Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    సారాంశం

    (1909) 9T 156, 160 CDTel 419.3

    719. మాంసాహారం వల్ల మేలు జరిగితే నేను మీకు ఈ విజ్ఞప్తిని చేసేదాన్ని కాను. కాని మనకు మేలు జరగదని నాకు తెలుసు. మాంస పదార్థాలు శారీరక సంక్షేమానికి హాని కలిగిస్తాయి. వాటిని విడిచి పెట్టటం మనం నేర్చుకోవాలి. శాఖాహారం సంపాదించగల స్థానంలో ఉండేవారు, కాని ఈ విషయంలో తమ సొంత ఇష్టతను అనుసరించటానికి, తమ ఇష్టానుసారంగా తిని తాగటానికి ఎంపిక చేసుకునేవారు, ప్రస్తుత కాల సత్యం ఇతర దశల గురించి ప్రభువిచ్చిన ఉపదేశాన్ని క్రమక్రమంగా నిర్లక్ష్యం చేసి, సత్యమంటే ఏమిటో గ్రహించలేని స్థితికి చేరుకుంటారు. తాము విత్తే పంటనే వారు తప్పక కోస్తారు.CDTel 419.4

    మన పాఠశాలల్లోని విద్యార్ధులికి మాంసంగాని లేదా అనారోగ్య దాయకమైన ఆహారం గాని ఇవ్వకూడదని నాకు ఉపదేశం వచ్చింది. ప్రేరేపకాలకి కోరిక పుట్టించే దేన్నీ భోజనబల్లల మీద పెట్టకూడదు. మీరు హాని కలిగించే వాటిపట్ల వాంఛను నిరాకరించాల్సిందిగా వృద్ధులు, యువజనులు, మధ్య వయసులో ఉన్నవారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. త్యాగం ద్వారా ప్రభువుని సేవించండి.CDTel 419.5

    ఈ సేవలో పిల్లల్ని ఓ పాత్ర పోషించనివ్వండి. మనమందరం ప్రభువు కుటుంబసభ్యులం. తన పిల్లలు చిన్నవారు పెద్దవారు-అనుచిత ఆహార వాంఛను నిరాకరించి ఆ ద్రవ్యాన్ని సమావేశ మందిరాలు నిర్మాణానికి, మిషనెరీల పోషణకు ఆదా చెయ్యాలని ప్రభువు కోరుతున్నాడు.CDTel 419.6

    ఈ అంశంపై మీరు పూర్ణ ఆత్మతో ప్రభువు పక్క నిలవాలని తల్లిదండ్రులకు చెప్పవలసిందిగా ప్రభువు నన్ను ఆదేశిస్తున్నాడు. ఈ కృపకాల దినాల్లో మనం విశ్వనాధుడైన ప్రభువు ముందు తీర్పుకు నిలబడి ఉన్నామని నిత్యం గుర్తుంచుకోవాలి. మీకు హానిచేసే వ్యసనాల్ని విడిచి పెట్టరా? విశ్వసిస్తున్నట్లు ఎన్నిమాటలైనా చెప్పవచ్చు. తన ప్రతిష్టిత జనం ఆచరించాల్సిందిగా దేవుడు కోరే విధులకి మీరు విధేయులై నివసిస్తున్నట్లు మీ ఆత్మత్యాగ పూరిత క్రియలు సాక్ష్యమివ్వాలి. అప్పుడు ఆత్మత్యాగ పూరిత క్రియల ద్వారా ఆదాచేసే ద్రవ్యంలో ఓ భాగం దేవుని ధన నిధికి చెల్లించండి. దేవుని సేవ ముందుకి సాగటానికి అవసరమైనంత ద్రవ్యం సమకూరుతుంది.CDTel 420.1

    మాంసం తినకుండా బతకలేమనేవారు చాలామంది ఉన్నారు. అయితే వీరు ప్రభువు పక్కకు వచ్చి, ఆయన దర్శకత్వాన్ననుసరించి నడుచుకుంటే దానియేలు అతడి సహచరుల్లా వారూ శక్తిని వివేకాన్ని పొందుతారు. ప్రభువు తమకు వివేకాన్నిస్తాడని తెలుసుకుంటారు. త్యాగపూరిత క్రియల ద్వారా దేవుని సేవకు ఎంత ఆదా చెయ్యగలరో అనేకమంది తెలుసుకుంటారు. త్యాగపూరిత కార్యాల ద్వారా ఆదాచేసే చిన్నచిన్న మొత్తాలు దైవ సేవాభివృద్ధికి తోడ్పడేంతగా త్యాగం అగత్యం కాని పెద్ద పెద్ద విరాళాలు తోడ్పడవు.CDTel 420.2

