Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First
    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents

    విచారశీలతపై, తీర్మానంపై ప్రభావం

    (1900) C.O.L.346 CDTel 42.1

    62. శారీరక శక్తిని తగ్గించేదేదైనా మనసును బలహీన పర్చి మంచిచెడ్డల మధ్య తేడాను గ్రహించటానికి దాని సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మంచిని ఎంపిక చేసుకునే సామర్థ్యం తగ్గుతుంది గనుక ఏది మంచి అని మనకు తెలుసునో దాన్ని చెయ్యటానికి తక్కువ చిత్త శక్తి ఉంటుంది.CDTel 42.2

    మన శారీరక శక్తుల దుర్వినియోగం మనం దేవున్ని మహిమ పర్చటానికి మన జీవితాన్ని ఉపయోగించే కాలావధిని తగ్గిస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన పనిని ముగించటానికి మనల్ని అసమర్థుల్ని చేస్తుంది.CDTel 42.3

    (1890) C.T.H.159 CDTel 42.4

    63. నైతిక, భౌతిక చట్టాలకు విధేయంగా తినటంలోనూ, దుస్తులు ధరించటంలోనూ సామాన్యత అన్న అంశంపై వెలుగు పొందినవారు తమ విధిని సూచిస్తూ ప్రకాశిస్తున్న వెలుగునుంచి తొలగిపోతారు. ఇతర విషయాల్లో తమ విధిని విడిచి పెడ్తారు. ప్రకృతి చట్టానికి అనుగుణంగా నివసించేందుకు తాము ఎత్తుకోవాల్సిన సిలువను విడిచి పెట్టటం ద్వారా వారు తమ అంతరాత్మను బండబార్చుతారు. నిందను తప్పించుకోవటానికి పది ఆజ్ఞల్ని అతిక్రమిస్తారు. కొందరైతే సిలువను సిగ్గును భరించటానికి తమ అసమ్మతిని కరాఖండిగా తెలుపుతారు.CDTel 42.5

    (1864) Sp. Gifts IV, 148, 149 CDTel 42.6

    64. స్వీయ కోర్కెల తృప్తి ద్వారా తమ మీదికి వ్యాధి తెచ్చుకునేవారు శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగా ఉండరు. వారు సత్యం తాలూకు నిదర్శనాన్ని అవగతం చేసుకోలేరు. దేవుని న్యాయ విధుల్ని గ్రహించలేరు. అలాంటి వారు తాము అనుసరిస్తున్న మార్గం విడిచి పెట్టకుండా ఇంకా అధోగతికి దిగజారటానికి అదే మార్గంలో కొనసాగుతుంటే వారికి చెయ్యి అందించటానికి మన రక్షకుడు కిందదాకా వంగడు. తమ దేహాన్ని మనసుల్ని ఆరోగ్యంగా ఉంచుకోటంలో అందరూ తమ శక్తిమేరకు కృషిచెయ్యాలి. వారు ఓ నికృష్ట వాంఛను తృప్తి పర్చుకోటం ద్వారా తమ మానసిక శక్తుల్ని మొద్దుబార్చుకుని తమ విచక్షణా శక్తుల్ని మసక బార్చుకోటం వల్ల దేవుని సమున్నత ప్రవర్తనను అభినందించలేకపోతే అర్పణను అంగీకరించనట్లు వారి అర్పణను అంగీకరించడు. శరీరానికి ఆత్మకు కలిగిన కల్మషంనుంచి తమను తాము పవిత్రుల్ని చేసుకుని ప్రభువు భయంతో పరిశుధ్ధతను సంపూర్తి చేసుకోవలసిందిగా దేవుడు వారిని కోరుతున్నాడు. తిండి యావను, నికృష్ణ వాంఛల్ని ఉపేక్షించటం ద్వారా ఆరోగ్యంగా నివసించటానికి ఆరోగ్యవంతమైన మనసు పరిశుద్ధ ఆలోచన కలిగి ఉండటానికి నీతిలో దేవునికి అర్పణను అర్పించటానికి మనుషుడు చేయగలిగిన కృషి చేసిన తర్వాత అప్పుడు మాత్రమే తుఫానుకి ఎగసిపడే తరంగాలపై ఓడ మాదిరిగా అతడు అద్భుత కార్యం ద్వారా రక్షించబడ్డాడు. ఓడ భద్రంగా ఉండటానికి దేవుడు ఆదేశించిందంతా నోవహు చేశాడు. దేవుడు అప్పుడు మానవుడు ఏది చెయ్యలేడో దాన్ని చేసి తన అద్భుత శక్తి ప్రదర్శన ద్వారా ఓడను కాపాడాడు.CDTel 42.7

