Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    నేర్చుకునే వారిని ప్రోత్సహించండి

    జల్లించని గోధుమ పిండితో మంచి బ్రెడ్డు తయారుచెయ్యటం నేర్చుకోటం ప్రతీ క్రైస్తవ బాలిక మత పరమైన విధి. తమ కుమార్తెలు చిన్న బాలికలుగా ఉన్నప్పుడే తల్లులు వారిని తమతో వంటగదిలోకి తీసుకువెళ్లి వారికి వంట కళను నేర్పించాలి. శిక్షణ లేకుండా గృహనిర్వహణ మర్మాల్ని తన కుమార్తెలు అవగాహన చేసుకుంటారని తల్లి కని పెట్టకూడదు. ఆమె ఓర్పుతో, ప్రేమతో వారికి ఉపదేశమిచ్చి, తన ముఖంలో సంతోషం ద్వారా, మెచ్చుకోలు మాటల ద్వారా ఆ పనిని వారికి ఆనందదాయకం చెయ్యాలి. వారు ఒకటి, రెండు లేక మూడు సార్లు తప్పుచేసినా నిందించకండి. అప్పటికే నిరాశ దాని పని అది చేస్తూ “లాభంలేదు; నేను చెయ్యలేను” అనటానికి వారిని శోధిస్తుంది. ఇది మందలించటానికి సమయం కాదు. మనశ్శక్తి బలహీనమౌతుంది. ” మీరు చేసిన తప్పును గురించి బాధపడకండి. మీరు నేర్చుకునేవారే. మీరు పెద్ద తప్పులు చేయటం సహజం. మళ్లీ ప్రయత్నించండి. మీరు చేసే పని మీద మనసు పెట్టండి. జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పక జయం పొందుతారు” వంటి ప్రోత్సాహం, ఉత్సాహం, నిరీక్షణ పుట్టించే మాటల ముల్లు గర్ర దానికి అవసరం.CDTel 271.1

    అనేకమంది తల్లులు ఈ శాఖకు సంబంధించిన జ్ఞానం ప్రాముఖ్యాన్ని గుర్తించరు. తమ బిడ్డలకి ఉపదేశమివ్వటానికి శ్రద్ధ తీసుకుని, వారు నేర్చుకునే కాలంలో వారు చేసే తప్పులు పొరపాట్లని సహనంతో సవరించటానికి బదులు పనంతా తామే చేయటానికి ఎంపిక చేసుకుంటారు. తమ కుమార్తెలు వారి పనిలో వైఫల్యం చెందినప్పుడు, “లాభం లేదు. మీరిది చెయ్యలేరు లేక అది చెయ్యలేరు. నాకు సహాయపడటానికన్నా ఎక్కువగా శ్రమకలిగిస్తున్నారు” అంటూ వారిని పంపించేస్తారు.CDTel 271.2

    నేర్చుకునే వారి మొదటి ప్రయత్నం ఇలా బెడిసి కొడుతుంది. నేర్చుకోవాలన్నవారి ఆసక్తిని, ఉల్లాసాన్ని మొదటి వైఫల్యం ఎంతగా దెబ్బతీస్తుందంటే వారు మరోసారి ప్రయత్నించటానికి భయపడి, అల్లికపనినో ఇల్లు శుభ్రం చేసే పనినో ఎంపిక చేసుకుంటారు గాని వంటకు మాత్రం ససేమిరా అంటారు. తల్లి ఇక్కడ పెద్ద పొరపాటు చేస్తుంది. అనుభవం లేని పనివారుగా సాధకం వల్ల తమ తప్పిదాన్ని తొలగించుకుని, నిపుణతలేని తమ కదలికల్ని వారు సవరించుకునేందుకు, తల్లి ఓర్పు, నేర్పు కలిగి వారికి ఉపదేశమిచ్చి ఉండాల్సింది. CDTel 271.3