Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    తీవ్రవాదుల హానికరమైన ప్రభావం

    (1870) 2T 374,375 CDTel 214.1

    328. ఉత్తమ నాణ్యత గల ఆహారమైనా అతిగా తినవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తుండగా, తప్పుడు ప్రమాణం ఏర్పాటు చేసి అందరినీ దాన్ని అనుసరింపజేయటానికి ప్రయత్నించవద్దని కూడా సంస్కరణ అతివాదుల్ని హెచ్చరిస్తున్నాం.CDTel 214.2

    (1870) 2T 384,387CDTel 214.3

    329. బి, సి లు ఇద్దరూ దేవుని సేవను అగౌరవ పర్చటం నాకు దర్శనంలో చూపించబడింది. వారు దేవుని సేవకు తెచ్చిన మచ్చ పూర్తిగా తొలగించటం సాధ్యం కాదు. మన ప్రియ సోదరుడి కుటుంబాన్ని నాకు చూపించటం జరిగింది. ఈ సోదరుడికి సరియైన సమయంలో సహాయం అంది ఉంటే ఆ కుటుంబం లోని ప్రతీ వ్యక్తి బతికి ఉండేవాడు. ఈ అసభ్య ప్రవర్తన సందర్భంగా దేశ చట్టాలు అమలు కాకపోటం ఆశ్చర్యంగా ఉంది. ఆ కుటుంబస్తులు ఆహారం లేక మరణిస్తున్నారు — సామాన్యమైన ఆహారం సమృద్ధిగల దేశంలో ఆహారం లేక వారు మరణిస్తున్నారు. ఓ అనుభవ శూన్యుడు వారి జీవితాల్తో ఆటలాడాడు. ఆ యువకుడు జబ్బుతో మరణించలేదు - ఆకలితో. ఆహారం అతడి శరీర వ్యవస్థని బలపర్చి యంత్రాంగాన్ని చలనంలో ఉంచేది.CDTel 214.4

    అనుభవరహితులైన కొత్త వారు ఆరోగ్య సంస్కరణను ప్రబోధించకుండా చర్యతీసుకోటానికి సమయం వచ్చింది. వారి పనులు వారి మాటలు గొప్ప కీడు చెయ్యవచ్చు. వారు కలిగించే హానిని జ్ఞాన వివేకాలు గొప్ప ప్రభావం కలవారు సహితం ప్రతిఘటించలేరు. అతివాదులు అవలంబించే తప్పుడు మార్గం వల్ల ప్రజల మనసుల్లో ఏర్పడే దురభిమానాన్ని తొలగించి, ఈ మనుషులు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ సమాజంలో ఆరోగ్య సంస్కరణను సరియైన మార్గంలో పెట్టటానికి ఆరోగ్య సంస్కరణను చేపట్టటానికి ఉత్తమ యోగ్యతలు గల వారికి కూడా అసాధ్యమౌతుంది. ఈ కాలానికి దేవుడు ఉద్దేశించిన సబ్బాతు సత్యం తోను క్రీస్తు రెండో రాక సత్యం తోను అవిశ్వాసుల్ని చేరటానికి తలుపు కూడా మూయబడుతున్నది. ప్రజలు అతి ప్రశస్తమయిన సత్యాల్ని వినదగినవి కానివిగా పరిగణించి తోసిపుచ్చుతున్నారు. ఈ వ్యక్తుల్ని ప్రజలు ఆరోగ్య సంస్కర్తలుగా సబ్బాతును ఆచరించేవారుగా సామాన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలా అవిశ్వాసులకు ఆటంక బండగా ఉన్నవారి పై గొప్ప బాధ్యత ఉన్నది.CDTel 214.5

    వ్యక్తిగత అభిప్రాయాలు, పరీక్షలతో విజ్ఞప్తిCDTel 215.1

    ఉత్తరం 39, 1901 CDTel 215.2

    330. ఆరోగ్య సంస్కరణను దాని ప్రాముఖ్యాన్ని అనేక మంది ఘనులు సామాన్యులు అంగీకరించే సమయం వచ్చింది. మనం ప్రకటించవలసిన వర్తమానానికి అనగా మూడోదూత వర్తమానానికి దానికి సంబంధించిన మొదటి దూత రెండో దూత వర్తమానాలికి ఏదీ అడ్డురావటానికి మనం అనుమతించకూడదు. చిన్నచిన్న విషయాలు మనల్ని చిన్న వృత్తంలో బంధించి, మనల్ని ప్రజలతో సంబంధం లేకుండా ఉంచటానికి మనం అనుమతించకూడదు.CDTel 215.3

    దేవుడు మనకిచ్చిన వరాలన్నీ సంఘానికీ లోకానికి అవసరం. మనకున్న సమస్తం ఆయన సేవకు ఉపయోగించాలి. సువార్తను ప్రకటించటంలో మీ సొంత అభిప్రాయాల్ని పక్కన పెట్టండి. మనకు ప్రపంచ విస్తృతి చెందాల్సిన వర్తమానం ఉంది. తమకు తాను అప్పగించిన పరిశుద్ధ ట్రస్టును జాగ్రత్తగా కాపాడాలని దేవుడు తన ప్రజల్ని కోరుతున్నాడు. ప్రతీ వ్యక్తికీ దేవుడు తన పనిని నియమించాడు. కనుక ఎవరూ తప్పు వర్తమానం ప్రకటించకూడదు. ఆరోగ్య సంస్కరణ పై వచ్చిన గంభీరమైన వెలుగును అసంగత, అసంబద్ధ సమస్యల్లోకి మళ్లించటం జరగకూడదు. ఓ వ్యక్తి అసంగత మార్గాల నీడ విశ్వాసుల సమాజమంతటి మీద పడుతుంది కనుక ఓ వ్యక్తి తీవ్రధోరణి వల్ల దేవుని సేవకు విఘాతం కలుగుతుంది.CDTel 215.4