    (1867) 1T618,619 CDTel 43.1

    65. తిండి వాంఛ తృప్తి ద్వారా జరిగే అన్నకోశ దుర్వినియోగాలు సంఘంలోని అధిక శాతం శ్రమలకు మూలం. నిగ్రహం లేకుండా అర్థరహితంగా తిండితిని పనిచేసేవారు అసంబద్దంగా మాటలాడటం వ్యవహరించటం చేస్తారు. ఆశనిగ్రహం లేని వ్యక్తి సహనశీలి కాడు. ఆశనిగ్రహం లేని వ్యక్తి కావటానికి సారా తాగనక్కరలేదు. అమితంగా తినటం, తరచుగా తినటం, ఎక్కువ తినటం, వేపుళ్ళు మొదలైన అనారోగ్యకర ఆహారం తినటం అన్న పాపం జీర్ణమండల అవయవాల ఆరోగ్యదాయక చర్యను దెబ్బతీస్తుంది. మెదడుకు హాని కలిగిస్తుంది, విచక్షణా శక్తిని వక్రీరిస్తుంది, హేతుబద్ద మైన, ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన ఆలోచనను చర్యను నివారిస్తుంది. ఇది సంఘంలోని శ్రమలకు మూలం. కాబట్టి దైవ ప్రజలు దేవుడు తమను అంగీకరించే స్థితిలో ఉండాలంటే అనగా ఆయనకు చెందిన తమ శరీరాలతోను, ఆత్మలతోను ఆయన్ను మహిమపర్చే ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలంటే వారు తమ తిండి యావను ఉపేక్షించి, అన్ని విషయాల్లో ఆశానిగ్రహం పాటించాలి. అప్పుడు వారు సత్యాన్ని దాని రమ్యతను స్పష్టంగా అవగాహన చేసుకుని దాన్ని తమ జీవితాల్లో ఆచరించవచ్చు. మన విశ్వాసాన్ని వ్యతిరేకించే శత్రువులు సత్యం తాలూకు పరిచర్యను నిందించటానికి వారికి అవకాశం ఇవ్వకుండా జ్ఞానయుక్తంగా ఉండగలుగుతారు.CDTel 43.2

    (1870) 2T404 CDTel 44.1

    66. సహోదరుడు, సహోదరి జీ. మేల్కోవలసిందిగా మిమ్మల్ని బతిమాలుతున్నాను. మీరు ఆరోగ్య సంస్కరణ వెలుగును అంగీకరించి దాని ప్రకారం నివసించటం లేదు. మీ తిండి వాంఛల్ని నియంత్రించుకుని ఉంటే మీకు ఎంతో శ్రమ ఖర్చు తప్పేవి. ఇంకా ప్రధానమైన విషయమేంటంటే మీకు మరింత మెరుగైన శరీరారోగ్యం , నిత్యసత్యాల్ని అభినందించేందుకు మరింత మనోవికాసం ఉండేది. సత్యాన్ని గూర్చిన నిదర్శనాల్ని పరిశీలించేందుకు మరింత నిర్మలమైన మెదడు ఉండేది. మీకున్న నిరీక్షణకు కారణాన్ని ఇతరులతో పంచుకోటానికి మీరు మరింత మెరుగుగా సిద్ధపడి ఉండేవారు.CDTel 44.2

