Loading...
Larger font
Smaller font
Copy
Print
Contents

ఆహారం ఆహార పదార్ధాలపై సూచనలు, సలహాలు

 - Contents
  • Results
  • Related
  • Featured
No results found for: "".
  • Weighted Relevancy
  • Content Sequence
  • Relevancy
  • Earliest First
  • Latest First

    అనుబంధం

    I - ఆరోగ్య సంస్కర్తగా ఎలెన్ జి. వైట్ వ్యక్తిగతానుభవం

    II - ఆరోగ్య సంస్మరణ, బోధన సంబంధంగా జేమ్స్ వైట్ ప్రకటన

    అనుబంధం I ఆరోగ్య సంస్కర్తగా ఎలెన్ జ. వైట్ వ్యక్తిగతానుభవం

    (ఆహార అలవాట్లు అభ్యాసాల గురించి శ్రీమతి వైట్ కలం నుంచి వచ్చే ఉపదేశాన్ని అధ్యయనం చెయ్యటంలో ఆలోచనాపరుడైన విద్యార్థి ఈ దిగువ సూత్రాల్ని గుర్తించగలడు :CDTel 503.1

    మొదటిది : ” ఆరోగ్య సంస్కరణ ప్రగతిశీలమవ్వాలి”- M.H.320 ఆదిలో వెలుగు సంపూర్ణంగా ఇవ్వబడలేదు. ప్రజలు అవగాహన చేసుకుని ఆచరించే కొద్దీ వెలుగును అప్పుడప్పుడు ఇంతలంతల శక్తితో అనుగ్రహించటం జరిగింది. ఉపదేశం ఇచ్చిన కాలంలో సామాన్య ఆహార అలవాట్లు అభ్యాసాలకు అవి సరిపడి ఉన్నాయి.CDTel 503.2

    రెండోది : “ఆహారానికి సంబంధించి ఓ ఖచ్చిత మార్గాన్ని మేము నిర్దేశించం” -ST 159. హానికరమైన కొన్ని ఆహారపదార్థాల గురించి పదేపదే హెచ్చరించటం జరిగింది. ఏతా వాతా సాధారణ నియమాలు రూపొందించటం జరిగింది. ఈ విశాల సూత్రాల సవిస్తర వర్తింపును కొన్నిసార్లు ప్రయోగం ద్వారాను, అందుబాటులో ఉన్న ఉత్తమ శాస్త్రీయ అభిప్రాయాల ద్వారాను నిర్ధారించాలి.CDTel 503.3

    మూడోది : ” ఎవరికీ ప్రామాణికంగా నన్ను నేను భావించుకోను” - ఉత్తరం 45, 1903. ప్రయోగం ద్వారా కొన్ని నియమాలు రూపొందించుకుని శ్రీమతి వైట్ కొన్నిసార్లు తన సొంత గృహ ఆహార నియమాల్ని వివరించేది. కాని ఇతరులు వాటిని తు.చ. తప్పకుండా ఆచరించటానికి ఆమె ఉద్దేశించలేదు - సంకలన కర్తలు)CDTel 503.4