    హద్దులు దాటి చేసే పనుల విషయమై ఎక్కువ భయపడాలి. లోకం విషయాల్ని అపార్థం చేసుకుని, సెవెంతుడె ఎడ్వంటిస్టులు అతివాదుల సమాజమని భావించటం నివారించేందుకు అది నన్ను మాట్లాడమని ఒత్తిడి చేస్తుంది. ఓ పక్క ప్రజల్ని మంటలోనుంచి బయటికి లాగటానికి ప్రయత్నిస్తుంటే, మరోపక్క చెడుగును నివారించటానికి అప్పుడు మాట్లాడాల్సిన మాటల్ని, ఆ క్రియ చెయ్యటాన్ని సమర్ధించుకోటానికి ఉపయోగించుకోటం జరుగుతుంది. మానవ పరీక్షల తీవ్ర ధోరణుల నుంచి దేవుడు మనల్ని కాపాడు గాక!CDTel 216.1

    మనం ఏమి తినాలి, ఏమితాగాలి అన్న విషయమై ఎవరూ తీవ్రభావ జాలాన్ని ప్రచారం చెయ్యకుందురు గాక. దేవుడు మనకు వెలుగునిచ్చాడు. మన ప్రజలు ఆ వెలుగును అంగీకరించి దానిలో నడవాలి. దేవుని గూర్చి యేసు క్రీస్తుని గూర్చి జ్ఞానం ఎక్కువ వృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జ్ఞానమే నిత్యజీవం. భక్తి, మంచి, వినయమనసు, ఆధ్యాత్మి మతం పెరుగుదల ఇవి ఆ మహోపాధ్యాయుని గురించి తెలుసుకోగల స్థానంలో మన ప్రజల్ని ఉంచుతాయి.CDTel 216.2

    పాలు ఉపయోగించటం క్షేమం కాని సమయం వస్తుంది. అయితే ఆవులు ఆరోగ్యమైనవైతే, వాటి పాలను బాగా కాచి వాడుకుంటే అది రాకముందే శ్రమకాలాన్ని సృష్టించుకోవలసిన అవసరం ఉండదు. మన ప్రజలు తమ భోజనబల్లమీద ఏమి ఉంచుకోవాలో అన్నదాని గురించి ఓ వర్తమానం అందించాలని ఎవరూ భావించకుందురుగాక! ఈ విషయంలో తీవ్రవైఖరి అవలంబించేవారు చివరికి ఫలితాలు తాము ఊహించనట్లు లేవని గ్రహిస్తారు. మనం సంసిద్ధంగా ఉన్నట్లయితే ప్రభువు తన సొంత హస్తంతో మనల్ని నడిపిస్తాడు. ప్రేమ, పవిత్రత - ఇవి మంచి చెట్టు ఫలించే ఫలాలు. ప్రేమించే ప్రతీ వ్యక్తి దేవుని వలన జన్మించినవాడు, దేవున్ని ఎరిగిన వాడు.CDTel 216.3

    ఆరోగ్య సంస్కరణ అంశం పై కఠిన వైఖరి అవలంబిస్తూ తమ అభిప్రాయాల్ని అంగీకరించాల్సిందిగా ఇతరుల్ని కోరుతున్న కాన్ఫరెన్స్క చెందిన వారితో తాము బోధిస్తున్న వర్తమానం దేవుడిచ్చింది కాదని వారికి చెప్పాల్సిందిగా నన్ను దేవుడు ఆదేశించాడు. ఎక్కువ భాగం పెంకితనంతో కూడి పారంపర్యంగా వచ్చిన, వ్యావహారికంగా నేర్చుకున్న ప్రవృత్తుల్ని మెత్తబర్చుకుని లో పర్చుకుంటే తమకు మారుమనసు అవసరమని తాము గుర్తిస్తారని నేను వారికి చెప్పాను. “మన మొకని నొకడు (ప్రేమించినయెడల దేవుడు మనయందు నిలిచి యుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.”... “దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు. దేవుడు వానియందు నిలిచియున్నాడు.”...CDTel 216.4

    మానవ వివేకం దేవుని వివేకంతోను కృపతోను సంయుక్తమవ్వాలి. మనం క్రీస్తులో దాగి ఉండాలి. దేవుడు మన ముందుంచిన ఉన్నత ప్రమాణాన్ని అనగా సువార్త ద్వారా నైతిక ప్రవర్తనను సాధించటానికి మనం శ్రద్ధగా కృషిచెయ్యాలి. మనం సరియైన మార్గంలో పురోగమించాలని, కుంటివారు మార్గంలో నుంచి తప్పుకుని పడిపోకుండేటట్లు మనం మన పాదాలకి తిన్నని మార్గం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు క్రీస్తు తృప్తి చెందుతాడు.CDTel 217.1