    (1867) 1T487,489 CDTel 44.3

    67. కొందరు సంస్కరణ కృషిని ఎగతాళి చేశారు. సంస్కరణ అనవసరమని అది ప్రస్తుత సత్యాన్నుంచి మనసుల్ని పక్కకు మళ్ళించటానికి ఏర్పాటు అయిన ఉద్రేకమని అన్నారు. అట్టివారు పరిస్థిలు హద్దు మీరే దాకా విషయాన్ని సాగదీస్తున్నారని, తాము మాట్లాడున్నదేంటో తమకే తెలియదని ఎద్దేవా చేశారు. దైవభక్తులుగా చెప్పుకుంటున్న స్త్రీలు పురుషులు నడినెత్తినుంచి అరికాలు వరకు వ్యాధి కలవారై ఉండగా, చెడు తిండి వాంఛను తృప్తి పర్చుకోటం ద్వారాను అమిత శారీరక శ్రమ ద్వారాను వారి శారీరక, మానసిక, నైతిక శక్తులు బలహీనమౌతుండగా, సత్యానికి నిదర్శనాల్ని, దేవుని న్యాయవిధుల్ని వారు ఎలా అవగాహన చేసుకోగలుగుతారు? వారి నైతిక మానసిక శక్తులు మసకబారితే వారు ప్రాయశ్చిత్తం విలువను గాని లేక దేవుని సేవ తాలూకు సమున్నత స్వభావాన్ని గాని అభినందించలేరు. దైవవాక్య పఠనం వారికి ఆనందాన్నివ్వదు. అజీర్తి వ్యాధితో బాధపడుతూ భయం భయంగా ఉన్న వ్యక్తి తనలోని నిరీక్షణకు కారణం అడిగే ప్రతీ మనిషికీ సమాధానం ఇవ్వటానికి ఎల్లప్పుడూ ఎలా సిద్ధంగా ఉండగలడు? అట్టివ్యక్తి ఎంత త్వరగా తికమకపడి, ఆందోళన చెంది, తన వ్యాధిగ్రస్త ఆలోచనవల్ల విషయాల్ని అపార్థం చేసుకుని, క్రీస్తు జీవితంలో ప్రస్ఫుటమైన సాత్వికం ప్రశాంతత లేకుండా సబబులేని మనుషులతో వాదమాడే తరుణంలో తను నమ్ముతున్నట్లు చెప్పుకునే విశ్వాసానికి విఘాతం కలిగిస్తాడు! విషయాల్ని సమున్నత మత దృక్పథంతో పరిశీలిస్తూ, క్రీస్తుని పోలి ఉండేందుకు మనం ధృఢమైన సంస్కర్తలుగా వ్యవహరించాలి.CDTel 44.4

    ఆయనకు మనపై ఉన్న హక్కుల్ని గౌరవిస్తూ, ఆయనకు విధేయులమై తనవైన మన శరీరాత్మలతో ఆయన్ని మహిమపర్చేందుకు చివరగా ఆయన సింహాసనం ముందు నిందారహితంగా నిలబడేందుకు, మన పరలోకపు తండ్రి ఆరోగ్య సంస్కరణ అనే మహత్తర దీవెనను మన కు అనుగ్రహిస్తున్నట్లు దర్శనంలో చూశాను. ప్రమాణాన్ని పెంచి ముందడుగు వెయ్యాల్సిందిగా మన విశ్వాసం మనల్ని ఆదేశిస్తున్నది. ఇతర ఆరోగ్య సంస్కర్తలు అనుసరించిన మార్గాన్ని అనేకులు ప్రశ్నిస్తుండగా, వారు హేతుబద్దత గల మనుషులుగా తమవంతు కృషి చెయ్యాలి. మన మానవ జాతి శోచనీయ పరిస్థితిలో ఉంది. అన్ని రకాల వ్యాధులతో బాధపడుంది. అనేకనుంది వ్యాధిని వారసత్వంగా పొంది తమ తల్లిదండ్రుల చెడు అలవాట్ల వల్ల బాధ అనుభవిస్తున్నారు. అయినా వారు తమ తల్లిదండ్రులు అనుసరించిన మార్గాన్నే తమ విషయంలోను తమ బిడ్డల విషయంలోనూ అనుసరిస్తున్నారు. వారు తమ విషయంలోను అజ్ఞానులే. వారు జబ్బుపడతారు. అయినా తమ తీవ్ర బాధకు తమ సొంత దురభ్యాసాలే కారణమని గుర్తించరు. దేవుని వద్దనుంచి వెలుగు పొంది దానిననుసరించి నడుస్తున్నందువల్ల ఎంతో మేలు పొందుతున్న వారు ఆ అంశం పై జ్ఞానం లేనందువల్ల ఇంకా బాధననుభవిస్తున్న వారి విషయంలో మరింత శ్రద్ధ, ఆసక్తి చూపించుటం వారి విధి అని దర్శనంలో చూశాను. రక్షకుడు త్వరలోనే వస్తాడని కని పెడున్న సబ్బాతు విశ్వాసులు సంస్కరణ మహాకార్యంలో ఆసక్తి చూపించకపోటం జరగకూడదు. సంస్కరణ కృషి భారం తమపై ఉన్నదని, ఆ అంశంపై ఆందోళన చేసి, ఇతరులకి వర్తమానం సుబోధకం చెయ్యాలని స్త్రీలకు పురుషులకు బోధకులికి సామాన్య ప్రజలకు ఉపదేశించటం అవసరం.CDTel 45.1

    ఉత్తరం 93,1898 CDTel 45.2

    68. ప్రతీ వ్యక్తి విజయానికి శారీరకమైన అలవాట్ల పాత్ర చాలా ఉంది. మీ ఆహారం విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే శరీరం దాని విధుల్ని సక్రమంగా నిర్వర్తించటానికి దాన్ని పోషించే ఆహారం ఎంత సామాన్యంగా ఉద్రేక భావాలు పుట్టించనిదిగా ఉంటే మీ విధి విషయమై మీ అభిప్రాయం అంత స్పష్టంగా ఉంటుంది. దేహ అనారోగ్య స్థితివల్ల ప్రతీ విషయం మబ్బుకమ్మినట్లు కనిపించకుండేందుకు ప్రతి అలవాటును ప్రతి అభ్యాసాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.CDTel 45.3

