Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    ఆహార సంస్కరణ ప్రగతి శీలం అవ్వాలి

    (1902) 7T 132-136 CDTel 481.4

    793. ఆరోగ్యసంస్కరణ కృషి ప్రారంభం నుంచి ఉపదేశించటం, మరింత ఉపదేశించటం అవసరమని గుర్తిస్తున్నాం. ప్రజలకు ఉపదేశం అందించే కృషిని మనం కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు...CDTel 481.5

    తక్కిన సువార్త సేవ అంతటిలో లాగే ఆరోగ్య సంస్కరణను బోధించటం లోను మనం ప్రజలున్నచోటనే వారిని కలవాలి. రుచికరమైన, బలవర్ధకమైన అయినా చౌకైన ఆరోగ్యసంస్కరణ ఆహారపదార్ధాల్ని తయారు చెయ్యటం వారికి నేర్పేవరకు ఆరోగ్య సంస్కరణ ఆహారంలో మిక్కిలి ఉన్నతమైన ప్రతిపాదనల్ని మనం సమర్పించకూడదు.CDTel 482.1

    ఆహార సంస్కరణ ప్రగతి శీలం అవ్వాలి. పాలుగాని వెన్నగాని ఉపయోగించకుండా ఆహారం తయారుచెయ్యటం ప్రజలకు నేర్పించండి. గుడ్లు, పాలు, మీగడ లేక వెన్న ఉపయోగించటం క్షేమం కాని సమయం త్వరలో వస్తుందని వారికి చెప్పండి. ఎందుకంటే మనుషుల్లోని ముష్కరతకు దీటుగా జంతువుల్లో వ్యాధి ప్రబలుతున్నది. పతనమైన మానవజాతి దుర్మార్గత వలన జంతు సృష్టి అంతా మన లోకానికి శాపంగా మారిన వ్యాధులతో మూలిగే సమయం సమీపంలోనే ఉన్నది.CDTel 482.2

    ఇవి లేకుండా ఆరోగ్యకరమైన ఆహారం తయారుచేసుకోటానికి దేవుడు తన ప్రజలకు సామర్ధ్యాన్ని నేర్పును ఇస్తాడు. మన ప్రజలు అనారోగ్యకరమైన రెసిపీలన్నింటినీ పారెయ్యాలి. ఆరోగ్యంగా నివసించటం నేర్చుకుని తాము నిల్చుకున్నది మన ప్రజలు ఇతరులికి నేర్పించాలి. బైబిలు ఉపదేశాన్ని అందించేటట్లు ఈ జ్ఞానాన్ని వారు ఇతరులికి అందించాలి. దీర్ఘ వ్యాధులతో బాధపడే వారితో లోకాన్ని నింపుతున్న అనుచిత వంటను మానటం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుని శక్తిని పెంపొందించుకోటం ప్రజలకు నేర్పించాలి. పాప రహిత స్థితిలో ఉన్న ఆదాముకి దేవుడిచ్చిన ఆహారం ఆ పాపరహిత స్థితిని తిరిగి సంపాదించటానికి ప్రయత్నం చేస్తున్న మానవుడికి ఉత్తమాహారం అని ఉచ్చరణ ద్వారాను ఆచరణ ద్వారాను స్పష్టం చేయండి.CDTel 482.3

    ఆరోగ్యసంస్కరణ నియమాలు బోధించే వారు మనుషుడి ప్రతీ చర్య జీవన చట్టాలకు అనుగుణంగా ఉండాలని గ్రహిస్తూ వ్యాధిని గురించి, వ్యాధి కారణాల్ని గురించి జ్ఞానం కలిగి ఉండాలి. ఆరోగ్య సంస్కరణ పై దేవుడిచ్చిన వెలుగు మన రక్షణ కోసం ప్రపంచ రక్షణ కోసం అనుగ్రహించబడింది. సృష్టికర్త తన నివాస స్థలంగా మానవ శరీరాలని ఏర్పర్చుకున్నాడని వాటి విషయంలో మనం నమ్మకమైన గృహ నిర్వాకులమని పురుషుల్ని స్త్రీలని మనం చైతన్యపర్చాలి. ” నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై యుందును. వారు నా ప్రజలై యుందురు.” 2 కొరింథీ 6:18CDTel 482.4

    ఆరోగ్య సంస్కరణ సూత్రాల్ని ఆచరించి గౌరవించండి. నిజాయితీ గలవారిని దేవుడు నడిపిస్తాడు. మితానుభవ నియమాల్ని ఆకర్షణీయమైన రీతిగా సమర్పించండి. ఆరోగ్యజీవనాన్ని గూర్చిన పుస్తకాల్ని పంచి పెట్టండి.CDTel 483.1

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents