషయంలో సరిఅయిన కర్తనం లేదు. క్రమబద్దత లేదు. ప్రతీ భోజనానికి ఓ నిర్దిష్ట సమయం ఉండవలసింది. అయినా బలవర్ధకంగాను ఆరోగ్యదాయకంగాను ఆకర్షణీయంగాను ఉండేటట్లు దాన్ని తయారు చెయ్యటానికి శ్రద్ధ తీసుకోవలసింది. ఇతర కుటుంబాల్లోలాగే ఈ కుటుంబం లోను అతిథుల కోసం ప్రత్యేక ప్రదర్శన చెయ్యటం జరిగింది. భోజన బల్లచుట్టూ కూర్చున్న అతిథులు అతిగా తినటానికి శోధించబడేటట్లు, వేపుళ్లు, పోపు పెట్టే వంటకాలతో కూడిన ఆహారం తయారు చెయ్యటం జరిగింది. అతిథులు లేనప్పుడు పెద్ద మార్పు ఉండేది. భోజనబల్లమీద పెట్టే వంటకాలు స్వల్పంగా అల్పంగా ఉండేవి. ఆహారం కొంచెంగా, పౌష్టికత కొరవడి ఉండేది. “అది మనకే” గనుక ఏమంత ప్రధాన విషయం కాదు అన్న తలంపు ఉండేది. ఆహారాన్ని తరచుగాను క్రమం లేకుండాను తీసుకోటం జరిగేది. అలాంటి క్రమరహిత వ్యవహరణ వల్ల కుటుంబంలోని ప్రతీ సభ్యుడికీ హాని కలిగింది. మన సహోదరీలు అతిథుల కోసం భారీ ఎత్తున వంటకాలు చెయ్యటం, తమ కుటుంబాలికి పౌష్టికత కొరవడ్డ అంతంత మాత్రపు ఆహారం తయారు చెయ్యటం పాపం.CDTel 183.6

    (1869) 2T 373 CDTel 184.1

    285. ఈ స్థలంలో దేవుడు అంత గొప్ప వెలుగు ఇచ్చినా, మీలో అనేకులు మధ్యమధ్య చిరుతిండ్లు తినటం నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తున్నది. మీ యథావిధి భోజనాల మధ్య ఒక్క ముద్ద కూడా మీ నోటి ద్వారా లోపలికి వెళ్లకూడదు. మీరు ఏమి తినాలో దాన్ని తినండి, కాని దాన్ని ఒకే భోజనంలో తినండి. తిని మరుసటి భోజనం వరకూ ఆగండి.CDTel 184.2

    [C.T.B.H.51,50] (1890) C.H.118 CDTel 184.3

    286. అనేకులు వెలుగునుంచి జ్ఞానం నుంచి పక్కకు తప్పుకుని, రుచికి అభిరుచికి నియమాన్ని బలి చేస్తున్నారు. శరీరానికి ఆహారం అవసరం లేనప్పుడు, తమ వాంఛను ప్రతిఘటించటానికి నైతిక శక్తి కొరవడినందున క్రమ విరామం లేకుండా వారు తింటారు. పర్యవసానంగా, దుర్వి నియోగమయ్యిన కడుపు తిరుగుబాటు చేస్తుంది. అనంతరం బాధ మొదలవుతుంది. శరీరారోగ్యానికి మనశ్శాంతికి వేళకు భోజనం చెయ్యటం చాలా ప్రాముఖ్యం. భోజనానికి భోజనానికి మధ్య ఏమీ తినకూడదు.CDTel 184.4

    (1869) 2T 374 CDTel 184.5

    287. అజీర్తి రోగి - తనకు ఆ వ్యాధి కలిగించిన ఈ మార్గాన్నే అనుసరిస్తాడు. వేళకు భోజనం చేసే బదులు తిండి నియంత్రణ కింద ఉండి, చిరుతిళ్లు యథేచ్చగా తింటాడు.CDTel 184.6

    హెల్త్ రిఫార్మర్, మే, 1877 CDTel 184.7

    288. ఎప్పుడు, ఎలా, ఏమితినాలి? అన్న విషయాల ప్రాధాన్యాన్ని సాధారణంగా పిల్లలకి నేర్పించం. తమ రుచులననుసరించి వారిని ఇష్టారాజ్యంగా తిననిస్తాం. తమ కళ్లకు ఇంపుగా ఉన్నప్పుడు, పండ్లు, పైలు, కేకులు, బ్రెడ్, బటర్, తీపి పదార్థాలు దథేచ్చగా వేళాపాళ లేకుండా తిననిచ్చి వారిని తిండిబోతులుగా అజీర్తి రోగులుగా చేస్తాం. జీర్ణక్రియ అవయవాలు, నిర్విరామంగా తిరిగే మిల్లులా, బలహీనమౌతాయి. కడుపు చేయాల్సిన పని ఎక్కువవ్వటంతో దానికి సహాయం చెయ్యటానికి మెదడు నుంచి జీవశక్తి అవసరమౌతుంది. ఈ రకంగా మానసిక శక్తులు బలహీనమౌతాయి. జీవశక్తుల అస్వాభావిక ప్రేరణ, అరుగుదల వారిని ధైర్యం లేనివారిగా, నియంత్రణను సహించలేనివారిగా, మొండివారిగా, కోపిష్టులుగా చేస్తాయి.CDTel 184.8

    [ పిల్లలు వేళకు తినటం ప్రాముఖ్యం -343,344,345,346,348]CDTel 185.1

    (1875) 3T 564 CDTel 185.2

    289. తమ బిడ్డలకు ఆత్మో పేక్ష అలవాట్లు సహనంతో నేర్పి, దేవుని ఆశీర్వాదాలన్నింటిని సరిగా వినియోగించుకోటం ఎలాగో వారికి బోధించే పనిని తప్పించుకుని వారిని యథేచ్ఛగా ఎప్పుడు పడితే అప్పుడు తిని తాగనిచ్చే తల్లిదండ్రులు అనేకమంది ఉన్నారు. ఆహారవాంఛల్ని స్వారేచ్చల్ని నిశ్చితంగా నియంత్రించకపోతే, అవి పెరుగుదలతో పెరుగుతాయి, బలంతో బలపడ్డాయి. CDTel 185.3