    M.S.129,1901 CDTel 46.1

    69. మన దేహారోగ్యాన్ని మనం తినే ఆహారం పోషిస్తుంది. మన ఆహార వాంఛలు పరిశుద్ధమైన మనసు నియంత్రణ కింద లేకపోతే, అన్నపానాల విషయంలో మనం నిగ్రహం పాటించకపోతే నిత్యజీవానికి వారసుడనవ్వటానికి నేనేమి చెయ్యాలి? అన్న అంశంపై లేఖనం ఏం చెబుతున్నదో తెలుసుకుని నేర్చుకునే ఉద్దేశంతో వాక్యం అధ్యయనం చేసే మానసిక, శారీరక ఆరోగ్యం మనకుండదు. ఆరోగ్యానికి తోడ్పడని ఏ అలవాటైనా శరీరంలో అనారోగ్య స్థితికి కారణమౌతుంది. అన్నకోశపు సజీవ యంత్రాంగం దెబ్బతింటుంది. అది తన విధిని సజావుగా నిర్వర్తించలేదు. శోధనకు లొంగి పాపం చేసే మానసిక ప్రవృత్తికి ఆహారానికి దగ్గర సంబంధం ఉంది.CDTel 46.2

    (1869) 2T202,203 CDTel 46.3

    70. దివ్య శక్తిగల రక్షకుడే ప్రార్థన అవసరమని భావిస్తే బలహీనులు పాపులు అయిన మనుషులు తమకు ప్రార్థన-మనఃపూర్వక, ఎడతెగని ప్రార్థన-మరెంత ఎక్కువగా అవసరమని భావించాలి! భీకర శోధనను ఎదుర్కొన్నప్పుడు క్రీస్తు ఏమీ తినలేదు. తనను తాను దేవునికి అప్పగించుకుని, మనఃపూర్వక ప్రార్థన ద్వారా తండ్రికి సంపూర్ణ సమర్పణ ద్వారా విజయం సాధించాడు. ఈ చివరి దినాలకు దేవుడు ఉద్దేశించిన సత్యాన్ని విశ్వసిస్తున్నట్లు చెప్పే క్రైస్తవుడు ప్రార్థించటంలో గొప్ప ఆదర్శనీయుడైన క్రీస్తును ఏ యితర క్రైస్తవ సమూహాలకన్నా ఎక్కువగా అనుకరించాలి.CDTel 46.4

    శిష్యుడు తన ప్రభువులాగ, సేవకుడు తన యజమానుడులాగ, ఉండటం సరిపోతుంది. ఆత్మో పేక్షకన్నా, వ్యాధుల నివారణకన్నా, మానసిక ఆరోగ్యం కన్నా మనం భోజనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం కనుక మన భోజన బల్లలు విలాసవంతమైన ఆహారంతోను ఆహార పదార్థాలతోను తరచుగా నిండి ఉంటాయి. ఆ ఆహారం ఆహార పదార్థాలు ఆరోగ్యకరమైనవీ కావు. మనకు అవసరమైనవి కావు. యేసు తన తండ్రి వద్దనుంచి శక్తికోసం ప్రార్థించాడు. మిక్కిలి భాగ్యవంతం విలాసవంతం అయిన భోజనానికి కూర్చోటం కన్నా ఇది తనకు సయితం ఎక్కువ విలువగలదిగా దేవుని కుమారుడు పరిగణించాడు. చీకటి శక్తులతో పోరాడటానికి, మనకు నియమితమైన పనిని చెయ్యటానికి కావలసిన శక్తిని పొందటానికి, ప్రార్థన అవసరమని ఆయన మనకు నిదర్శనాన్నిస్తున్నాడు. మన సొంత బలం బలహీనత. దేవుడు మనకిచ్చేది మహాశక్తి. దాన్ని అందుకునే ప్రతీ వ్యక్తినీ అది విజేతకన్నా అధికుణ్ణి చేస్తుంది.CDTel 46.5

    [తిండి ప్రీతి మానసిక సమతుల్యతను దెబ్బతీస్తుంది-297] CDTel 47.1

    [తిండి మనస్సాక్షిని మొద్దుబార్చుతుంది-72] CDTel 47.2

    Larger font
    Smaller font
    Copy
    Print
    Contents