    సెవెంతుడె ఎవ్వంటిస్తులు ప్రాముఖ్యంగల సత్యాల్ని ప్రకటిస్తున్నారు. నలభై సంవత్సరాల పైచిలుకు కాలం కిందట*1909 లో రచించింది ఆరోగ్యసంస్కరణపై ప్రభువు మనకు ప్రత్యేకమైన వెలుగునిచ్చాడు. అయితే మనం ఆ వెలుగులో ఎలా నడుస్తున్నాం? దేవుని సలహాలననుసరించి నివసించటానికి నిరాకరిస్తున్న వారు ఎంతమంది! ఆయన ప్రజలుగా మనం పొందిన వెలుగుకి దీటుగా మనం అభివృద్ధి సాధించాలి. ఆరోగ్యసంస్కరణ నియమాల్ని గ్రహించి గౌరవించటం మన విధి. మితానుభవం విషయంలో మనం అందరికన్నా ముందంజలో ఉండాలి. అయినా మనమధ్య జ్ఞానం గల సంఘ సభ్యులున్నారు. సువార్త పరిచారకులు సయితం ఉన్నారు. ఈ అంశంపై దేవుడిచ్చిన వెలుగుని వారు గౌరవించటం లేదు. వారు తమ ఇష్టానుసారంగా తింటారు, తమ ఇష్టాన్ననుసరించి పనిచేస్తారు....CDTel 420.3

    ఫలానా ఆహారం తినాలని మేము నిర్దేశించం. కాని పండ్లు, గింజలు, పప్పులు సమృద్ధిగా లభించే దేశాల్లో మాంసం దైవ ప్రజలకి సరియైన ఆహారం కాదని మాత్రం చెప్పగలం. మాంసాహారం స్వభావాన్ని పాశవికం చేస్తుందని, పురుషులకి స్త్రీలకి ప్రతీ ఒక్కరిపట్ల ఉండాల్సిన ప్రేమను సానుభూతిని దోచుకుంటుందని, మనిషిలోని ఉన్నత శక్తుల్ని క్షుద్ర ఉద్వేగాలకి లోను చేస్తుందని దేవుడు నాకు ఉపదేశమిచ్చాడు. మాంసాహారం ఒకప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నదేమోగాని ఇప్పుడు మాత్రం కాదు. క్యాన్సర్లు, కంతులు, ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువ భాగం మాంస భక్షణం వల్ల సంభవిస్తున్నాయి.CDTel 421.1

    సంఘ సభ్యత్వానికి మాంసాహార విసర్జనను ఓ షరతు చెయ్యకూడదు. కాని మాంసాహారులైన క్రైస్తవులు ఇతరులపై చూపే ప్రభావాన్ని మనం పరిగణించాలి. దేవుని ప్రతినిధులుగా “కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” అని మనం ప్రజలకి చెప్పవద్దా? 1 కొరింధి 10:31. వక్రతిండిని ఖండిస్తూ మనం నిర్ణమాత్మక సాక్ష్యం ఇవ్వవద్దా? దేవుడు మానవులకిచ్చిన అతి గంభీర సత్యాన్ని ప్రకటించే సువార్త పరిచారకుల్లో ఎవరైనా ఐగుప్తు మాంసపు కుండలకి తిరిగి వెళ్లటంలో దృష్టాంతమౌతారా? దేవుని ధనాగారం నుంచి వచ్చే దశమ భాగంతో పోషించబడే వాక్యపరిచారకులు తమ రక్తనాళాల్లో ప్రవహిస్తున్న ప్రాణాధారమైన రక్తాన్ని శరీరాశల తృప్తి ద్వారా విషకలితం చేస్తారా? దేవుడు తమ కనుగ్రహించిన వెలుగుని హెచ్చరికల్ని అలక్ష్యం చేస్తారా? కృపలో పెరుగుదలకు, సరళ స్వభావానికి శరీరారోగ్యం ప్రధానంగా పరిగణించాలి. కడుపుని సరిగా కాపాడుకోకపోతే తిన్నని నైతిక ప్రవర్తన సాధనకు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. మెదడు, నరాలు కడుపు పట్ల సానుభూతి చూపుతాయి. తప్పుడు భోజన పానాలు తప్పుడు ఆలోచనలకు క్రియలకు దారితీస్తాయి.CDTel 421.2

    ఇప్పుడు అందరూ పరీక్షించబడుతున్నారు. మనం క్రీస్తులోకి బాప్తిస్మం పొందాం. మనల్ని దిగజార్చి చెయ్యకూడని పనుల్ని మనతో చెయ్యించే ప్రతీదానికి దూరంగా ఉండటంలో మన పాత్ర మనం నిర్వహిస్తే, మన సజీవ శిరస్సు అయిన క్రీస్తులోకి పెరగటానికి మనకు శక్తి ఇవ్వబడుతుంది. మనం దేవుని రక్షణను చూస్తాం.CDTel 421.3