Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    “దాన్ని కనపడనివ్వకండి”

    ఉత్తరం 84, 1898 CDTel 304.3

    436. నేను వైద్యుల్ని, సోదరుడు — ని కలిసి వారితో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడాను. నా ఆత్మకు శాంతి కలిగింది. వారు శోధింపబడ్డారని వారు శోధనకు లొంగుతున్నారని వారితో చెప్పాను. సంరక్షణను సంపాదించటానికి తాము మాంసాన్ని భోజనబల్ల మీద పెడతారని, ఆ తర్వాత ఇంకో అడుగు ముందుకేసి కాఫీ, టీ, మాదకద్రవ్యాలు సరఫరా చెయ్యటానికి శోధించబడతారని... మాంసాహారం ఎవరికైతే ఇచ్చారో వారి ద్వారా శోధన వస్తుందని, అలాంటి వారికి ఆరోగ్య కేంద్రంతో సంబంధం ఉంటే వారు నియమాల్ని త్యాగం చెయ్యటానికి పలువిధాలుగా శోధిస్తారని, అసలు మాంసమే ఇవ్వకూడదని, అప్పుడు మాంసం భోజన బల్లమీద ఉండదు కాబట్టి దాన్ని బహిష్కరించాల్సిన అవసరమే ఉండదని చెప్పాను..... మాంసం తినకుండా ఉండటం అలవాటు చేసేవరకు వారు భోజనబల్లల పై మాంసం తినవచ్చు అని వాదించటం జరిగింది. కాని నిత్యం కొత్త రోగులు రావటంతో అదే సాకు మాంసాహారాన్ని స్థిరపర్చుతుంది. వద్దు, భోజనబల్ల పై ఒకసారి కూడా దాన్ని కనపడనివ్వవద్దు. అప్పుడు మాంసాహారం పై మీ ఉపన్యాసాలు మీరు ప్రచురించాల్సిన వర్తమానాలికి అనుకూలంగా ఉంటాయి అని చెప్పాను.CDTel 304.4