Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    ఇశ్రాయేలు వైఫల్యం నుంచి పాఠం

    (1909) 9T 165 CDTel 16.3

    30. దేవుడు ప్రాచీన ఇశ్రాయేలుకి తన మాట ఇచ్చాడు. వారు తనను హత్తుకుని ఉండి, తన ఆజ్ఞలన్నింటిని నెరవేర్చినట్లయితే, తాను ఐగుప్తీయుల పైకి రప్పించిన తెగుళ్లను వారి మీదికి రప్పిచనన్నాడు. అయితే ఇది వారి విధేయత షరతు పై ఇచ్చిన వాగ్దానం. ఇశ్రాయేలీయులు తమకు వచ్చిన ఉపదేశాన్ని ఆచరణలో పెట్టి, తమకు ఒనగూడిన ఉపకారాల్ని సద్వినియోగ పర్చుకొని ఉంటే, ఆరోగ్యం సౌభాగ్యం విషయంలో వారు లోకానికి సాదృశ్య పాఠంగా ఉండేవారు. ఇశ్రాయేలీయులు దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చటంలో విఫలమయ్యారు. తమకు లభించి ఉండే దీవెనల్ని పోగొట్టుకున్నారు. కాని యోసేపు, దానియేలు, మోషే ఏలీయా, ఇంకా అనేక ఇతరుల్లో నిజమైన జీవన ప్రణాళికను అనుసరించిన జీవితాల సాదృశ్యం మనకుంది. నేడు అలాంటి నమ్మకమైన జీవితం అలాంటి ఫలితాల్నే ఇస్తుంది. “మీరు.. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు” (1 పేతురు 2:9) ఇవి మనల్ని ఉద్దేశించి రాసిన మాటలు.CDTel 16.4

    (1905) M. H.283 CDTel 17.1

    31. ఇశ్రాయేలీయులు తమకు వచ్చిన ఉపదేశాన్ని ఆచరణలో పెట్టి తమకు ఒనగూడిన ఉపకారాల్ని సద్వినియోపర్చుకుని ఉంటే, ఆరోగ్యం సౌభాగ్యం విషయంలో వారు లోకానికి సాదృశ్యపాఠంగా ఉండేవారు. ఒక ప్రజగా వారు దేవుని ప్రణాళిక ప్రకారం నివసించి ఉంటే, ఇతర జాతుల్ని బాధించిన వ్యాధుల నుంచి దేవుడు వారిని కాపాడే వాడు. ఏ యితర ప్రజలకన్నా వారికి సమున్నతమైన భౌతిక శక్తి, ప్రతిభ ఉండేవి.CDTel 17.2

    [(641-644 కూడా చూడండి]CDTel 17.3

    క్రైస్తవ పందెంCDTel 17.4

    (1890) C.T.B.H.25 32. “మరియు పందెమందు పోరాడు ప్రతీవాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.”CDTel 17.5

    ఆత్మనిగ్రహం మితానుభవ అలవాట్ల వల్ల కలిగే సత్ఫలితాల్ని ఇక్కడ సూచించటం జరిగింది. పూర్వం గ్రీసు ప్రజలు తమ దేవుళ్ల గౌరవార్థం స్థాపించిన వివిధ ఆటల్ని ఆధ్యాత్మిక పోరాటాన్ని దాని ప్రతిఫలాల్ని ఉదాహరించటానికి అపోస్తలుడు పౌలు మన ముందుంచుతున్నాడు. ఈ ఆటల్లో పాలు పొందాల్సినవారు కఠిన క్రమశిక్షణ కింద శిక్షణ పొందేవారు. శారీరక శక్తుల్ని బలహీనపర్చే ప్రతీ క్రియాచరణా నిషిద్ధం. భౌతిక శక్తిని, నైతిక ధైర్యాన్ని, ధృఢత్వాన్ని వృద్ధిపర్చటానికిగాను విలాస భోజనం, మద్యం నిషిద్ధం .CDTel 17.6

    ఆటగాళ్ళు దేనికోసం శ్రమపడ్డారో ఆ బహుమానం - పువ్వులతో కూర్చిన కిరీటాన్ని జన సందోహాల చప్పట్లు హర్షధ్వానాల మద్య ధరించటం - అత్యున్నత గౌరవంగా పరిగణ పొందేది. ఒక్కడికి మాత్రమే దక్కే అంత తుచ్చమైన బహుమానం పొందే ఆశాభావంతో అంత సహనం, అంత ఆత్మత్యాగం పాటించగలగటం జరిగితే వాడబారని కిరీటం, నిత్యజీవం పొందటానికి మరెంత త్యాగానికి మరింత ఆత్మనిరసనకు సంసిద్ధత ఉండాలి!CDTel 17.7

    మనం చేయాల్సిన పని వుంది. అది కఠినమైన శ్రద్ధతో చేయాల్సిన పని. మనం జీవిత చట్టాలు ఆరోగ్య చట్టాలకు అనుగుణంగా మన అలవాట్లు అభిరుచులు వాంఛల్ని తర్ఫీదు చేసుకోవాలి. ఈ విధంగా మనం అత్యుత్తమ దేహస్థితిని సాధించి, మంచి చెడు, మేలు కీడుల మధ్య తేడాను గ్రహించగల నిర్మల మనసును పొందవచ్చు.CDTel 18.1